సెగ బాగానే తగిలింది
విశాఖపట్నంలో ఆయన తిరగులేని నాయకుడు. వలస వచ్చి విశాఖలో స్థిరపడినా ప్రజలు ఆయనను మూడుసార్లు ఎమ్మెల్యేను చేశారు. టీడీపీ యాంటీ వేవ్ లోనూ ఆయన గెలిచారంటే ఆయనపై [more]
విశాఖపట్నంలో ఆయన తిరగులేని నాయకుడు. వలస వచ్చి విశాఖలో స్థిరపడినా ప్రజలు ఆయనను మూడుసార్లు ఎమ్మెల్యేను చేశారు. టీడీపీ యాంటీ వేవ్ లోనూ ఆయన గెలిచారంటే ఆయనపై [more]
విశాఖపట్నంలో ఆయన తిరగులేని నాయకుడు. వలస వచ్చి విశాఖలో స్థిరపడినా ప్రజలు ఆయనను మూడుసార్లు ఎమ్మెల్యేను చేశారు. టీడీపీ యాంటీ వేవ్ లోనూ ఆయన గెలిచారంటే ఆయనపై ప్రజలకు ఉన్న నమ్మకం అలాంటిది. ఆయనే వెలగపూడి రామకృష్ణ. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఆయన విజయానికి ఎదురులేదు.
యాక్టివ్ గా లేకపోవడానికి…..
అయితే కొద్ది రోజులుగా వెలగపూడి రామకృష‌్ణ విశాఖపట్నంలో పెద్దగా కన్పించడం లేదు. నిజానికి ఆయన ఎన్నడూ తూర్పు నియోజకవర్గాన్ని వదిలపెట్టరు. అలాగే విశాఖ తెలుగుదేశం పార్టీ కార్కక్రమాల్లోనూ వెలగపూడి రామకృష్ణ యాక్టివ్ గా ఉంటారు. ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం వంటి అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలగపూడి రామకృష్ణ ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. అలాంటి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఇప్పుడు కన్పించడం లేదు.
వలస వచ్చిన నేతగా….
నిజానికి కృష్ణా జిల్లా నుంచి విశాఖ కు వలస వచ్చిన వెలగపూడి రామకృష్ణ దశాబ్దాల క్రితమే విశాఖలో స్థిరపడిపోయారు. మద్యం వ్యాపారాలతో కొంత ఆర్థికంగా స్థిరపడ్డారు. తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణ ఎదిగారు. తూర్పు నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయాలను సాధించారు. అయితే మూడు రాజధానుల ప్రకటనను తొలుత వెలగపూడి రామకృష్ణ సమర్ధించారు. అయితే తర్వాత పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తున్నట్లు చెప్పారు.
ఆ తర్వాత నుంచి….
దీంతో పాటుగా అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల కు వ్యతిరేకంగా టీడీపీ స్టాండ్ తీసుకోవడంతో విశాఖలో వెలగపూడి రామకృష్ణకు నిరసనల సెగ తగిలింది. ఒకసారి వైసీపీ వెలగపూడి రామకృష్ణ ఇంటిని ముట్టడించింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో వెలగపూడి రామకృష్ణ అసెంబ్లీ సమావేశాల తర్వాత సైలెంట్ అయిపోయారు. విశాఖకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా వెళ్లడం లేదు. దీంతో వెలగపూడి రామకృష్ణకు సెగ బాగా తగిలిందంటున్నారు.