రజనీ దూకుడు వెనుక.. షాడో మినిస్టర్
ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ.. వివాదాలకు కేంద్రంగా ఉన్న వైసీపీ నాయకురాలిగా ఆమె గురించి పార్టీలో ఎప్పుడూ గుసగుసలు వినిపిస్తాయి. తాజాగా మరోసారి [more]
ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ.. వివాదాలకు కేంద్రంగా ఉన్న వైసీపీ నాయకురాలిగా ఆమె గురించి పార్టీలో ఎప్పుడూ గుసగుసలు వినిపిస్తాయి. తాజాగా మరోసారి [more]
ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ.. వివాదాలకు కేంద్రంగా ఉన్న వైసీపీ నాయకురాలిగా ఆమె గురించి పార్టీలో ఎప్పుడూ గుసగుసలు వినిపిస్తాయి. తాజాగా మరోసారి వివాదానికి కేంద్రంగా మారారని అంటున్నారు. రజనీ రాజకీయ ఎంట్రీయే పెద్ద సంచలనం.. ఆమెకు టిక్కెట్ రావడం మరో సంచలనం. వాస్తవానికి రాజకీయాలు కొత్త. తొలుత టీడీపీలో చేరాలని అనుకుని.. అక్కడ సమీకరణలు కుదరకపోవడంతో వైసీపీలోకి వచ్చారు. ఈ సమయంలో ఆమెకు వైసీపీలోని సజ్జల రామకృష్ణారెడ్డి సహాయం చేశారన్న ప్రచారం అయితే ఉంది.
మర్రిని పక్కన పెట్టడం వెనక?
చిలకలూరిపేట సీటు రేసులో ఉన్న మర్రి రాజశేఖర్‌ను బుజ్జగించి.. రజనీకి ఛాన్స్ ఇవ్వడంలో సజ్జల చక్రం తిప్పారని అంటున్నారు. అయితే, వీరి మధ్య 'సహాయం' అలానే కొనసాగుతోందని చెబుతున్నారు పార్టీలోని ఓ వర్గం నాయకులు. ఆయన మద్దతు చూసుకునే విడుదల నియోజకవర్గంపై పట్టు సాధించడంతో పాటు.. పార్టీలోనూ మంత్రి పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. పార్టీలో కీలకమైన నాయకుడు.. మర్రి రాజశేఖర్‌ను పక్కన పెట్టడం వెనుక కూడా విడదల ఉన్నారన్న ప్రచారం వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆమె లాబీయింగ్ కారణంగానే మర్రిని పక్కన పెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఎంపీ విషయంలోనూ…..
మరోవైపు.. నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతోనూ విడదల ఢీ అంటే ఢీ అంటున్నారు. ఆయనపై పైచేయి సాధించేందుకు ఉన్న ప్రతి అవకాశాన్నీ విడదల రజనీ సద్వినియోగం చేసుకుంటున్నారు. కోటప్పకొండ తిరునాళ్లే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఎంపీ కారును సైతం ఎమ్మెల్యే అనుచరులు, కుటుంబ సభ్యులే నిలువరించి దాడులు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇప్పటి వరకు చర్యలు లేవు. దీనివెనుక కూడా సజ్జల వంటి బలమైన నాయకుడి అభయం.. విడదలకు ఉందని .. నియోజక వర్గంలోను పార్టీలోనూ చర్చకు వస్తుండడం గమనార్హం.
రజనీ విషయంలోనే…..
ఇక, ఇప్పుడు తన ఫోన్లను ట్యాప్ చేయాలంటూ.. ఎంపీ లావు.. పోలీసులను పురమాయించారని, సో.. దీనిపై చర్యలు తీసుకోవాలని.. విడదల రజనీ కోరిన మరుక్షణంలోనే ఇద్దరు పోలీసు అధికారులను వీఆర్‌కు పంపేశారు. ఆమె ఫిర్యాదు చేయడమే ఆలస్యం వెంటనే డీఎస్పీ, సీఐను రాత్రికి రాత్రే వీఆర్‌లో పెట్టేశారు. నిజానికి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఒక ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదుతో వెంటనే స్పందించి.. పోలీసులను బదిలీ చేయడం అనేది ఉండదని… దీనిపై కనీసం విచారణ అయినా ఉంటుందని అంటున్నారు. అయితే ఇందుకు భిన్నంగా ఒక్క రజనీ విషయంలోనే సాధ్యమైందని.. దీని వెనుక బలమైన లాబీయింగ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు.
అనేక వివాదాలకు……
ఏపీ రాజకీయాల్లో షాడో హోం మినిస్టర్గా వ్యవహరిస్తోన్న వ్యక్తే విడదల రజనీకి ఫుల్‌గా కోపరేట్ చేస్తున్నారన్న గుసగుసలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో తలపండిన సీనియర్ నేతలకు సైతం సాధ్యం కాని విధంగా ఆమె రాజకీయం ఉందని అంటున్నారు. ఆ షాడో మినిస్టర్ సపోర్ట్ లేనిదే ఇదంతా సాధ్యం కాదనే అంటున్నారు. మొత్తానికి విడదల రజనీ వారి రాజకీయం దూకుడు దూకుడుగానే వెళుతోంది. ఈ క్రమంలోనే అనేక వివాదాలకు కేంద్రంగా సైతం ఆమె ఉంటున్నారు. మరి ఈ స్పీడుకు బ్రేకులు ఎక్కడ పడతాయో చూడాలి.