ఔను వాళ్లిద్దరూ కలుస్తారా ?

దేశంలో మరోసారి మోడీని ప్రధానిగా చూసే ఛాన్స్ లేనేలేదంటూ జాతీయ స్థాయిలో నానా యాగీ చేసి అభాసుపాలు అయ్యారు ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బిజెపిపై [more]

Update: 2019-06-19 04:30 GMT

దేశంలో మరోసారి మోడీని ప్రధానిగా చూసే ఛాన్స్ లేనేలేదంటూ జాతీయ స్థాయిలో నానా యాగీ చేసి అభాసుపాలు అయ్యారు ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బిజెపిపై ఎదురుదాడికి దిగిన బాబు కాంగ్రెస్ తో సైతం జట్టుకట్టారు. ఒక పక్క యుపిఎ మరో పక్క అదీ కుదరకపోతే సంకీర్ణ సర్కార్ కి ఎన్నికల ముందు ఆయన చేసిన కసరత్తు అంతా ఇంతా కాదు. బాబు చేసిన హడావిడికి ఇక అధికారంలోకి వచ్చేస్తున్నామని అటు కాంగ్రెస్ ఇటు ప్రాంతీయ పార్టీల కూటమి కలలు కంది. ఎన్నికలకు ముందు ఆ తరువాత కౌంటింగ్ కి ముందు సాగిన ఈ హడావిడి ఇప్పుడు టిడిపి అధినేతకు తలనొప్పిగా మారింది.

చంద్రబాబు కు మోడీ ఆహ్వానం ….

దేశంలోని అన్ని రాజకీయ పక్షాలతో ఈనెల 19 న సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ సన్నాహాలు చేస్తున్నారు. ఐదు ముఖ్యమైన సంస్కరణలపై చర్చ జరిపేందుకు అన్ని పార్టీల అధ్యక్షులను మోడీ తన భేటీకి పిలుస్తున్నారు. అందులో భాగంగా టిడిపి అధినేతగా వున్న చంద్రబాబు కు ప్రధాని పిలుపు వెళ్ళింది. ఎన్నికల ముందు ఉప్పు నిప్పుగా వున్న ఈ ఇరువురు నేతలు బాబు సమావేశానికి వెళితే షేక్ హ్యాండ్ లు ఇచ్చుకోక తప్పదు. ఆ సందర్భంగా ప్రధాని ని ఉద్దేశించి టిడిపి అధినేత ఏమి మాట్లాడతారు ? మోడీ సంస్కరణలను ఆమోదిస్తారా లేదా ? ఇలాంటి అనేక ఆసక్తికర అంశాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే వన్ నేషన్ వన్ ఎలెక్షన్ అనే అంశంలో టిడిపి, వైసీపీలు భిన్నమైన వైఖరి లో లేవు. ఏపీకి జరుగుతున్న ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో బాటు ఉండటంతో ఈ రెండు పక్షాలకు నష్టం వచ్చేది లేదు. దాంతో బాబు ఈ సదస్సులో పాల్గొంటే మాత్రం మోడీ ప్రతిపాదనలకు ఎస్ అనే అవకాశమే వుంది. ఆయన అదే అంటే మాత్రం నిన్నమొన్నటివరకు చంద్రబాబు తో సఖ్యతగా వున్న 22 రాష్టాల ప్రాంతీయ కూటమి నేతలు ఆయనతో విభేదించే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు మరి ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News