పవన్ కళ్యాణ్ జనసేన లో నిర్వేదం కొనసాగుతుందా ?

స్థానిక ఎన్నికలకు జనసేనను సిద్ధం చేయడం అంత సులభంగా లేదని తెలుస్తుంది. గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేసుకునే సదవకాశం స్థానిక ఎన్నికలు. ఈ ఎన్నికలకు సేనను [more]

Update: 2019-06-15 18:29 GMT

స్థానిక ఎన్నికలకు జనసేనను సిద్ధం చేయడం అంత సులభంగా లేదని తెలుస్తుంది. గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేసుకునే సదవకాశం స్థానిక ఎన్నికలు. ఈ ఎన్నికలకు సేనను సమాయత్తం కావాలని ఇప్పటికే అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయిందేదో అయ్యింది 2024 కి పార్టీని ఒక స్థాయికి చేర్చాలంటే ఇప్పటినుంచి చెమటోడ్చక తప్పదన్న తత్త్వం ఆయనకు బోధపడింది. అయితే ఇప్పుడు ఎందరు తన వెంట నడుస్తారన్నది సేనానికే అంచనా లేదు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం జనసేన లో నిర్వేదం రాజ్యమేలుతుంది.

పవన్ ముందుంటేనే ….

వచ్చే ఐదేళ్లు పవన్ కళ్యాణ్ ముందు ఉండి గ్రామ గ్రామానా పర్యటించాలిసి వుంది. ఎవరు నిజమైన తన భక్తుల్లో ఆయన గుర్తించుకోవాలి. అధికారానికి దాసోహం అనే వారిని పక్కన పెట్టాలి. ప్రజల్లో పనిచేసేవారు ఎవరు వ్యాపారాలకు రాజకీయాన్ని వినియోగించుకునే వారు ఎవరు అన్నది స్వయంగా మధించాలి. పక్క పార్టీల్లో టికెట్ రాని నాయకులను అక్కున చేర్చుకుని అప్పటివరకు పార్టీలో వున్న వారిని చిన్నచూపు చూస్తే ఫలితాలు మళ్ళి చేదుగానే వస్తాయన్న సత్యం గ్రహించాలి. ఢీలా పడ్డ టిడిపి, జనం వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ల కు తాను చాలా దూరం అనే సంకేతాలు బలంగా ప్రజల్లో ప్రచారం చేసుకోగలగాలి. వీటితో పాటు 2024 లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనే స్లోగన్ తో ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ అనుసరిస్తూనే నిత్య రాజకీయాల్లో బిజీ అయ్యి తాను పార్ట్ టైం పొలిటీషియన్ కాదన్న విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకునేలా తన దైనందిన కార్యక్రమం రూపొందాలి.

ఇవన్నీ సాధ్యమేనా ….

ఘోర ఓటమిపై అందరికన్నా ముందే సమీక్ష లు నిర్వహించిన పవన్ పడిలేచిన బంతి లా లేస్తా అని ఘాటుగా స్పందించారు. తన వెంట వున్న సైన్యం తో రెట్టించిన కసితో వచ్చే ఎన్నికల్లో పనిచేస్తామని శపథం చేశారు. జనసేన ఓట్లను రెండు ప్రధాన పార్టీలు కొనుగోలు చేశారని తనను కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఓడించారన్నారు. ప్రజల్లో మార్పు తెచ్చి ఓటుకు నోటు లేకుండా చేసేందుకు కృషి సాగిస్తామని చెప్పారు జనసేనాని. ఇప్పటివరకు తమ సిద్ధాంతాలే ప్రచారం చేశామని ఇప్పటినుంచి రాజకీయం మొదలు పెడతామని పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఆయన కొత్త వ్యూహం ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి పొలిటికల్ సర్కిల్స్ లో నెలకొంది

Tags:    

Similar News