అంత రిస్క్ ఎందుకనేనా?

కర్ణాటకలో నిత్యం ఆపరేషన్ కమల్ జరుగుతున్నట్లే కన్పిస్తుంది. ఇందుకు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటనే నిదర్శనం. ఇప్పటికీ యడ్యూరప్ప ప్రభుత్వం మ్యాజిక్ ఫిగర్ కు కొద్దిదూరంలోనే ఉండటం, [more]

Update: 2019-09-06 17:30 GMT

కర్ణాటకలో నిత్యం ఆపరేషన్ కమల్ జరుగుతున్నట్లే కన్పిస్తుంది. ఇందుకు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటనే నిదర్శనం. ఇప్పటికీ యడ్యూరప్ప ప్రభుత్వం మ్యాజిక్ ఫిగర్ కు కొద్దిదూరంలోనే ఉండటం, ఉప ఎన్నికలు జరిగితే ప్రభుత్వానికి ముప్పు ఏర్పడుతుందనే యడ్యూరప్ప ఆపరేషన్ కమల్ ను కొనసాగిస్తున్నారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే కాంగ్రెస్, జేడీఎస్ నుంచి 17 మంది ఎమ్మెల్యేలు పదవులకు, పార్టీకి రాజీనామా చేయడంతో వారిపై అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.

ఆ భయం లేదు…..

అయితే ఇప్పుడు స్పీకర్ బీజేపీకి చెందిన వారు. అనర్హత వేటు పడుతుందన్న భయం లేదు. అందుకోసమే మరికొందరు ఎమ్మెల్యేలకు యడ్యూరప్ప గాలం వేస్తున్నారా? అన్నఅనుమానాలూ లేకపోలేదు. యడ్యూరప్ప ఊరికే ఉండే మనిషి కాదన్నది అందరికీ తెలిసిందే. కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ ఏర్పడిన నాటి నుంచే ఆపరేషన్ కమల్ ను స్టార్ట్ చేశారు. కుమారస్వామికి, సిద్ధరామయ్యకు కంటి మీద కునుకులేకుండా చేశారు. దాదాపు పథ్నాలుగు నెలల తర్వాత చేతికి మట్టి అంటకుండా యడ్యూరప్ప విజయం సాధించారు.

పదిహేడు మంది బాధ్యత…..

కానీ ఇప్పుడు ఆ పదిహేడుమంది ఎమ్మెల్యేల భవిష్యత్తును ఇప్పుడు యడ్యూరప్ప మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. అనర్హత వేటు వారిపై పడితే వారి కుటుంబ సభ్యులను ఉప ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించుకోవడం కూడా యడ్యూరప్ప పనే. ఇది కొంచెం రిస్క్ తో కూడుకున్నదే. అందుకే యడ్యూరప్ప ఉప ఎన్నికలు జరిగి ఫలితాలు ఎలా ఉన్నా మరో పదిహేను మందిని లాగేసుకుంటే కుర్చీకి ఢోకా ఉండదని యోచిస్తున్నారన్నది కర్ణాటకలో విన్పిస్తున్న టాక్.

కుమారస్వామి ఆరోపించినా….

కాంగ్రెస్, జేడీఎస్ లకు చెందిన పదిహేను మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తే వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు యడ్యూరప్ప రెడీ గా ఉన్నారట. వివిధ బోర్డులు, కార్పొరేషన్ ఛైర్మన్ పదవులతో వారిని సంతృప్తి పర్చ వచ్చనేది యడ్యూరప్ప ఆలోచనగా కుమారస్వామి చెబుతున్నారు. మరో నాలుగేళ్ల పాటు అధికారంలో కొనసాగాలంటే ఆ మాత్రం రిస్క్ చేయక తప్పదన్నది కమలనాధుల ఆలోచన. అందుకోసమే తమకు కావాల్సినంత మంది ఎమ్మెల్యేలకు యడ్యూరప్ప ఎరవేస్తున్నారన్నది కుమారస్వామి ఆరోపణ. ఈ ఆరోపణల్లో నిజమెంత ఉందనేకన్నామొత్తం మీద కర్ణాటకలోనిత్యం ఆపరేషన్ ఎమ్మెల్యే కొనసాగేలా కన్పిస్తుంది.

Tags:    

Similar News