రజనీ దూకుడుకు పుల్లారావు పని అయిపోయినట్లేనా?
గుంటూరు జిల్లా నరసారావుపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకురాలు, ఎమ్మెల్యే విడదల రజనీ దూకుడు మామూలుగా లేదని అంటున్నారు పరిశీలకులు. తనదైన శైలితో ఆమె దూసుకుపోతున్నారు. అంతేకాదు, నియోజకవర్గం [more]
గుంటూరు జిల్లా నరసారావుపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకురాలు, ఎమ్మెల్యే విడదల రజనీ దూకుడు మామూలుగా లేదని అంటున్నారు పరిశీలకులు. తనదైన శైలితో ఆమె దూసుకుపోతున్నారు. అంతేకాదు, నియోజకవర్గం [more]
గుంటూరు జిల్లా నరసారావుపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకురాలు, ఎమ్మెల్యే విడదల రజనీ దూకుడు మామూలుగా లేదని అంటున్నారు పరిశీలకులు. తనదైన శైలితో ఆమె దూసుకుపోతున్నారు. అంతేకాదు, నియోజకవర్గం ప్రజలను ఆకట్టుకునేందుకు ఆమె విభిన్న రీతులు ప్రదర్శిస్తున్నారు. పార్టీలో తనకు తిరుగు లేకుండా చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో వైసీపీ పెట్టినప్పటి నుంచి రాజకీయాలు చేస్తోన్న మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత మర్రి రాజశేఖర్ పేరు అనేదే వినపడకుండా విడదల రజనీ రాజకీయ చాతుర్యం ప్రదర్శిస్తున్నారన్న టాక్ ఉంది. మరి సొంత పార్టీలోనే ఇలా ఉంటే… ప్రత్యర్ధి పార్టీ నేతల విషయంలో ఆమె ఊరుకుంటుందా ? అందుకే వారు మౌనం పాటిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
వందకు వంద మార్కులతో….
ఇటీవల తన నియోజకవర్గంలోని ముస్లింలను ఆకట్టుకునేందుకు విడదల రజనీ చేసిన ప్రయత్నానికి వందకు వంద మార్కులు పడడం గమనార్హం. తన కుటుంబానికి ఉన్న పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ చిన్నదే అయినా ఆమె టీడీపీలో యాక్టివ్ అయినప్పటి నుంచే తన వాక్చాతుర్యం, చొచ్చుకుపోయే గుణంతో ప్రజల్లోకి వెళ్లిపోయారు. టీడీపీలో ఉండగా పుల్లారావు సీటుపైనే కన్నేసిన విడదల రజనీ అక్కడ సీటు రాదని డిసైడ్ అయ్యి ఆ వెంటనే తన ఆర్థిక బలం వాడుకుని వైసీపీ సీటు సొంతం చేసుకున్నారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచే వరకు మర్రి రాజశేఖర్‌ను నాన్న గారు అంటూ ఆయనను ప్రచారం వాడుకున్న విడదల రజనీ గెలిచిన వెంటను రాజశేఖర్‌ను పలకరించిన పాపాన పోలేదు.
వెనకబడి పోతున్నారా?
ఇక ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచాక విడదల రజనీ నిత్యం హడావిడి చేస్తున్నట్టే కనిపిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆమె చేస్తోన్న పనులు వివాదాలకు కారణమవుతున్నా విడదల రజనీ అంతే తానింతే అన్నట్టుగా ముందుకు వెళుతున్నారు. దీంతో ఇక్కడ టీడీపీ తరఫున రెండు సార్లు విజయంసాధించి.. గతంలో మంత్రిగా కూడా చక్రం తిప్పిన ప్రత్తిపాటి పుల్లారావు వెనుకబడి పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. గత ఏడాది ఎన్నికల సమయంలోనూ విడదల రజనీ దూకు డు ప్రదర్శించారు. ఈ క్రమంలోనే అప్పటి మంత్రి ప్రత్తిపాటి ఫ్యామిలీపై విమర్శలు కూడా గుప్పించారు. అయితే, ఆ సమయంలోనే వాటిని ఖండించి తాను కూడా దూకుడుగా రాజకీయాలు చేయాల్సిన పుల్లారావు.. ఆ.. ఇప్పుడే ఎందుకు, ఎన్నికల సమయానికి చూసుకుందాంలే! అని ఊరుకున్నారు. ఫలితగా రవిడదల రజనీ హవా వాయువేగంతో విస్తరించింది.
పుల్లారావు మౌనంతో….?
చివరకు రెండున్నర దశబ్దాలకు పైగా పేట రాజకీయాల్లో కింగ్‌గా ఉన్న పుల్లారావు చివరకు తన శిష్యురాలు అయిన విడదల రజనీ చేతిలో చిత్తుగా ఓడారు. ఇక ఇప్పుడు ఓటమి తర్వాత మేల్కోవాల్సిన ఆయన ఇప్పుడు కూడా ఇక్కడ నత్తనడక రాజకీయ పంథాను అనుసరిస్తున్నారని అంటున్నారు టీడీపీ నాయకులు. ప్రస్తుతం పరిస్థితిలో తన వాయిస్‌ను వినిపించాల్సిన అవసరం ఉందని వారు పుల్లారావును ఉద్దేశించి చెబుతున్నారు. లేకపోతే.. మున్ముందు విడదల రజనీ దూకుడు మరింతగా పెరిగి.. పుల్లారావు ఉనికికే ప్రమాదం ఏర్పడినా ఏర్పడ వచ్చని అంటున్నారు మరి ఏం జరుగుతుందో ? చూడాలి.