యడ్డీ తగ్గింది అందుకే

భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం సహకరించకపోయినా, ఉప ఎన్నికల్లో ఓటమి అంచున ఉన్నామని తెలిసినా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప పూర్తికాలం ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు అన్ని రకాల [more]

Update: 2019-11-10 16:30 GMT

భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం సహకరించకపోయినా, ఉప ఎన్నికల్లో ఓటమి అంచున ఉన్నామని తెలిసినా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప పూర్తికాలం ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగనే జనతాదళ్ ఎస్ ను తమకు అనుకూలంగా మార్చుకోగలిగారు. ఉప ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పై కక్ష తీర్చుకునేందుకు ఇదే సరైన మార్గమని అప్ప భావిస్తున్నారు.
నాటి ఎన్నికల్లో…..
దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచినప్పటికీ అతి తక్కువ స్థానాలున్న జనతాదళ్ ఎస్ కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ముఖ్యమంత్రి కుమారస్వామిని ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయించింది. అంటే బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునే క్రమంలో భాగంగానే కాంగ్రెస్ నేతలు జేడీఎస్ కు అవకాశం ఇచ్చారు.

అదే తరహాలో….

ఇప్పుడు అదే తరహాలో యడ్యూరప్ప గేమ్ మొదలు పెట్టారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత జేడీఎస్, కాంగ్రెస్ ల మధ్య ఏర్పడిన వైరుధ్యాలను తనకు అనుకూలంగా మలుచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా యడ్యూరప్ప రెండు నెలల నుంచి మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. జేడీఎస్ శాసనసభ్యులు పది మంది వరకూ తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు కుమారస్వామి, దేవెగౌడ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి.

అందుకే దేెవెగౌడతో భేటీ….

ఒకవేళ మధ్యంతర ఎన్నికలు వచ్చినా తమకు పెద్దగా స్థానాలు వచ్చే అవకాశం లేదని గ్రహించిన జేడీఎస్ బీజేపీతో సత్సంబంధాలకు మొగ్గు చూపింది. అందుకే దేవెగౌడ, కుమారస్వామి బీజేపీకి అనుకూల ప్రకటనలు చేశారు. ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవకున్నా యడ్యూరప్ప ప్రభుత్వానికి వచ్చే ముప్పు లేదని చెప్పారు. అంతే కాదు తాము మద్దతుగా నిలుస్తామని కూడా ప్రకటించారు. యడ్యూరప్ప కూడా తాజాగా దేవెగౌడతో తన భేటీ వాస్తవమేనని, అయితే ఆచర్చలను బహిరంగ పర్చ బోనని చెప్పారు. మొత్తం మీద యడ్యూరప్ప తన స్థానాన్ని పదిలం చేసుకునే పనిలోనే ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు.

Tags:    

Similar News