జ‌గ‌న్ ద‌గ్గర ఈ ఎమ్మెల్యేకు మంచి మార్కులు… రీజ‌నిదే ?

రాజ‌కీయాల్లోకి ఎప్పుడు వ‌చ్చాం అన్నది కాదు.. ఎలా ఉన్నాం.. ఏం చేస్తున్నాం.. అన్నదే ప్రధానం అన్నట్టుగా దూసుకుపోతు న్నారట‌… గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ. [more]

Update: 2021-05-18 06:30 GMT

రాజ‌కీయాల్లోకి ఎప్పుడు వ‌చ్చాం అన్నది కాదు.. ఎలా ఉన్నాం.. ఏం చేస్తున్నాం.. అన్నదే ప్రధానం అన్నట్టుగా దూసుకుపోతు న్నారట‌… గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ. ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ ద‌గ్గర మంచి మార్కులు సంపా యించుకున్న ఎమ్మెల్యేల్లో ఆమె ముందు వ‌రుస‌లో ఉన్నార‌ని.. గుంటూరు నేత‌లు అంటున్నారు. ఓ కీల‌క స‌ల‌హాదారు నేతృత్వంలో ఆమె దూసుకుపోతున్నార‌ని.. ఇక‌, తిరుగులేద‌ని కూడా అంటుండ‌డం విశేషం. సీఎం జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన ప్రతి కార్యక్రమాన్నీ.. నియోజ‌క‌వ‌ర్గంలో అమ‌లు చేస్తున్నారు. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి అనుమానం లేదు. ఆమెకు రాజ‌కీయ ప్రత్యర్ధిగా ఉన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఆమె ఎప్పటిక‌ప్పుడు చెక్ పెడుతూ వ‌స్తున్నారు.

అమూల్ సంస్థకు….

ఈ క్రమంలోనే తాజాగా సీఎం జ‌గ‌న్ రాష్ట్రంలో పాల ఉత్పత్తిలో గుజ‌రాత్‌కు చెందిన అమూల్ సంస్థను ఎంట‌ర్ చేశారు. వాస్తవానికి ప్రభుత్వ ప‌రిదిలో విజ‌య డెయిరీ ఉన్నప్పటికీ.. దీనిని ప‌క్కన పెట్టి.. పాడిరైతుల‌కు ల‌బ్ధి చేకూర్చడ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న అమూల్ సంస్థను రాష్ట్రంలో ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అమూల్‌ను విస్తరించ‌డం, దానిని అభివృద్ధి చేయ‌డం, స్థానిక పాడి రైతులు.. అమూల్ సంస్థల‌ను పాలను విక్రయించేలా చూడ‌డం వంటి కీల‌క బాధ్యత‌ల‌ను ఎమ్మెల్యేల‌కు అప్పగించారు. ఈ విష‌యంలో ఇప్ప‌టికే అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేల‌కు కూడా.. మౌఖిక ఆదేశాలు వెళ్లాయి.

నివేదికలు తెప్పించుకుని…

అయితే.. ఈ విష‌యంలో ఎవ‌రు ఎలా ఉన్నారు? అమూల్ ప‌రిస్థితి ఏంటి? అని నివేదిక తెప్పించుకున్నారని తెలిసింది. ఎమ్మెల్యేలు అమూల్ సంస్థను ప్రమోట్ చేయ‌డంలో ఎలా స‌హ‌క‌రిస్తున్నారు? అనే విష‌యాన్ని సీఎం జ‌గ‌న్ సీరియ‌స్‌గా తీసుకుని మ‌రీ ప‌రిశీలించారు. ఈ జాబితాలో చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ ముందున్నార‌ని నివేదిక‌లో పేర్కొన్నార‌ట‌. చిల‌కలూరి పేట నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో మొత్తం గ్రామాల్లో మ‌హిళా పాడి రైతుల‌ను అమూల్ సంస్థకు త‌మ పాల‌ను విక్రయించేలా చేయ‌డంలో ర‌జ‌నీ తీవ్రంగా శ్రమించారని.. ఆడియోలు, వీడియోల ఆధారంగా జ‌గ‌న్‌కు చేరింద‌ట‌.

అందరికంటే ముందు….

దీంతో విడదల రజనీకి సీఎం జ‌గ‌న్ మంచి మార్కులు వేశార‌ని.. సంతృప్తి వ్యక్తం చేశార‌ని తెలిసింది. అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే.. నిజానికి చాలా మంది ఎమ్మెల్యేలు జ‌గ‌న్ చెబుతున్నట్టు చేస్తున్నా.. విడదల ర‌జ‌నీ విష‌యంలో ఇంత ఇంట్రస్ట్ తీసుకోవ‌డం ఆస‌క్తిగా మారింది. దీని వెనుక కీల‌క స‌ల‌హాదారు ఉన్నార‌నే ప్రచారం సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News