యడ్డీని షేక్ చేస్తున్నాయటగా

ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలతో యడ్యూరప్ప డీలా పడ్డారు. అక్కడ అధికారంలోకి ఎవరు వచ్చారన్నది పక్కన పెడితే అక్కడి జనాభిప్రాయాన్ని చూసి యడ్యూరప్ప షేక్ [more]

Update: 2019-10-27 18:29 GMT

ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలతో యడ్యూరప్ప డీలా పడ్డారు. అక్కడ అధికారంలోకి ఎవరు వచ్చారన్నది పక్కన పెడితే అక్కడి జనాభిప్రాయాన్ని చూసి యడ్యూరప్ప షేక్ అవుతున్నారు. ఇటీవల జరిగిన హర్యానా, మహారాష్ట్రతో పాటు అనేక రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఊహించని ఫలితాలు వచ్చాయి. ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న నేతలు ఓటమి పాలయ్యారు. పేరున్న నేతలు సయితం ఇంటి బాట పట్టారు. బీజేపీ అధిష్టానం సయితం ఇది ఊహించని విషయం.

పార్టీలు మారిన వాళ్లు…..

గుజరాత్ లో కాంగ్రెస్ నుంచి గెలిచి రాజీనామా చేసి బీజేపీలో చేరి పోటీ చేసిన అల్ఫేశ్ ఠాకూర్ ఓటమి దారుణంగా ఓటమి పాలయ్యారు. అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సతారా పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన ఉదయ్ రాజ్ భోస్లే అతివిశ్వాసానికి వెళ్లి ఎనిమిది నెలల్లోనే ఎంపీ పదవికి రాజీనామా చేశారు. బీజేపీ తరుపున అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. గత మూడు దఫాలు ఎన్సీపీ నుంచి గెలిచిన ఉదయ్ రాజ్ భోస్లే బీజేపీలో చేరి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఫిరాయింపుదార్లపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారన్నది ఈ ఎన్నికల్లో స్పష్టంగా తెలిసింది.

ఇక్కడ కూడా….

దీంతో యడ్యూరప్పకు బెంగ పట్టుకుంది. డిసెంబరులో కర్ణాటకలో పదిహేను శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు తిరిగి టిక్కెట్లు ఇస్తామని యడ్యూరప్ప చెప్పారు. పదిహేను స్థానాల్లో కాంగ్రెస్, జేడీఎస్ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన నేతలు రాజీనామా చేయడం వల్లనే యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పడింది. దీంతో తిరిగి ఉప ఎన్నికల్లో వారికే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయంచారు. అయితే హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత యడ్యూరప్ప పునరాలోచనలో పడక తప్పని పరిస్థితి ఏర్పడింది.

వారికి టిక్కెట్లు ఇవ్వవద్దంటూ…

ఒకసారి ప్రజలు తాము గెలిపించిన వారు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా పార్టీ మారితే ఓటమి ఖాయమన్నది ఈ ఎన్నికల్లో తేలిపోయింది. దీంతో కొందరు బీజేపీ నేతలు సయితం అధిష్టానానికి దీనిపై పునరాలోచించుకోవాలని చెప్పేందుకు సిద్ధమయ్యారు. త్వరలో జరగనున్న పదిహేను నియోజకవర్గాల్లో బీజేపీ నేతలకే టిక్కెట్లు ఇవ్వాలన్నది వీరి డిమాండ్ గా విన్పిస్తుంది. లేకుంటే అన్ని సీట్లలో ఓటమి తప్పదని వారు హైకమాండ్ కు చెప్పదలచుకున్నారు. ప్రభుత్వానికి కూడా ఉప ఎన్నికల్లో గెలుపు ఖచ్చితం కావడంతో రీథింక్ చేయకతప్పదని వారు అంచనా వేస్తున్నారు.యడ్యూరప్ప కూడా మహరాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు షేక్ చేస్తున్నాయనే చెప్పాలి.

Tags:    

Similar News