మద్యం ప్రియులకు పండగ….గేట్లు తెరిచేశారు?

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు చుక్కలను తాకేలా ఉన్నాయి. దాంతో పక్క రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి పదో పరకో ఎక్కువ కు ఏపీ [more]

Update: 2020-07-03 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు చుక్కలను తాకేలా ఉన్నాయి. దాంతో పక్క రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి పదో పరకో ఎక్కువ కు ఏపీ లో విక్రయిస్తున్నారు కొందరు. అనేకమంది ఇలా మద్యం అక్రమ రవాణా చేస్తూ లక్షల రూపాయల స్టాక్ తో పట్టుబడుతున్న కేసులు ఇదే విషయం చెప్పకనే చెబుతున్నాయి. గతంలో ఉన్న ధరలకు 75 శాతం పెంచడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఏపీకి ఒడిస్సా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల నుంచి విచ్చలవిడిగా మద్యం అక్రమ రవాణా మొదలై పోయింది. దీన్ని ప్రభుత్వ యంత్రాంగం తమ శక్తికి మించే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా లిక్కర్ మాఫియా ఆగడాలు పెరుగుతున్నాయే కానీ తగ్గక పోవడం విశేషం.

యానాం ఓపెన్ అయ్యింది …

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉండే యానాం కేంద్ర పాలిత ప్రాంతం. ఇక్కడ మద్యం, పెట్రోల్ డీజిల్ ధరలు చాలా తక్కువ. ఇటు కోనసీమ వాసులకు, కాకినాడ వాసులకు యానాం మరీ దగ్గర. దాంతో గోదావరి జిల్లాల్లో మద్యం ప్రియులు యానాం బాట పట్టేందుకు సిద్ధం అయ్యారు. ఇప్పటివరకు వైరస్ కట్టడి కోసం యానాం లో మద్యం దుకాణాలు బంద్ చేశారు. అయితే ఇప్పుడు తిరిగి మద్యం షాపు లకు అక్కడి పాండిచ్చేరి ప్రభుత్వం గేట్లు ఎత్తేసింది.

యానాం వెళ్లి మరీ…….

ఈ నేపథ్యంలో ఒక పక్క మద్యం ప్రియులు పెట్రోల్, డీజీల్ ట్యంక్ ఫుల్ చేయించుకునే వారు యానాం బయలుదేరుతున్నారు. దీనివల్ల ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో మద్యం, ఆయిల్ అమ్మకాలనుంచి ఏపీ ఖజానాకు భారీగానే చిల్లు పడే ప్రమాదం ఏర్పడింది. యానాం మద్యం షాపులకు తాకిడి ఎక్కువగా ఉండనుండటంతో చెక్ పోస్ట్ లదగ్గర తనిఖీని అటు పాండిచ్చేరి ప్రభుత్వం ఇటు ఎపి ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది.

Tags:    

Similar News