విజయసాయి విజయరహస్యం అదేనట
ఎక్కడో నెల్లూరులో ఆయన పుట్టారు. ఆయన స్వతహాగా రాజకీయ నేత కానే కాదు, వైఎస్సార్ కుటుంబంతో మూడు తరాల అనుబంధమే ఆయన్ని ఈ స్థితిలో ఉంచిందనుకోవాలి. రాజ్యసభ [more]
ఎక్కడో నెల్లూరులో ఆయన పుట్టారు. ఆయన స్వతహాగా రాజకీయ నేత కానే కాదు, వైఎస్సార్ కుటుంబంతో మూడు తరాల అనుబంధమే ఆయన్ని ఈ స్థితిలో ఉంచిందనుకోవాలి. రాజ్యసభ [more]
ఎక్కడో నెల్లూరులో ఆయన పుట్టారు. ఆయన స్వతహాగా రాజకీయ నేత కానే కాదు, వైఎస్సార్ కుటుంబంతో మూడు తరాల అనుబంధమే ఆయన్ని ఈ స్థితిలో ఉంచిందనుకోవాలి. రాజ్యసభ సభ్యుడు కాక ముందు విజయసాయిరెడ్డి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు కానీ కేవలం నాలుగేళ్ళ కాలంలో ఆయన రాష్ట్రంలోనే బిగ్ పొలిటికల్ ఫిగర్ అయిపోయారు. ఇక ఢిల్లీలో ఏం సాయిరెడ్డి గారు అని ప్రధాని మోడీ దగ్గరకు వచ్చి పలకరించేంటంత సాన్నిహిత్యాన్ని సొంతం చేసుకున్నారు. విశాఖను తన దత్తత జిల్లాగా చేసుకున్న విజయసాయిరెడ్డి ఇక్కడే తన అధికారిక కార్యకలాపాలు అన్నీ కొనసాగిస్తున్నారు. విశాఖలో ఒక ఫ్లాట్ కొనుక్కున్న విజయసాయిరెడ్డి స్థానికంగా ఉన్న పెద్దలు, ప్రముఖులను చేర్చి ప్రగతి భారతి ఫౌండేషన్ పేరిట ఒక స్వచ్చంద సంస్థ ప్రారంభించారు.
జనంలోకి అలా…
ఆ సంస్థల ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విజయసాయిరెడ్డి కరోనా విపత్తు వేళ మరింత చురుకుగా స్పందిస్తున్నారు. మొత్తానికి మొత్తం విశాఖ కార్పొరేషన్ ఏరియాలో ఉన్న వారందరికీ ప్రగతి భారతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున వితరణ చేసిన ఆయన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కూడా సేవలను విస్తరించారు. ముఖ్యంగా పేదలతో పాటు, పారిశుధ్ధ్య కార్మికులు, పోలీసు కుటుంబాలకు విరివిగా సాయం చేయడం ద్వారా ఆ వర్గాలకు ఆయన గట్టి భరోసానే అందిస్తున్నారు.
ఉత్తరాంధ్రలోనే….
ఇక ఉత్తరాంధ్రా జిల్లాలకు వైసీపీ ఇంచార్జిగా ఉన్న విజయసాయిరెడ్ది పార్టీని మొత్తం ఏకతాటిపైకి నడిపిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా విజయసాయిరెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నారు. లాక్ డౌన్ పీరియడ్ లో మూడు జిల్లాల్లో పార్టీ, ప్రభుత్వం ఒక్కటిగా నిలిచి జనం ముందుకు రావడం వెనకవిజయసాయిరెడ్డి మార్క్ వ్యూహం ఉందని అంటారు. ఈ మూడు జిల్లాలలో రాజకీయాన్ని గుప్పిట పట్టే ప్రయత్నం చేస్తున్న విజయసాయిరెడ్డి ప్రత్యార్ధి టీడీపీని నిలువరించేందుకు కూడా ఎత్తులు వేస్తున్నారు.
లాగేయడమే…
ప్రత్యర్ధి టీడీపీకి పట్టుకొమ్మగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలను కేవలం మూడేళ్ళ వ్యవధిలోనే పూర్తిగా ఊడ్చేసిన వైసీపీ వెనక విజయసాయిరెడ్డి చాణక్యం ఉందని అంటారు. ఆయన నిరంతరం పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటున్నారు. వారి సమర్ధతను గుర్తించి అధినాయకుడి చెవిన వేస్తున్నారు. అదే సమయంలో పనిచేయని వారి విషయాన్ని ఓ కంట కనిపెడుతున్నారు. ఇక బాగా పనిచేసేవారు, బుద్ధిమంతులు ఉంటే టీడీపీ నుంచి నేతలను లాగేయడానికైనా ఆయన రెడీ అయిపోతున్నారు. మొత్తం మీద చూసుకుంటే విజయసాయిరెడ్డి మూడు జిల్లాల రాజకీయాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారనే చెప్పాలి. నెల్లూరు రెడ్డి గారి దూకుడు ముందు సైకిల్ పార్టీ కకావికలంవుతోంది. కరోనా అనంతర పరిణామాలలో బడా నేతలు కూడా టీడీపీని వీడేందుకు రెడీగా ఉన్నారని ప్రచారం సాగుతున్నదంటే విజయసాయిరెడ్డి విజయ రహస్యం అర్ధమైపోతోందిగా.