కొత్త వారు కునుకు తీస్తున్నారా… వైసీపీలో కొత్త రచ్చ
రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, కార్పొరేషన్లలో వైసీపీ పాగా వేసిన విషయం తెలిసిందే. దీంతో భారీ సంఖ్యలో వైసీపీ నాయకులకు పదవులు లభించాయి. రాష్ట్రం మొత్తం మీద ఒక్క [more]
రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, కార్పొరేషన్లలో వైసీపీ పాగా వేసిన విషయం తెలిసిందే. దీంతో భారీ సంఖ్యలో వైసీపీ నాయకులకు పదవులు లభించాయి. రాష్ట్రం మొత్తం మీద ఒక్క [more]
రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, కార్పొరేషన్లలో వైసీపీ పాగా వేసిన విషయం తెలిసిందే. దీంతో భారీ సంఖ్యలో వైసీపీ నాయకులకు పదవులు లభించాయి. రాష్ట్రం మొత్తం మీద ఒక్క అనంతపురం జిల్లా తాడిపత్రి మినహా ఒక్క చోట కూడా టీడీపీ గెలవలేదు. కార్పొరేషన్ మేయర్లు, చైర్మన్లు, చైర్ పర్సన్లతో పాటు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు.. అంటూ.. వివిధ పదవులు కట్టబెట్టారు. ఇక, వీరికి మూడు రోజుల పాటు వారు చేయాల్సిన పనులు, ప్రజలకు ఎలా చేరువ కావాలి? వంటి కీలక విషయాలపై శిక్షణ కూడా ఇచ్చారు. ప్రస్తుత కరోనా సమయంలో వీరి వల్ల నగరాలు.. పట్టణాలు శుభ్రంగా ఉంటాయని, ప్రజలకు సేవలు చేరువ అవుతాయని అనుకున్నారు.
కొత్తగా ఎన్నికైన వారిలో…?
కానీ, కొత్తగా ఎన్నికైన వారిలో అనుభవం లేకపోవడంతో వారు ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. జగన్ సామాజిక సమీకరణలు, ఇతరత్రా సమీకరణలు అంటూ కొత్తవారికి, ప్రజల్లో తిరగని వారికి పదవులు కట్టబెట్టారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనాల్లోనే ఉన్న నేతలకు పదవులు లేకపోవడంతో వారు కరోనా కష్టకాలంలో ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. పదవులు వచ్చిన వారు కరోనా భయంతో పాటు అనుభవం లేకపోవడంతో ఏం చేయలేని దుస్థితి. నగరాలు, మునిసిపాలిటీ, కార్పొరేషన్లలో ఏ ఒక్కరూ కూడా ప్రస్తుత కరోనా సమయంలో సేవలు అందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
లెక్కకు మిక్కిలిగా….
లెక్కకు మిక్కిలిగా ఉన్న.. మేయర్లు, చైర్మన్లు కూడా ప్రజల మధ్య ఉండడం లేదు. వారు ఏం చేస్తున్నారో.. కూడా ఎవరికీ తెలియదు. ఈ పరిణామాలను గమనిస్తే.. ప్రజలు అసలు ఎన్నికలు ఎందుకు పెట్టారు? వీరిని మేం ఎందుకు ఎన్నుకున్నాం.. అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. నిజానికి గత ఏడాది కరోనా తొలి దశలో.. రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లుకూడా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. దీంతో అప్పట్లో.. ప్రత్యేకంగా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. అదేస మయంలో శానిటేషన్ సహా ప్రజలకు అందుబాటులో ప్రాధమిక వైద్యం అందించారు.
సెకండ్ వేవ్ లో…?
దీంతో కరోనా కట్టడికి అవకాశం ఏర్పడింది. కానీ, ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. మునిసిపాలిటీ కానీ, కార్పొరేషన్లు కానీ.. ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. కేవలం ప్రభుత్వం నేరుగా చేస్తున్న సేవలే ప్రజలకు చేరువ అవుతున్నాయి. దీంతో కొత్తవారు కునుకు తీస్తున్నారా ? అనే ప్రశ్న తెరమీదికి వస్తుండడం గమనార్హం.