వందల కోట్ల ఆస్తులు..వీలునామా రాయలేదు.. అదే చిక్కొచ్చి పడింది

తమిళనాడు మాజీ ముఖ్మమంత్రి జయలలిత మరణించి సంవత్సరాలు గడుస్తున్నా ఆమె ఆస్తుల విషయంపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. జయలలితకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. జయలలితకు వివాహం [more]

Update: 2020-05-30 18:29 GMT

తమిళనాడు మాజీ ముఖ్మమంత్రి జయలలిత మరణించి సంవత్సరాలు గడుస్తున్నా ఆమె ఆస్తుల విషయంపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. జయలలితకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. జయలలితకు వివాహం కాలేదు. దాదాపు 900 కోట్ల ఆస్తులున్నాయి. జయలలిత దత్తత తీసుకున్నారన్న ప్రచారం జరిగినా అధికారికంగా మాత్రం లేదు. అయితే జయలలిత మరణించిన తర్వాత అనేక మంది ఆమె వారసులమంటూ న్యాయస్థానాలను ఆశ్రయించారు.

ఇప్పటికీ కొన్ని వివాదాలు…

న్యాయస్థానాల్లో నేటికీ జయలలిత కొన్ని ఆస్తులపై వివాదాల జరుగుతున్నాయి. జయలలిత కు సంబంధించిన ఆస్తులను నిజానికి శశికళ కైవసం చేసుకోవడానికి ప్రయత్నించారు. జయలలిత మరణించిన తర్వాత నగదు, బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను కూడా శశికళ మనుషులు తీసుకెళ్లారని విమర్శలు ఉన్నాయి. ఊటీలోని జయ ఎస్టేట్స్ లో వాచ్ మెన్ హత్య కూడా ఇందుకు అద్దం పడుతోంది.

హత్యలు కూడా…..

పళనిస్వామి అధికారంలోకి వచ్చిన తర్వాత జయలలిత ఆస్తుల వివాదంలో జరిగిన హత్యలపై స్పెషల్ ఎంక్వైరీ చేయించారు. అయినా ఇప్పటికీ కారకులెవరో తెలియలేదు. ఇప్పటికే జయలలిత ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసింది. వీలునామా ఎవరి పేరిటా రాయకపోవడంతో ఆస్తుల పరిరక్షణకు కస్టోడియన్ ను నియమించాలని గతంలో ఐటీ శాఖ న్యాయస్థానాన్ని కూడా కోరింది. జయలలిత వారసులమంటూ అనేక మంది ముందుకు వచ్చినా వారినెవరినీ న్యాయస్థానం వారసులుగా గుర్తించలేదు.

పోయెస్ గార్డెన్ ను కూడా….

ఇక జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ పై అనేక మంది కన్నేశారు. జయలలిత మరణించిన తర్వాత దానిని జయ మ్యూజియంగా మార్చి ప్రజల సందర్శనార్థం ఉంచాలని ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు. కానీ పోయెస్ గార్డెన్ ను దక్కించుకోవాలని చివరి క్షణం వరకూ శశికళ ప్రయత్నించారు. కానీ తాజాగా పోయెస్ గార్డెన్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిపై ఆర్డినెన్స్ తీసుకు వచ్చి స్వాధీనం చేసుకున్నారు. దీని నిర్వహణకు ట్రస్ట్ ను కూడా ఏర్పాటు చేసింది. మొత్తం మీద జయలలితకు చెందిన 900 కోట్ల ఆస్తులు ప్రభుత్వ పరంఅయ్యాయి.

Tags:    

Similar News