పంచుమ‌ర్తి వ‌ర్సెస్ వంగ‌ల‌పూడి.. టీడీపీలో కోల్డ్ వార్‌

త‌న‌కు ద‌క్కాల్సిన ప‌ద‌వి వేరే వారికి ద‌క్కితే ఎలా ఉంటుంది? కొంత అసూయ‌గాను, ఆవేద‌న‌గాను కూడా ఉంటుంది. ఇక‌, ఎప్పుడో ద‌క్కాల్సిన ప‌ద‌వి ఇప్పుడే ద‌క్కితే ఎలా [more]

Update: 2020-03-01 00:30 GMT

త‌న‌కు ద‌క్కాల్సిన ప‌ద‌వి వేరే వారికి ద‌క్కితే ఎలా ఉంటుంది? కొంత అసూయ‌గాను, ఆవేద‌న‌గాను కూడా ఉంటుంది. ఇక‌, ఎప్పుడో ద‌క్కాల్సిన ప‌ద‌వి ఇప్పుడే ద‌క్కితే ఎలా ఉంటుంది..? త‌న‌కు పోటీ కూడా లేకుండా చేసుకోవాల‌ని, త‌న‌కంటే తోపులు లేర‌నేలా చేయాల‌ని ఉంటుంది. ఇప్పుడు ఇదే టీడీపీలో మ‌హిళా నేత‌ల మ‌ధ్య కోల్డ్ వార్‌కు కార‌ణ‌మైంది. ఒక‌రు ఉత్తరాంధ్రకు చెందిన నాయ‌కురాలు అయితే, మ‌రొక‌రు రాజ‌ధాని జిల్లా కృష్ణాకు చెందిన నాయ‌కురాలు. ఇద్దరూ కూడా ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు పోటీ ప‌డుతున్నారు.

సీనియర్ అయినప్పటికీ…..

ఆ ఇద్దరు నాయ‌కురాళ్లే.. పంచుమ‌ర్తి అనురాధ‌, వంగ‌లపూడి అనిత‌. పంచుమ‌ర్తి దాదాపు 20 ఏళ్లుగా టీడీపీలో ఉన్నారు. గ‌తంలో విజ‌య‌వాడ‌న‌గ‌ర మేయ‌ర్‌గా కూడా చ‌క్రం తిప్పారు. ఆ త‌ర్వాత ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగ‌ప‌డినా కొన్నాళ్లు మౌనంగా ఉండి త‌ర్వాత మ‌ళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇక‌, వంగ‌లపూడి అనిత 2014లో విశాఖ జిల్లా పాయ‌క‌రావుపేట నుంచి విజ‌యం సాధించారు. ఎమ్మెల్యేగా చ‌క్రం తిప్పారు. త‌ర్వాత మంత్రి ప‌ద‌వి కోసం ప్రయ‌త్నించినా సమీక‌ర‌ణ‌లు ఫ‌లించ‌లేదు. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పశ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

పదవి కోసం ఆశించి….

అయితే, పార్టీ ఒక్కటే అయినా ఈ ఇద్దరు నేత‌ల మ‌ధ్య పెద్దగా అవినాభావ సంబందాలు లేవు. వంగ‌లపూడి ఎస్సీ వ‌ర్గానికి చెందిన నేత‌. పంచుమ‌ర్తి బీసీ వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలు. మ‌రి వీరిమ‌ధ్య ఎందుకు ఆధిప‌త్య ధోర‌ణి త‌లెత్తింది? ఎంద‌కు ఒక‌రంటే ఒక‌రు పైచేయి సాధించాల‌ని ప్రయ‌త్నిస్తు న్నారు? అం టే.పంచుమ‌ర్తి అనురాధ గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూడా మంగ‌ళ‌గిరి టికెట్ కోసం ప్రయ‌త్నిం చారు. అయితే, అది ద‌క్కలేదు. దీంతో తెలుగు మ‌హిళ అధ్యక్షురాలి ప‌ద‌వి కోసం ప్రయ‌త్నించారు. తాజాగా అది కూడా ద‌క్కలేదు. అయితే, పార్టీ అధికార ప్రతినిధి హోదా మాత్రం ద‌క్కింది.

పై చేయి సాధించేందుకు…

ఇక‌, తెలుగు మ‌హిళ‌గా వంగ‌ల‌పూడికి అవ‌కాశం ఇచ్చారు చంద్రబాబు. దీంతో త‌న‌కు ద‌క్కాల్సిన ప‌ద‌వి అనిత‌కు ద‌క్కడంతో పంచుమ‌ర్తి కుమిలిపోతున్నార‌ట‌. ఈ క్రమంలోనే త‌న స‌త్తా చాటుకుని అనిత‌ను డీ గ్రేడ్ చేసేందుకు వాగ్ధాటి పెంచార‌న్న టాక్ సొంత పార్టీ వ‌ర్గాల్లోనే వినిపిస్తోంది. జ‌గ‌న్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమ‌ర్శలు చేస్తున్నారు. ఇక‌, అనిత మ‌రో కోణంలో దూకుడు పెంచారు. త‌న‌కు ఇంత త‌క్కువ కాలంలో అంటే పార్టీలోకి వ‌చ్చిన త‌క్కువ కాలంలోనే ఈ ప‌ద‌వి ద‌క్కడం, దీనికోసం చాలా మంది ఎదురు చూడడం వంటి కార‌ణాల‌తో త‌నను తాను నిల‌బెట్టుకునేందుకు, ముఖ్యంగా త‌న‌కు పోటీగా ఉన్న పంచుమ‌ర్తిపై పైచేయి సాధించేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరు మ‌హిళా నాయ‌కుల మ‌ధ్య తీవ్రస్థాయిలో కోల్డ్ వార్ జ‌రుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News