ఏపీలోనే కాస్ట్‌లీ కార్పొరేటర్లు అక్కడే.. రు. 5 కోట్లు పై మాటే ?
ఏపీలో ఏ ఎన్నిక జరిగినా డబ్బుల కట్టలు తెగి పడుతున్నాయి. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి ప్రస్తుతం జరుగుతోన్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా [more]
ఏపీలో ఏ ఎన్నిక జరిగినా డబ్బుల కట్టలు తెగి పడుతున్నాయి. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి ప్రస్తుతం జరుగుతోన్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా [more]
ఏపీలో ఏ ఎన్నిక జరిగినా డబ్బుల కట్టలు తెగి పడుతున్నాయి. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి ప్రస్తుతం జరుగుతోన్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా డబ్బు ప్రవాహానికి కొదవే లేదన్నట్టుగా ఉంది. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలుగా రికార్డు క్రియేట్ చేయనున్నాయి. విశాఖ మహానగరంలో జనరల్ డివిజన్లో కార్పొరేటర్‌గా గెలుపొందాలంటే ఓ ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయిలో కోట్లు కుమ్మరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జనరల్ డివిజన్లలో కూడా కీలక నేతలు, మేయర్, డిప్యూటీ మేయర్ రేసులో ఉన్న వారితో పాటు వైసీపీ, టీడీపీకి చెందిన బడా నేతల కుటుంబాలకు చెందిన వారు పోటీలో ఉన్న డివిజన్లలో అయితే ఖర్చు మోతెక్కిపోతోంది.
నేతల వారసులు….
సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్ నియోజకవర్గాల్లో మహా అయితే రు. 40 నుంచి రు. 60 కోట్లు ఖర్చయితే వామ్మో అనుకుంటాం… అదే రిజర్వ్ నియోజకవర్గాల్లో రు. 10 కోట్లు ఎక్కువ. చాలా రిజర్వ్ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు రు. 5 కోట్లు సొంతంగా ఖర్చు చేస్తే చాలా గొప్ప అన్నట్టే. అదే విశాఖ కార్పొరేషన్లో ఒక్క కార్పొరేటర్ సీటు కోసం రు. 5 కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా పలువురు నేతలు రెడీ అయిపోయారు. తాజా ఎన్నికల్లో కాకలు తీరిన నేతల కుటుంబాలు పోటీ పడుతున్నాయి. వైసీపీ నుంచి నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌తో పాటు ఆరో డివిజన్ నుంచి మంత్రి అవంతి శ్రీను కుమార్తె కూడా పోటీ చేస్తున్నారు.
ఓటుకు రెండు నుంచి మూడు వేలు….
ఇటు టీడీపీలో పీలా శ్రీనివాస్‌తో పాటు గండి బాబ్జీ, కాకి గోవిందరెడ్డి కుటుంబీకులు కూడా రేసులో ఉన్నారు. మామూలుగానే ఒక ఓటుకు వార్డులో ఉన్న పోటీతో పాటు అక్కడ పోటీ చేసే అభ్యర్థుల స్థాయిని బట్టి రు. 2 నుంచి రు. 3 వేల వరకు రేటు పలుకుతోందంటున్నారు. కొన్ని వార్డుల్లో అయితే ఏరియాలను బట్టి రు. 5 నుంచి రు. 7 వేలు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల అపార్ట్‌మెంట్లతో పాటు కుల సంఘాల ఓట్లను గంప గుత్తగా కొనే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇందుకోసం రు. లక్షలు వెదజల్లుతున్నారు.
గిఫ్ట్ లు అదనం….
ఇక ఓటరుకు ఓటు రేటు ఫిక్స్ చేయడంతో పాటు రకరకాల గిఫ్ట్‌లతో కూడా ఎర వేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే కీలక డివిజన్లలో ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఖర్చు కనిష్టంగా రు. 3 కోట్ల నుంచి గరిష్టంగా రు. 6-7 కోట్ల వరకు అయ్యేలా ఉంది. ఈ లెక్కన ఏపీలోనే ఖరీదైన కార్పొరేటర్ల నిలయంగా విశాఖ కార్పొరేషన్ రికార్డులకు ఎక్కనుంది.