ప్రాధేయ పడతారా? పట్టు సాధిస్తారా? రజనీ రాజకీయం ఏంటో?

గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం చిల‌క‌లూరిపేట‌. అటు ప్రతిప‌క్షం బ‌లంగా ఉన్న నియోజ‌క వ‌ర్గం కూడా ఇదే. అయితే ఇప్పుడు స్థానిక స‌మరంలో వైసీపీ స‌త్తా చాటాల‌ని [more]

Update: 2020-03-14 13:30 GMT

గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం చిల‌క‌లూరిపేట‌. అటు ప్రతిప‌క్షం బ‌లంగా ఉన్న నియోజ‌క వ‌ర్గం కూడా ఇదే. అయితే ఇప్పుడు స్థానిక స‌మరంలో వైసీపీ స‌త్తా చాటాల‌ని జ‌గ‌న్ ల‌క్ష్మణ‌రేఖ గీశారు. గెలవక‌పోతే ప‌ద‌వులు ఉండ‌వ‌ని తెగేసి చెప్పారు. ఈ క్రమంలో ఇక్కడ అధికార‌పార్టీ వ‌ర్సెస్ ప్రతిప‌క్షం పోరు హోరా హోరీగా సాగే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ప్రతిప‌క్ష పార్టీ నేత‌, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు త‌న సత్తా చాటుకునేందుకు ప్రయ‌త్నాలు ముమ్మరం చేస్తున్నారు. పైగా రాజ‌ధాని ఎఫెక్ట్ కూడా క‌నిపిస్తోంది. దీంతో పుల్లారావు దూకుడుగానే ప్రజ‌ల మ‌ధ్య తిరిగేందుకు అన్నీ స‌మాయ‌త్తం చేసుకుంటున్నారు.

గెలిచిన తర్వాత….

ఇక‌, అధికార పార్టీ విష‌యానికి వ‌స్తే ఎమ్మెల్యే ర‌జ‌నీకి అన్ని వైపుల నుంచి కూడా సెగ‌లు క‌నిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వ‌ర‌కు ఆమె త‌న గెలుపు కోసం అందరినీ క‌లుపుకొని పోయారు ముఖ్యంగా ఇక్కడ వైసీపీని నిల‌బెట్టిన మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌తో దోస్తీ కూడా చేశారు. అయితే త‌ర్వాత తాను గెలిచిన వెంట‌నే అంద‌రితోనూ విభేదాలు పెట్టుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌న గెలుపుకోసం కృషి చేసిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌తోనే కాదు న‌ర‌సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవ‌రాయులుతోనూ ఆమెకు ఎంత మాత్రం పొస‌గ‌డం లేదు. ఇక ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో మిగిలిన నేత‌ల‌ను, గ్రూపుల‌ను తొక్కేస్తూ అంతా త‌నే అయి పార్టీని న‌డిపిస్తున్నారు.

అర్బన్ ప్రాంతంలోనే…..

కానీ ఇప్పుడు స్థానిక సంస్థల విష‌యానికి వ‌స్తే ఎమ్మెల్యేగా త‌ను విఫ‌ల‌మైతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్కే ప‌రిస్థితి లేద‌ని తెలియ‌డంతో ఇప్పుడు ర‌జ‌నీకి అగ్ని ప‌రీక్ష ఎదురైంద‌ని అంటున్నారు. స్థానికంగా బ‌లంగా ఉన్న నాయ‌కుడు మ‌ర్రిని క‌లుపుకొని పోతేనే త‌ప్ప ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించే ప‌రిస్థితి లేదు. మ‌రోప‌క్క, ప్రజ‌ల‌కు కూడా చేరువ కావాల్సి ఉంది. అదే స‌మ‌యంలో ప్రతిప‌క్ష నాయ‌కుడు ప్రత్తిపాటిని ధీటుగా ఎదుర్కొనాలి. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ హ‌వాతో విజ‌యం సాధించిన ర‌జనీకి అప్పుడు కేవ‌లం 8 వేల మెజార్టీ మాత్రమే వ‌చ్చింది. అది కూడా చిల‌క‌లూరిపేట ప‌ట్టణంలో వ‌చ్చిన మెజార్టీతోనే ఆమె గ‌ట్టెక్కారు.

కీలక నేతలతో……

నియోజ‌క‌వ‌ర్గంలోని చిల‌క‌లూరిపేట‌, నాదెండ్ల, య‌డ్ల‌పాడు మండ‌లాల్లో రాజ‌శేఖ‌ర్ వ‌ర్గాన్ని ప‌క్కన పెట్టి పార్టీని గెలిపించుకోవ‌డం ర‌జ‌నీకి స‌వాల్ లాంటిదే. దీంతో ఆమె నాలుగు మెట్లు కిందికి దిగి జ‌రిగిన‌ వాటిని ప‌క్కన పెట్టమ‌ని కీల‌క నేత‌ల‌ను ప్రాధేయ ప‌డాలి. లేదంటే స్థానికంగా వైసీపీ పుంజుకోవ‌డం క‌ష్టమ‌నే వ్యాఖ్యలువినిపిస్తున్నాయి. పేట‌లో స్థానిక ఎన్నిక‌ల్లో రిజ‌ల్ట్ తేడా వ‌స్తే ర‌జ‌నీకి ప్రయార్టీ త‌గ్గుతుంద‌నే టాక్ కూడా ఉంది. ఈ క్రమంలో ర‌జ‌నీ ఏం చేస్తారు? ఎలా గెలిపిస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది.

Tags:    

Similar News