త్వరలో మరో సలహాదారు ఔట్.. వైసీపీలో గుసగుస
ఏపీ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు లెక్కకు మిక్కిలిగా ఉన్న సలహాదారుల విషయం ఎప్పటికప్పుడు ఆసక్తిగానే ఉంటోంది. చంద్రబాబు సర్కారులోనూ పలువురు సలహాదారులు ఉన్నారు. కానీ, ఇంత పెద్ద [more]
ఏపీ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు లెక్కకు మిక్కిలిగా ఉన్న సలహాదారుల విషయం ఎప్పటికప్పుడు ఆసక్తిగానే ఉంటోంది. చంద్రబాబు సర్కారులోనూ పలువురు సలహాదారులు ఉన్నారు. కానీ, ఇంత పెద్ద [more]
ఏపీ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు లెక్కకు మిక్కిలిగా ఉన్న సలహాదారుల విషయం ఎప్పటికప్పుడు ఆసక్తిగానే ఉంటోంది. చంద్రబాబు సర్కారులోనూ పలువురు సలహాదారులు ఉన్నారు. కానీ, ఇంత పెద్ద సంఖ్యలో మాత్రం కేవలం జగన్ సర్కారులోనే ఉండడం గమనార్హం. పార్టీ కోసం కష్టపడిన వారిని ఏదోలా సర్దుబాటు చేసే క్రమంలో జగన్ లెక్కకుమిక్కిలిగా సలహాదారులను నియమించుకున్నారు. అయితే.. వీరిపై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రధాన న్యాయ కార్యకలాపాలు, కోర్టుల విషయంలో ప్రభుత్వం అను సరిస్తున్న వైఖరి, అదేవిధంగా ఎస్సీలపై దాడులు, పోలీసులు అనుసరిస్తున్న దూకుడు వ్యవహారాలపై ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా కూడా సలహాదారులవైపు వేళ్లు చూపిస్తున్నారు.
ప్రభుత్వమే తప్పించాలని…..
మీడియా తరఫున కూడా ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ సలహాలు ఇచ్చేందుకు పెద్ద తలకాయలే ఉన్నాయి. కానీ.. ఆశించిన విధంగా జగన్‌కు మైలేజీ రాకపోగా… ప్రభుత్వంపై ఓ వర్గం మీడియా, ప్రతిపక్షాలు చేస్తోన్న దాడి కూడా ఎక్కువగా ఉందనేది సీఎం అభిప్రాయం. ఇక, పనిలేక కొందరు, ఛాంబర్లు కూడా లేక మరికొందరు సలహాదారులు ఉన్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి స్వచ్ఛందంగానే తన పదవిని వదులుకున్నారు. ఇక, ఇప్పుడు మరో సలహారును ప్రభుత్వమే తప్పించాలని నిర్ణయించుకున్నట్టు వైసీపీలో గుసగుస వినిపిస్తోంది.
విఫలమవుతున్నారని…..
అయితే.. ఎవరు? ఏ రంగానికి చెందిన సలహాదారు ? అనే విషయాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉన్నాయని ఏపీ సచివాలయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. కొన్నాళ్లుగా సీఎం జగన్.. స్పందన, వలంటీర్ వ్యవస్థలపై వరుస సమీక్షలు చేస్తున్నారు. ఆయా విషయాల్లో సలహాలు ఇవ్వాలంటూ.. ఆయన ఇటీవల మీడియాకు కూడా సూచించారు. దీనిని బట్టి వీటిని చూస్తున్న సలహాదారులు.. విఫలమవుతున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
ఈసారి ఎవరి వంతు?
ఇక దీనికి తోడు ప్రభుత్వం 18 సంవత్సరాల లోపు, 35 ఏళ్లు పైబడిన వలంటీర్లను తప్పించాలని తీసుకున్న నిర్ణయం కూడా ఇందులో ప్రక్షాళనలో భాగమే అంటున్నారు. దీంతో అటు స్పందన, ఇటు వలంటీర్ వ్యవస్థలకు సలహాదారులుగా ఉన్నవారిపై వేటు పడుతుందా ? అనే కోణంలో వైసీపీలో నేతలు గుసగుసలాడుకోవడం గమనార్హం. మరి ఎవరిపై వేటు పడుతుందో చూడాలి. త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడుతుందంటున్నారు.