ప్రపంచ కప్ వాయిదా గ్యారంటీ నే అట

టి ట్వంటీ మ్యాచ్ అంటే ఆ హుషార్ వేరు. స్టేడియం మోతెక్కిలా సిక్స్ లు, బౌండరీల మోత తో క్రికెట్ ఆట తీరునే ఫాస్ట్ మోడ్ లోకి [more]

Update: 2020-06-01 18:29 GMT

టి ట్వంటీ మ్యాచ్ అంటే ఆ హుషార్ వేరు. స్టేడియం మోతెక్కిలా సిక్స్ లు, బౌండరీల మోత తో క్రికెట్ ఆట తీరునే ఫాస్ట్ మోడ్ లోకి తెచ్చింది పొట్టి క్రికెట్. సమయం తక్కువ కావడంతో లేజీ ఆట అనే అపప్రధను టి ట్వంటీ చెరిపేసింది. అలాంటి టి ట్వంటీ క్రికెట్ వరల్డ్ కప్ అంటే ఎలా ఉంటుంది, ఆ జోష్ నే వేరు. దీనికోసం ఏడాది గా అంతా వేచి చూస్తున్న సమయంలో కరోనా వైరస్ మహమ్మారి అందరి ఆశలపై నీళ్లు కుమ్మరించింది. దీని దెబ్బకు ప్రపంచ క్రికెట్ దిశా దశా మారిపోయింది.

మరో రెండేళ్ళు వెనక్కి …

ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ధనా ధన్ టి 20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా లో జరగాలిసి ఉంది. అయితే ప్రపంచం అంతా కరోనా ధాటికి ఇప్పటికి విలవిల్లాడుతూనే ఆందోళనకరంగానే మారింది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీ 2022 కి వాయిదా వేయడం ఖాయమన్న చర్చ క్రికెట్ వర్గాల్లో సాగుతుంది. దీనిపై ఐసిసి భేటీ అయ్యి ఒక నిర్ణయం తీసుకోవాలిసి ఉంది. ప్రపంచ కప్ నిర్వహించాలంటే కనీసం ఆరునెలల నుంచి సన్నాహాలు చేయాలిసి ఉంది. కానీ వైరస్ కరాళ నృత్యం తో అంతా ఎక్కడికక్కడ ఆగిపోయారు.

ఐపీఎల్ బాటలోనే …

ఇప్పటికే ఇంగ్లాండ్, భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా వంటి దేశాలన్నీ వైరస్ కి వణుకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐపిఎల్ లీగ్ సైతం అటకెక్కింది. ఆటగాళ్ళు, ప్రేక్షకుల రక్షణ కోసం టోర్నీ వాయిదా వేయడమే సరైంది అన్నది ఐసిసి ఆలోచనగా ఉందంటున్నారు. వచ్చే ఏడాది భారత్ సైతం టి ట్వంటీ టోర్నీ కి ఆతిధ్యం ఇవ్వాల్సి ఉంది. అది కూడా వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తుంది. వైరస్ కి వ్యాక్సిన్ కనుగొనేవరకు క్రీడలకు చెడ్డ రోజులు కొనసాగేలాగే ఉన్నాయి. దాంతో అటు క్రీడాకారులు, క్రీడాభిమానులకు నిరుత్సహం తప్పడం లేదు.

Tags:    

Similar News