యశ్వంత్ చేరిక దీదీ కన్నా?

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార టీఎంసీ నుంచి పదుల సంఖ్యలో నేతలు బీజేపీలో చేరిపోతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఒక్కరేమిటి.. [more]

Update: 2021-03-27 18:29 GMT

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార టీఎంసీ నుంచి పదుల సంఖ్యలో నేతలు బీజేపీలో చేరిపోతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఒక్కరేమిటి.. అందరూ కమలం వైపు చూస్తున్నారు. మమత బెనర్జీకి నమ్మకమైన నేతలే పార్టీని విడిచి వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మమత బెనర్జీకి తాను అండగా నిలుస్తానని ముందుకు వచ్చారు మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా.

అసంతృప్తితో…..

యశ్వంత్ సిన్హా భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేత. ఆయన వాజ్ పేయి హయాంలో ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. అయితే మోదీ, షాల హయాం వచ్చిన తర్వాత యశ్వంత్ సిన్హాను పక్కన పెట్టారు. ఆయనను కూడా ఉమాభారతి, మురళీమనోహర్ జోషి వంటి వారి జాబితాలో చేర్చారు. 2018 వరకూ బీజేపీలో అసంతృప్తి నేతగా ఉన్న యశ్వంత్ సిన్హా ఆ తర్వాత పార్టి నుంచి వైదొలిగారు.

అనేక అంశాలపై…..

బీజేపీలో ఉంటూనే యశ్వంత సిన్హా బీజేపీ పై నిప్పులు చెరిగేవారు. ఆర్థికమంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అంతేకాదు జీఎస్టీని తీసుకురావడంపై కూడా యశ్వంత్ సిన్హా అభ్యంతరం తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ఆయన రెండేళ్ల క్రితమే ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాను ఏపార్టీలో చేరనని 2018లో ప్రకటించిన యశ్వంత సిన్హా టీఎంసీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.

టీఎంసీలో చేరడంతో….

వలసలతో ఆందోళన చెందుతున్న మమత బెనర్జీ కి యశ్వంత్ సిన్హా చేరిక కొంత ఊరటనిచ్చే అంశమే. అయితే ఆయన అవుట్ డేట్ నేత అని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నా, ఆయన కామెంట్స్ కు ఒక విలువ ఉంటుంది. ఆయన చేసే వ్యాఖ్యలను ప్రజలు విశ్వసిస్తారు. యశ్వంత్ సిన్హా ఎంత మేరకు మమత బెనర్జీకి ఉపయోగపడతారన్నది పక్కన పెడితే బీజేపీని డ్యామేజీ్ చేయడానికి మాత్రం యశ్వంత్ సిన్హా దీదీకి బాగా పనికివస్తారన్నది యదార్థం.

Tags:    

Similar News