యరపతినేనీ.. అంత ఈజీ కాదు బాబూ?

తెలుగు గడ్డపై ఉత్తరాంధ్రలో బొబ్బిలి యుద్ధానికి… గుంటూరు జిల్లాలో పల్నాటి యుద్ధానికి చరిత్రలో ఎప్పుడు ఓ ప్రత్యేకత ఉంటుంది. పలనాటి యుద్ధం గురజాల – మాచ‌ర్ల రాజ్యాల [more]

Update: 2021-09-12 09:30 GMT

తెలుగు గడ్డపై ఉత్తరాంధ్రలో బొబ్బిలి యుద్ధానికి… గుంటూరు జిల్లాలో పల్నాటి యుద్ధానికి చరిత్రలో ఎప్పుడు ఓ ప్రత్యేకత ఉంటుంది. పలనాటి యుద్ధం గురజాల – మాచ‌ర్ల రాజ్యాల మధ్య జరిగింది. ఈ రెండు రాజ్యాల మ‌ధ్య ఆధిపత్య పోరులో కొన్ని వేలమంది తలలు తెగిపడ్డాయి. బ్రహ్మనాయుడు వర్సెస్ నాగమ్మ మధ్య జరిగిన ఎత్తులు పై ఎత్తులతో నాడు జ‌రిగిన యుద్ధం గురించి వింటుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకొని ఉంటాయి. ఇప్పటికీ పలనాటి గడ్డపై ప్రజల మధ్య అదే పౌరుషాలు ఉంటాయి. ఈ క్రమంలోనే అక్కడ రాజకీయ నేతలు కూడా ఎత్తులు పై ఎత్తులతో ఇప్పుడూ హీటెక్కిస్తూ ఉంటారు.

వార్ మరింత ముదిరి….

ఈ క్రమంలోనే పల్నాడు ముఖద్వారమైన పిడుగురాళ్ళ కేంద్రంగా గత నాలుగు సంవత్సరాలుగా టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. నరసరావుపేట నుంచి వచ్చి గురజాలలో పోటీచేసిన కాసు మహేష్ రెడ్డి నాన్‌లోక‌ల్ అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు ఇద్దరు నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు యుద్ధం ఒక రేంజ్‌లో సాగింది. ఎన్నికల్లో కాసు మహేష్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఎన్నికలు ముగిసిన రెండేళ్లుగా య‌ర‌ప‌తినేని పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

పట్టు పెంచుకుంటుండటంతో…

చివరకు య‌ర‌ప‌తినేని శ్రీనివాసరావు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను సైతం బహిష్కరించారు. టిడిపి తరఫున ఒక అభ్యర్థిని కూడా పోటీ పెట్టలేదు. చివరకు పిడుగురాళ్ల మున్సిపాలిటీని సైతం వైసీపీ వన్ సైడ్ గా గెలుచుకుంది. ఇప్పటికే రెండున్నర సంవత్సరాల పాలన పూర్తవడంతో పాటు వచ్చే ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఇప్పుడిప్పుడే య‌ర‌ప‌తినేని శ్రీనివాసరావు బయటకు వస్తున్నారు. కాసు మహేష్ రెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు. మహేష్ రెడ్డి ని ఈసారి ఓడించి నరసరావుపేటకు పంపిస్తానని స‌వాళ్లు రువ్వుతున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో ఘన విజయం సాధించిన మహేష్ రెడ్డి గురజాల నియోజకవర్గంలో క్రమక్రమంగా తన పట్టు పెంచుకుంటున్నారు. ఆయ‌న ఇక్కడ ఈ స్థాయిలో ప‌ట్టు చిక్కుతుంద‌ని ఎవ్వరూ ఊహించ‌లేదు.

సొంత సామాజికవర్గంలోనూ….?

కమ్మ సామాజిక వర్గంలో య‌ర‌ప‌తినేని శ్రీనివాసరావుని వ్యతిరేకించే వాళ్ళు మహేష్ రెడ్డి వైపు రావడం…. పిడుగురాళ్ల పట్టణంలో వైశ్య సామాజిక వర్గం కూడా కాసు వైపు చేరిపోవడం య‌ర‌ప‌తినేని శ్రీనివాసరావుకి మైనస్ అయింది. మరోవైపు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో నియోజకవర్గంలో క‌మ్మ నేతలు కూడా చాలా మంది వైసీపీ వైపు మళ్లీ పోయారు. ఈ పరిణామాలు య‌ర‌ప‌తినేని శ్రీనివాసరావుని రాజకీయంగా సవాల్‌ చేస్తున్నాయి. ఇక రెడ్డి నేత‌లు కూడా బ‌లంగా వైసీపీ వైపే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కాసు మహేష్ రెడ్డి ని ఢీ కొట్టి గెలవటానికి య‌రపతినేని ఇప్పటినుంచి కష్టపడితే తప్ప పన‌వ్వద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి య‌ర‌ప‌తినేని గేరు ఎలా ? మార్చుతారో ? చూడాలి.

Tags:    

Similar News