యార్లగడ్డపై యార్కర్
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. నాయకుల తలరాతలు ఎప్పుడు ఎలా మార తాయో కూడా చెప్పలేని విధంగా రాజకీయాలు రాత్రికి రాత్రి మారిపోతున్నాయి. దీంతో [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. నాయకుల తలరాతలు ఎప్పుడు ఎలా మార తాయో కూడా చెప్పలేని విధంగా రాజకీయాలు రాత్రికి రాత్రి మారిపోతున్నాయి. దీంతో [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. నాయకుల తలరాతలు ఎప్పుడు ఎలా మార తాయో కూడా చెప్పలేని విధంగా రాజకీయాలు రాత్రికి రాత్రి మారిపోతున్నాయి. దీంతో అప్పటి వరకు ఉన్న నాయకుల పరిస్థితి, ఫ్యూచర్ కూడా అగమ్య గోచరంగా మారిపోతోంది. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం నుంచి ఇటీవల ఎన్నికల్లో జగన్ సునామీని తట్టుకుని మరీ విజయం సాధించిన టీడీపీ నాయకుడు, కమ్మ వర్గానికి చెందిన వల్లభనేని వంశీ పార్టీ నుంచి మారిపోయేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే దీనికి సంబంధించిన తంతు పూర్తయింది.
స్వల్ప ఓట్ల తేడాతో….
ఈ క్రమంలోనే ఆయన రేపోమాపో.. వైసీపీ పగ్గాలు పుచ్చుకోనున్నారు. అయితే, అదే సమయంలో ఇక్కడ పార్టీని నడిపించి, ఇటీవల ఎన్నికలకు ముందు నుంచి పార్టీలో ఉండి.. పార్టీలో అనేక సమస్యలను పరిష్కరించి అందరినీ ఏకతాటిపై నడిపించిన యార్లగడ్డ వెంకట్రావు పరిస్థితి ఏంటి? ఈయన ఇటీవల ఎన్నికల్లో వంశీపై పోటీ చేసి కేవలం 874 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. గత ఎన్నికలకు వంశీ ఓడించాలన్న టార్గెట్‌తో జగన్ అదే కమ్మ వర్గానికి చెందిన వెంకట్రావుకు గన్నవరం పగ్గాలు అప్పగించారు. ఆయన రెండేళ్లుగా పార్టీ కోసం అక్కడ పనిచేసి గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు.అయినప్పటికీ.. పార్టీలో బలమైన నాయకుడిగా ఉన్నారు. జగన్ పాదయాత్ర సమయంలో నిధులు కూడా సమకూర్చారు వాస్తవానికి ఈయన ఎన్నారై. అయితే, జగన్ పిలుపుతో విదేశాల నుంచి వచ్చి గన్నవరంలో పోటీ చేశారు.
ఆందోళనలో యార్లగడ్డ వర్గం….
అయితే, ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యర్థి, వంశీని పార్టీలోకి తీసుకోవడంతో తన పరిస్థితి ఏంటని యార్లగడ్డ వెంకట్రావు ఆందోళనలో ఉన్నారు. వైసీపీలో చేరుతున్న క్రమంలో వంశీ రాజీనామా చేసినా.. ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. వాస్తవానికి 151 అసెంబ్లీ స్థానాలతో ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాజ్యసభ సీట్లు వైసీపీకి ఎక్కువగా దక్కుతాయి. ఈ క్రమంలోనే వంశీని రాజ్యసభకు పంపాలని జగన్ భావించారు. అయితే, తనకు రాజ్యసభ వద్దని, మళ్లీ గన్నవరం నుంచే పోటీ చేసి విజయం సాధిస్తానని వంశీ జగన్‌తో చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో జగన్ ఆయనకే ఈటికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో యార్లగడ్డ వర్గం ఆందోళనలో కూరుకుపోయింది.
ఆందోళనలకు దిగిన…..
యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు అయితే ఇప్పటికే గన్నవరంలో యార్లగడ్డ ముద్దు…. వంశీ వద్దని ఆందోళనలు చేస్తున్నారు. అటు యార్లగడ్డ సైతం గత ఎన్నికల్లో నకిలీ పట్టాల పంపిణీ, కుట్రలు, కుతంత్రాలతో స్వల్ప తేడాతో ఓడిపోయానంటూ వంశీపై విమర్శలు చేస్తున్నారు. ఇక ఆయన అరుచరులు కూడా తమ పరిస్థితి ఏంటి? తమ ఫ్యూచర్ ఏంటి? అని వారు కుమిలిపోతున్నారు. మరి జగన్ వీరిని ఎలా సముదాయి స్తారో చూడాలి. ఎమ్మెల్సీ ఇస్తారా? లేక ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇచ్చి సంతృప్తి పరుస్తారా? అనేది కాలమే తేల్చాలి.