విజయవాడలో ఢీ అంటున్న ముగ్గురు మహిళలు.. రీజన్ ఇదే…!
విజయవాడ టీడీపీలో చిత్రమైన రాజకీయాలు చోటు చేసుకున్నాయి. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటే క్రమంలో కీలక నేతల కుటుంబాలకు చెందిన ముగ్గురు మహిళలు రాజకీయంగా దూకుడు పెంచిన [more]
విజయవాడ టీడీపీలో చిత్రమైన రాజకీయాలు చోటు చేసుకున్నాయి. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటే క్రమంలో కీలక నేతల కుటుంబాలకు చెందిన ముగ్గురు మహిళలు రాజకీయంగా దూకుడు పెంచిన [more]
విజయవాడ టీడీపీలో చిత్రమైన రాజకీయాలు చోటు చేసుకున్నాయి. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటే క్రమంలో కీలక నేతల కుటుంబాలకు చెందిన ముగ్గురు మహిళలు రాజకీయంగా దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కావడం విశేషం. వీరిలో ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సతీమణి అనురాధ, సెంట్ర ల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా సతీమణి సుజాతలు స్థానిక ఎన్నికల్లోకి దూకారు. నిజానికి వీరిలో అనురాధ సీనియర్ నాయకురాలు. జిల్లాపరిషత్ చైర్ పర్సన్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఇక, సుజాత.. గత ఐదేళ్లలో బొండా ఉమ రాజకీయాలను తెరవెనుక ఉండి నడిపించారనే పేరు తెచ్చుకున్నారు.
తండ్రి వెనకే ఉండి…..
ఇక, కేశినేని శ్వేత.. 2019 ఎన్నికల ముందు వరకు గడపదాటకపోయినా.. ఆ ఎన్నికల్లో తన తండ్రి తరఫున నగరంలోనూ… జిల్లాలోనూ ప్రచారం చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉన్నారు. ఆన్ లైన్లో క్యాంపెయిన్ కూ డా నిర్వహించారు. నిజానికి కేశినేని నాని చేసే ట్వీట్లకు ఈమే దర్శకత్వం వహిస్తారనే పేరుంది. ఇలా ముగ్గురు నాయకురాళ్లు కూడా తమదైన శైలిలో మేయర్ పీఠంపై కన్నేశారు. అయితే, మేయర్ పీఠం.. శ్వేతకు కేటాయించినట్టు తెలియడంతో మిగిలిన ఇద్దరు అనురాధ, సుజాతల్లో దూకుడు తగ్గినా..పార్టీలో పట్టు పెంచుకుంటే.. ఏమో గుర్రం ఎగరావొచ్చు.. అన్న రీతిలో శ్వేతను పక్కన పెట్టి తమకు ఈ పదవి రాకపోతుందా ? అన్న ఆశతో ఉన్నారట.
కరోనా సాయం తో…..
దీంతో ఇప్పుడు ముగ్గురు మధ్య కూడా రాజకీయంగా పోటీ ఏర్పడింది. మెజారిటీ ప్రజలకు తమను తాము పరిచయం చేసుకోవడంతోపాటు పార్టీలోనూ సానుభూతి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలకు సేవ చేసేందుకు తమదైన మార్గాలను ఎంచుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసుకుని శ్వేత పలు జాగ్రత్తలు చెబుతున్నారు. అదే సమయంలో సుజాత ఇంటి పట్టునే ఉంటున్నా.. సెంట్రల్ నియోజకవర్గంలోని పేదలకు నిత్యవసరాలు పంచారు. ఇక, అనురాధ.. తూర్పు నియోజకర్గంలో పేదలకు అన్నం, నిత్యావసరాలను నిత్యం పంపిణీ చేస్తున్నారు. పార్టీ పరంగా కూడా ఆదుకుంటున్నారు.
ముగ్గురి మధ్య పోటీ….
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా నేపథ్యంలో వాయిదా పడడంతో ఈ లాక్ డౌన్ అవకాశం అందిపుచ్చుకుని ఈ ముగ్గురు టీడీపీ మహిళా నేతలు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురూ కూడా ఎవరికి వారు ఎక్కడా తగ్గకుండా తమను తాము నిరూపించుకునే క్రమంలో దూసుకుపోతున్నారు. ఫలితంగా ముగ్గురు మహిళల మధ్య తీవ్రమైన పోటీ నెలకొందని అంటున్నారు పరిశీలకులు .