ఆటిన్ రాజా.. ఇస్పేట్ రాణులు… వైసీపీలో చీప్ గేమ్స్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను అవినీతిని సహించనని పదే పదే చెబుతున్నారు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలనూ తాను ఉపేక్షించేది లేదని అంటున్నారు. అయినా వైసీపీ నేతలు [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను అవినీతిని సహించనని పదే పదే చెబుతున్నారు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలనూ తాను ఉపేక్షించేది లేదని అంటున్నారు. అయినా వైసీపీ నేతలు [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను అవినీతిని సహించనని పదే పదే చెబుతున్నారు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలనూ తాను ఉపేక్షించేది లేదని అంటున్నారు. అయినా వైసీపీ నేతలు చీప్ గేమ్స్ తో చిక్కులు తెచ్చుకుంటున్నారు. ఇది పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చుతుంది. జగన్ ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చినా వైసీపీ నేతలు కట్టు తప్పుతూనే ఉన్నారు. చీప్ గా పేకాట క్లబ్ లకు వత్తాసు పలుకుతూ ప్రజల్లో వైసీపీ నేతలు పార్టీని పలుచన చేస్తున్నారు.
ఎమ్మెల్యే ప్రమేయం ఉందని…
కొంతకాలం క్రితం రాజధానికి అతిసమీపంలో ఒక పేకాట క్లబ్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లక్షల్లో నగదును, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో దొరికిన క్లబ్ నిర్వాహకుడు తాడేపల్లి వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అనుచరుడిగా ప్రచారం జరిగింది. ఆమెకు అనుంగు అనుచరుడని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరిగింది. దీంతో ఉండవల్లి శ్రీదేవి తనకు ఆ యువకుడితో ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. తనపై అనవసరంగా బురద చల్ల వద్దని ఉండవల్లి శ్రీదేవి చెప్పుకున్నారు. కానీ అప్పటికే ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది.
గుమ్మనూరులో మంత్రి ఇలాకాలో…..
ఇక తాజాగా మంత్రి గుమ్మనూరు జయరాం సొంత గ్రామంలో పేకాట క్లబ్ పై దాడులు జరిగాయి. ఈ దాడుల్లోనూ లక్షల్లో నగదు పదుల సంఖ్యలో కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఈ పేకాట క్లబ్ వెనక కూడా మంత్రి గుమ్మనూరి జయరాం కుటుంబ సభ్యులు ఉన్నారన్న ప్రచారం జరిగింది. మంత్రి సోదరుడు నారాయణ ఈ క్లబ్ ను నిర్వహిస్తున్నారని పెద్దయెత్తున ప్రచారం జరిగింది.
తనకేం సంబంధంలేదని….
అయితే మంత్రి గుమ్మనూరి జయరాం ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను గుమ్మనూరి వదిల ఎప్పుడో ఆలూరులో నివాసముంటున్నానని, తనకు గాని, తన కుటుంబ సభ్యులకు గాని ఆ పేకాట క్లబ్ తో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఎవరినైనా అరెస్ట్ చేసుకోవచ్చని చెప్పారు. మొత్తం మీద వైసీపీలో కీలక నేతలు చీప్ గా పేకాట క్లబ్ లలో ఇరుక్కుంటుండటం వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.