మూడు దశాబ్దాల పగ కూతుళ్లలోనూ కంటిన్యూ ?
విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ రణక్షేత్రంలో శత్రువులుగా కాకలు తీరిన ఇద్దరు యోధానుయోధులు అయిన నాయకుల [more]
విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ రణక్షేత్రంలో శత్రువులుగా కాకలు తీరిన ఇద్దరు యోధానుయోధులు అయిన నాయకుల [more]
విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ రణక్షేత్రంలో శత్రువులుగా కాకలు తీరిన ఇద్దరు యోధానుయోధులు అయిన నాయకుల వారసుల కుమార్తెలు కూడా ఇప్పుడ తమ తండ్రుల రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ మళ్లీ రణక్షేత్రంలో తలపడుతున్నారు. వీరిద్దరి పోరు ఇప్పుడు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆసక్తిగా మారింది. ఆ ఇద్దరు మహిళా వారసురాళ్లు ఎవరో కాదు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు… విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణి.
పట్టణంలో పర్యటిస్తూ…..
వీరిలో అదితి గత సాధారణ ఎన్నికల్లోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె కోలగట్లకు గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు. కట్ చేస్తే ఇప్పుడు కోలగట్ల ఎమ్మెల్యేగా ఉన్న విజయనగరం కార్పొరేషన్లో పెత్తనం అంతా ఆయన కుమార్తె శ్రావణి చక్కపెట్టేస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ కేడర్‌కు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను ఉన్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఇటు నగరంలో పలు డివిజన్లలో ఎప్పటి నుంచో పర్యటనలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. పార్టీ అధికారంలో కూడా ఉండడంతో ఆమె తనకంటూ ఓ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు.
కోట దాటి బయటకు….
అతిధి గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొద్ది రోజుల పాటు డివిజన్లలో పర్యటిస్తూ యాక్టివ్‌గానే ఉన్నారు. తర్వాత కరోనా నేపథ్యంలో ఆమె కోట దాటి బయటకు రాలేదు. ఇది ఆమెకు పెద్ద మైనస్‌గా ఉంది. అతిదికి మంచి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా… సొంత వ్యూహాలు లేకపోవడంతో పాటు ఆ దిశగా ఆలోచన చేయకుండా.. ఓ కోటరీలో ఇరుక్కుపోవడం మైనస్. శ్రావణి మాత్రం ఎవరెన్ని చెప్పినా ఎక్కడ ఏం జరుగుతుందో ? ఓ అంచనాతో ఉంటున్నారు. ఇవే ఆమెకు ప్లస్ అవుతున్నాయి.
ప్రచారానికి దూరంగా….
అదే సమయంలో తాజా కార్పొరేషన్ ఎన్నికలు ఇద్దరికి ఎంతో ప్రతిష్టాత్మకం అయ్యాయి. వైసీపీకి మాత్రం గ్రూపుల గోల వెంటాడుతోంది. మంత్రి బొత్స గ్రూపు ఇక్కడ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తోంది. విజయనగరం కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉండగా వైసీపీ నుంచి 112 మంది నామినేషన్లు వేశారు. దీనిని వైసీపీ ఎలా ఎదుర్కొంటుందో ? చూడాలి. ఇక అశోక్ గజపతిని కేంద్రం ఇటీవల ఎక్కువుగా టార్గెట్ చేయడంతో ఆయన ప్రచారానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. అన్నీ ఆయన కుమార్తె అదితికే అప్పగించేశారు. ఆమెకు కూడా పార్టీలో కొన్ని వర్గాల నుంచి పెద్దగా సపోర్ట్ లేదు. మూడు దశాబ్దాలుగా రాజకీయంగా శత్రువులుగా ఉన్న ఈ ఇద్దరు వారసురాళ్లు వచ్చే ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ ఎన్నికల్లో తలపడతారన్న వార్తల నేపథ్యంలో ఆ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా జరుగుతోన్న ఈ కార్పొరేషన్ పోరులో ఎవరు పై చేయి సాధిస్తారో ? ఎవరి వ్యూహాలు సక్సెస్ అవుతాయో ? చూడాలి.