భయపెడుతున్నట్లుందే

జగన్ కి చాలా మంది శత్రువులు అన్నది అందరికీ తెలిసిందే. ఆయన తండ్రి వైపు నుంచి వచ్చిన వారే కాకుండా పదేళ్లలో జగన్ సొంతంగా తెచ్చిపెట్టుకున్న వారు [more]

Update: 2019-07-30 08:00 GMT

జగన్ కి చాలా మంది శత్రువులు అన్నది అందరికీ తెలిసిందే. ఆయన తండ్రి వైపు నుంచి వచ్చిన వారే కాకుండా పదేళ్లలో జగన్ సొంతంగా తెచ్చిపెట్టుకున్న వారు కూడా కలసి ఏ రాజకీయ నాయకుడికీ లేనంతమంది శత్రువులు జగన్ కి తయారైపోయారు. జగన్ మాత్రం ఎక్కడా తొణక్కుండా బెణక్కుండా తన పని తాను చేసుకుపోవడమే ఆయన ప్రత్యేక లక్షణంగా చెప్పాలి. జగన్ మద్దతు ఇస్తే 2009లో రోశయ్య ముఖ్యమంత్రి అయిన సంగతి అందరికీ తెలిసిందే. వైఎస్ ని అభిమానించే ఎమ్మెల్యేలంతా నాడు జగన్ కి మద్దతుగా నిలిచి ఆయన్నే సీఎం చేయాలని కోరిన సంగతి విదితమే. హైకమాండ్ రోశయ్యని పెట్టి జగన్ చేతే మద్దతు ప్రకటన ఇప్పించింది ఆ విధంగా పదకొండు నెలల పాటు రోశయ్య ముఖ్యమంత్రిగా వెలిగారు.

పెద్దాయన సుద్దులు….

ఇదిలా ఉండగా తాజాగా రోశయ్య జగన్ సర్కార్ మీద సుతి మెత్తని బాణాలు వేశారు. జగన్ దూకుడు పాలన గురించి ఇపుడే చెప్పలేనంటూనే జాగ్రత్త పడకపోతే ముందు ముందు ఇబ్బందులు తప్పవంటూ రోశయ్య హెచ్చరించారు. అంటే జగన్ చేతికి ఎముక లేకుండా చేస్తున్న వాగ్దానాలు, ఇస్తున్న హామీలపైన మాజీ ఆర్ధిక మంత్రి హోదాలో రోశయ్య స్పందించారనుకోవాలి. ఇక ఏపీ ఆర్ధిక స్థితి దారుణంగా ఉందని రోశయ్య అంటూ ఇపుడున్న సమయంలో ఏపీ సర్కార్ అడుగు కూదా ముందుకు వేయలేని వాతావరణం ఉందని వ్యా ఖ్యానించారు. జగన్ సర్కార్ దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని కూడా రోశయ్య హిత బోధ చేశారు.

ఓవర్ డ్రాఫ్ట్ పాలనేంటి …?

ఈ సీనియర్ రాజకీయ నాయకుడు రోశయ్య ఓవర్ డ్రాఫ్ట్ లతో పాలన చేయడమేంటని సెటైర్లు వేస్తున్నారు. అలాంటి పాలన వల్ల అభివ్రుధ్ధి ఏం సాగుతుందని కూడా అంటున్నారు. నిజానికి ఓవర్ డ్రాఫ్టుల స్థితికి ఏపీ పాలనను తెచ్చిందే చంద్రబాబు, ఇక దుబారా ఖర్చుల విషయంలో చంద్రబాబుకే ఈ సుద్దులన్నీ చెపాల్సి వుందని కూడా అంటున్నారు. జగన్ వరకూ తీసుకుంటే ఆయన మొదటి నుంచి పొదుపుగానే వెళ్తున్నారని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. మరో వైపు కేంద్రంతో సఖ్యతగా ఉండాలని కూడా రోశయ్య జగన్ కి చెప్పుకొచ్చారు. జగన్ ఈ రెండు నెలల్లో కూడా చేసింది అదే, ఆయన ఏపీ బీజేపీ నేతలు ఎన్ని మాటలు అంటున్నా కూడా కేంద్ర ప్రభుత్వంతో అవసరాల కోసమే మౌనంగా ఉంటూ లౌక్యంగా నెట్టుకువస్తున్నారు. ఇక ప్రతి పక్షాలను ఏపీలో జగన్ కలుపుకుని పోవాలని కూడా రోశయ్య సూచనలు చేశారు. జగన్ ఆ విషయంలో ప్రయత్నం చేయాల్సి ఉందేమో. మొత్తానికి బాబు చేసిన తప్పుల, అప్పుల భారాన్ని జగన్ మోస్తూంటే రోశయ్య లాంటి వారు చంద్రబాబుని వదిలేసి జగన్ మీద సెటైర్లు వేయడమేంటని వైసీపీ నేతలు గుస్సా అవుతున్నారు. మొత్తానికి పెద్దాయన జగన్ కి మంచి చెప్పారా, లేక భయపెట్టారా…?

Tags:    

Similar News