రంజు భలే రజనీ రాజకీయం
గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం చిలకలూరిపేట. ఇక్కడ నుంచి టీడీపీ, వైసీపీలు హోరా హోరీ తలపడిన విషయం తెలిసిందే. జగన్ సునామీ దెబ్బతో టీడీపీ పరాజయం పాలైంది. [more]
గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం చిలకలూరిపేట. ఇక్కడ నుంచి టీడీపీ, వైసీపీలు హోరా హోరీ తలపడిన విషయం తెలిసిందే. జగన్ సునామీ దెబ్బతో టీడీపీ పరాజయం పాలైంది. [more]
గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం చిలకలూరిపేట. ఇక్కడ నుంచి టీడీపీ, వైసీపీలు హోరా హోరీ తలపడిన విషయం తెలిసిందే. జగన్ సునామీ దెబ్బతో టీడీపీ పరాజయం పాలైంది. అయితే, ఇప్పుడు గెలిచిన వైసీపీలోనూ అంతర్గత పోరు పెరుగుతోంది. ముఖ్యంగా ఇక్కడ నుంచి గెలిచిన వైసీపీ నాయకురాలు విడదల రజని.. తన ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఉవ్విళ్లూరుతుండడం రాజకీయంగా రసవత్తరంగా మారింది. విషయంలోకి వెళ్తే..వాస్తవానికి ఈ సీటు కాంగ్రెస్ సీనియర్ నేత, వైఎస్ కుటుంబానికి ప్రాణం ఇచ్చిన నాయకుడిగా పేరు తెచ్చుకుని, తర్వాత కాలంలో జగన్‌కు జైకొట్టిన మర్రి రాజశేఖర్‌ది.
ప్రాధాన్యం ఇస్తున్నారని అనుకుని….
అయితే, ఇటీవల ఎన్నికల సమయంలో ఆయనను జగన్ పక్కన పెట్టి.. ఎన్నారై మహిళ, బీసీ వర్గానికి చెందిన విడదల రజనీకీ అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో టికెట్ వదులుకున్న మర్రికి ఎమ్మెల్సీ సహా మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆయన విడదల రజనీ గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నిం చారు. ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా విడదల రజనీ వ్యూహాత్మకంగా మర్రిని కలుపుకొని పోయారు. ఆయనకు ఎనలేని గౌరవం ఇచ్చారు. మర్రి రాజకీయ గురువు అయిన మామ, మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య జయంతి రోజు.. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అట్టహాసంగా కార్యక్రమం నిర్వహించి నివాళులు అర్పించారు. దీంతో ఆమె నిజంగానే మర్రికి ప్రాధాన్యం ఇస్తున్నారని అందరూ అనుకున్నారు.
వర్గాన్ని పెంచుకోవడం కోసం…
కానీ, ఎన్నికలు ముగిసి, విడదల గెలుపుగుర్రం ఎక్కిన తర్వాత మర్రికి హ్యాండిచ్చారు. ఆయనను పట్టించుకోవడం మానేశారు. తన వర్గాన్ని పెంచుకోవడం, మర్రి వర్గాన్ని డైల్యూట్ చేయడంపై దృష్టి పెట్టారు. ఎప్పటికైనా తనకు మర్రి పోటీ వస్తారని భావించిన విడదల రజనీ తనదైన పంథాలో నడుస్తున్నారు. కనీసం ఇటీవల ఆయన పుట్టిన రోజు చేసుకుంటే కూడా పలకరించలేదు. జిల్లాలోని నలుమూలల నుంచి వైసీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనను కలిసి శుభాకాంక్షలు చెబితే.. కనీసం విడదల రజనీ ఆయనను విష్ చేయడానికి కూడా ముందుకు రాలేదంటే విడదల రజనీ మర్రి విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారో తెలుస్తోంది.
ఎంపీపైన కూడా….
ఇదిలావుంటే, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు.. తనకు సంబంధం లేకపోయినా.. వైసీపీలో సీనియర్‌గా ఉన్నారు.. ఎన్నికల సమయంలో తనకు సలహాలు సూచనలు ఇచ్చారనే కృతజ్ఞతతో మర్రికి అండగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమంలో అయినా మర్రిని కలుపుకుని ముందుకు వెళుతున్నారు. ఆయన సలహాలు తీసుకుంటున్నారు. అన్ని విధాలా ఆయనకు గౌరవం ఇస్తున్నారు. అయితే విడదల రజనీ వర్గం ఎంపీపై చిర్రు బుర్రు లాడుతోంది. తనను చులకన చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా ఎంపీ కార్యక్రమాలు ఎలా చేస్తారంటూ.. ఆమె కొత్త కోణం వెతుక్కున్నారు.
ఆధిపత్యం కోసమే…..
మరోపక్క, బీసీ సంఘాలు కూడా ఎంపీపై విమర్శల బాణాలు వదులుతున్నాయి. బీసీ మహిళ, ఎమ్మెల్యేను చులకన చేస్తున్నారంటూ.. వారు ఎంపీపై ఆరోపణలు చేస్తున్నారు. విడదల రజనీ వర్గం ఎంపీని సైతం టార్గెట్ చేయడం వెనక ఎవరు ? ఉన్నారో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఎంపీ మర్రికి వన్‌సైడ్‌గా సపోర్ట్ చేస్తుండగా.. అటు పక్కనే ఉన్న హోం మంత్రి మేకతోటి సుచరితతో పాటు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సైతం మర్రికే సపోర్ట్ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఆయన తోటి సీనియర్ల మద్దతు సైతం మర్రికే ఉంది. విడదల రజనీ మాత్రం అధిష్టానంలో ఒకరిద్దరు కీలక నేతలతో సఖ్యతగా ఉంటూ మర్రిని రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం పేటలో అయితే ఉంది. మొత్తంగా ఈ పరిణామాలను చూస్తున్న వారు వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు పెరిగిందని అంటున్నారు.