మంత్రి వెలంపల్లికి అభయం.. ఇక ఢోకా లేదా..?
త్వరలోనే మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్న తరుణంలో చాలా మంది మంత్రులు తమ పేరు ఉంటుందా ? ఉండదా ? అని తర్జన భర్జన [more]
త్వరలోనే మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్న తరుణంలో చాలా మంది మంత్రులు తమ పేరు ఉంటుందా ? ఉండదా ? అని తర్జన భర్జన [more]
త్వరలోనే మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్న తరుణంలో చాలా మంది మంత్రులు తమ పేరు ఉంటుందా ? ఉండదా ? అని తర్జన భర్జన పడుతున్నారు. ఇక దీనిపై ఆన్‌లైన్ మీడియాల్లో రోజుకో వార్త తెరమీదికి వస్తోంది. ఆ మంత్రి ఉంటారు..ఈ మంత్రులు ఇంటికే అంటూ.. వివిధ రూపాల్లో కథనాలను ప్రచారం చేస్తున్నారు. దీంతో మంత్రులు అందరూ తమ పదవుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నలుగురు నుంచి ఐదుగురు వరకు కూడా ఇక, తమ పదవులకు గండం వచ్చినట్టేనని నిర్ణయించుకున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.
వరస వివాదాలు…..
అయితే, ఇంత హడావుడిలోనూ ఒకే ఒక మంత్రి మాత్రం చాలా ధైర్యంగా ఉన్నారట. ఆయన తన పదవికి ఎలాంటి ఢోకా లేదని తన అనుచరులతో చెబుతున్నారని కొత్తగా ప్రచారం జరుగుతుండడం గమనార్హం. దీంతో ఆయన ఎవరు ? ఆయనకు ఉన్న ధీమా ఏంటి ? అనే చర్చ సాగుతోంది. కృష్ణాజిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెలంపల్లి శ్రీనివాసరావు.. ప్రస్తుతం దేవదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే, వెలంపల్లి శ్రీనివాసరావు ఇటీవల కాలంలో వివాదాస్పద మయ్యారు. దేవాలయాలపై వరుస దాడులు, ప్రతిపక్షం నుంచి విమర్శల జడి పెరిగిపోయింది. ఇక, విగ్రహాల విధ్వంసంపై బీజేపీ భారీ ఎత్తున దండెత్తింది.
మారుస్తున్నారన్న ప్రచారంతో…..
దీంతో మంత్రులు మార్చడం అంటూ జరిగితే.. ముందు మార్చే వారిలో వెలంపల్లి శ్రీనివాసరావు పేరు కూడా ఉంటుందని అందరూ అనుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి వర్గంలోని ఒకరిద్దరు కూడా గుసగుసగా చెప్పుకొచ్చారు. అలాంటి మంత్రి ఇప్పుడు ధైర్యంగా ఉండడమే కాకుండా తనను మార్చే పరిస్థితిలేదని అంటున్నారట. దీని వెనుక.. చాలా ఉందని అంటున్నారు. గతంలో రెండు పార్టీలు మారిన నేపథ్యంలో ఆయన విస్తృతమైన రాజకీయ పలుకుబడి ఉండడంతోపాటు తన సామాజిక వర్గంలో గట్టి పట్టు ఉండడం.. ఇప్పటికే ఇద్దరని తన సామాజిక వర్గానికి చెందిన వారిని వైసీపీలోకి తీసుకురావడం వంటివి ఆయనకు అభయం కలిగిస్తున్నాయట.
తన పదవికి….
అదే సమయంలో మంత్రులతో కలివిడిగా ఉంటున్నారనే ప్రచారం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో వెలంపల్లి శ్రీనివాసరావు మంచి స్నేహం పెంచుకున్నారట. వారి కనుసన్నల్లో ఆయన వ్యవహరిస్తున్నారట. దీంతో వారు ఆయనను సపోర్టు చేస్తున్నారని, ఇటీవల భారీ వివాదం వచ్చినప్పుడు కూడా వెలంపల్లి శ్రీనివాసరావుకి అనుకూలంగా మంత్రులు కౌంటర్లు ఇవ్వడం వెనుక కూడా వీరి వ్యూహం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ కారణాలతోనే వెలంపల్లి తనపదవికి ఢోకాలేదని భావిస్తున్నారని ప్రచారంలో ఉంది.
ఈయనను ఎంకరేజ్ చేస్తూ….
పైగా వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారిని రీప్లేస్ చేసే విషయంలోనూ సరైన నాయకులు లేకపోవడం వెలంపల్లి శ్రీనివాసరావుకి కలిసి వస్తోందంటున్నారు. పైగా వెల్లంపల్లికి బొత్స సపోర్టు ఫుల్లుగా ఉందట. వెల్లంపల్లిని మార్చాల్సి వస్తే అదే సామాజిక వర్గానికి చెందిన మరో సీనియర్ నేత, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కూడా రేసులో ఉన్నారు. ఆయన బొత్సకు రాజకీయ శత్రువు. ఆయనకు మంత్రి పదవి రావడం ఇష్టం లేని బొత్స వెల్లంపల్లికి బాగా సహకారం అందిస్తున్నారట. ఇక ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రులు, సీనియర్లు సైతం గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా వైశ్య కోటాలో మంత్రి పదవి రేసులో ఉండడం…. ఆయనకు పదవి రావడం స్థానిక నేతలకు ఇష్టంలేకపోవడంతో వారు కూడా వెలంపల్లి శ్రీనివాసరావుని బాగా ఎంకరేజ్ చేస్తున్నారట. ఈ పరిణామాలతో వెల్లంపల్లిలో ఎక్కడా లేని ఆనందం వస్తోందట.