ఫస్ట్ జంప్ చేసేది ఈయనేనట

వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు ముభావంగా ఉంటున్నారు. పార్టీ అధిష్టానం తమను పట్టించుకోకపోవడం, తమ ప్రత్యర్థులకు పెద్ద పీట వేస్తుండటాన్ని వారు సహించలేకపోతున్నారు. అయితే మరో నాలుగేళ్ల పాటు [more]

Update: 2020-02-26 02:00 GMT

వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు ముభావంగా ఉంటున్నారు. పార్టీ అధిష్టానం తమను పట్టించుకోకపోవడం, తమ ప్రత్యర్థులకు పెద్ద పీట వేస్తుండటాన్ని వారు సహించలేకపోతున్నారు. అయితే మరో నాలుగేళ్ల పాటు అధికారం ఉండటంతో వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నట్లే కనపడుతోంది. ఎన్నికల సమాయానికి ఇతర పార్టీలకు వీరు జంప్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. అందులో రామచంద్రాపురం వేసీపీ ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ ప్రధముడిగా కన్పిస్తున్నారు.

బలమైన నేత కావడంతో…..

రామచంద్రాపురం నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు బలమైన నేత. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు హవా చలాయించేవారు. అలాగే మొన్నటి వరకూ ఇదే నియోజకవర్గంలో ప్రస్తుత మంత్రి పిల్ి సుభాష్ చంద్రబోస్ కీలకంగా ఉండేవారు. అయితే మొన్నటి ఎన్నికల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ ను మండపేట నియోజకవర్గానికి పంపిన జగన్ రామచంద్రాపురంలో వైసీపీ టిక్కెట్ ను వేణుగోపాలకృష్ణకు ఇచ్చేశారు. టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులపై వేణుగోపాల కృష్ణ విజయం సాధించారు.

మూడు వర్గాలుగా….

అయితే ఎన్నికల ఫలితాల తర్వాత తోట త్రిమూర్తులు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ లో చేరారు. ఆయనకు ఇంతవరకూ ఎలాంటి కీలక పదవిని పార్టీ ఇవ్వలేదు. అయినా రామచంద్రాపురం వైసీపీలో మూడు వర్గాలుగా విడిపోయి క్యాడర్ ను అయోమయంలో పడేస్తున్నాయి. తోట త్రిమూర్తులు వైసీపీలో చేరిన తర్వాత రామచంద్రాపురం రాజకీయాలు మరింత వేడెక్కాయి. సుభాష్ చంద్రబోస్ వర్గం కొంత సర్దుకుపోయినట్లు కన్పిస్తున్నా ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ వర్గం ఎక్కడా తగ్గడం లేదు.

ఎన్నికలకు ముందు….

అందుకే ఇటీవల వైవీ సుబ్బారెడ్డి సమక్షంలోనే తోట త్రిమూర్తులపై వేణుగోపాలకృష్ణ వర్గం దాడికి ప్రయత్నించింది. వచ్చే ఎన్నికల పరిస్థితులను బేరీజు వేసుకుంటే వేణుగోపాలకృష్ణ టిక్కెట్ కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. తోట త్రిమూర్తులు గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. మరోవైపు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ప్రయత్నాలు చేసే అవకాశముంది. మూడు వర్గాలు ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి లేదన్నది వాస్తవం. ఈ పరిస్థితుల్లో పార్టీని ఎన్నికలకు ముందు వీడే నేతల్లో వేణుగోపాలకృష్ణ ఫస్ట్ లిస్ట్ లో ఉంటారంటున్నారు. తోట త్రిమూర్తులను ఢీకొట్టాలంటే ఏ పార్టీ అయినా తనకు టిక్కెట్ ఇవ్వక తప్పదన్న ధీమాలో వేణుగోపాల కృష్ణ ఉన్నారు. మొత్తం మీద రామచంద్రాపురంలో రాజకీయం నిత్యం హీట్ గానే ఉండనుంది.

Tags:    

Similar News