అక్కడే ఇద్దరూ తిరిగితే ఎలాగండీ?
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ ల పై అధికార విపక్షాల నడుమ తీవ్ర విమర్శలు ఆరోపణలు కొనసాగుతున్నాయి. హై కోర్టు ప్రభుత్వం బిసి లకు పెంచిన [more]
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ ల పై అధికార విపక్షాల నడుమ తీవ్ర విమర్శలు ఆరోపణలు కొనసాగుతున్నాయి. హై కోర్టు ప్రభుత్వం బిసి లకు పెంచిన [more]
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ ల పై అధికార విపక్షాల నడుమ తీవ్ర విమర్శలు ఆరోపణలు కొనసాగుతున్నాయి. హై కోర్టు ప్రభుత్వం బిసి లకు పెంచిన రిజర్వేషన్ లు కొట్టేస్తుందని తెలిసి కూడా కపట ప్రేమ తో అధికారపార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు మొదలు పెట్టిందని విపక్షం ఆరోపిస్తుంది. మరో పక్క టిడిపి కోర్టు లో అడ్డుకుని బిసి లకు అన్యాయం చేస్తుందంటూ వైసిపి విరుచుకుపడుతుంది. ఈ అంశమే ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది. హై కోర్టు ప్రభుత్వ జీవో ను ఇలా కొట్టేసిందో లేదో రెండు ప్రధాన పక్షాలు రోడ్డున పడి మాటలతో కొట్టేసుకుంటున్నారు నేతలు. అచ్చెన్నాయుడు నుంచి చంద్రబాబు వరకు వైసిపి లో బొత్స సత్యనారాయణ నుంచి జోగి రమేష్ వరకు యుద్ధం లో ముందున్నారు.
ప్రతాపరెడ్డి మీ వాడే …
హై కోర్టు లో రిజర్వేషన్ల అంశంపై కేసు దాఖలు చేసిన ప్రతాపరెడ్డి పై ఇప్పుడు రెండు పార్టీలు కథ నడిపిస్తున్నాయి. ప్రతాపరెడ్డి వైసిపి మనిషే అంటూ టిడిపి కాదు మీ పార్టీ నే ఇదిగో చంద్రబాబు తో ఉన్న ఫోటో లు చూడండి అంటూ అధికారపార్టీ ఒకరిపై మరొకరు ఎక్కడా తగ్గడం లేదు. రెడ్డి అనే పేరు ఉంటె వైసిపి నేనా? అంటూ నేతలు జెసి దివాకరరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏ పార్టీ అంటూ నిలదీస్తుంది ఫ్యాన్ పార్టీ.
పక్కకు పోయిన అమరావతి …
స్థానిక ఎన్నికల నగారా మోగే నేపథ్యంలో రెండు పార్టీలు ఇక ఓటు బ్యాంక్ రాజకీయాలకే ప్రధాన ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టాయి. అమరావతి ఉద్యమం పై టిడిపి ఫోకస్ తగ్గించి తమ పార్టీకి ప్రధాన వెన్నెముకను విరిచేయాలని వ్యూహం రచించిన వైసిపి పై దాడి ని తీవ్రం చేసేసింది. ఈ అంశంలో వైసిపి సైతం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మా పార్టీ బిసి ల ఉద్ధరిస్తుందంటే కాదు తామే వారికి దేవుళ్లమని రాజకీయాలను హీటెక్కించేస్తున్నాయి రెడీనందు పార్టీలు.
గతంలో బాబు ఇప్పుడు జగన్ …
గతంలో కాపు రిజర్వేషన్ల అంశంలో హైకోర్ట్ నో చెబుతుందని తెలిసినా ప్రత్యేకంగా వారికి కోటా పెట్టి బిసిల్లో చేరుస్తా అంటూ చెప్పిన చంద్రబాబు ఆ తరువాత తీవ్ర ఇక్కట్లు ఆ సామాజిక వర్గం నుంచి ఎదుర్కొన్నారు. అసాధ్యం అని తెలిసినా అదిగో ఇదిగో అంటూ కాపు జనోద్ధరణకే టిడిపి అన్నంత బిల్డప్ ఇచ్చి చివరికి ఆ వర్గం ఓటు బ్యాంక్ నే దూరం చేసుకున్నారు. ఎన్నికల ముందు అగ్రవర్ణ పేదలకోసం కేంద్రం కేటాయించిన రిజర్వేషన్ల కోటాలో కోత పెడుతూ ఒక చెల్లని జీవో తో రాజకీయాలకే ఆ అంశాన్ని పరిమితం చేసి వాగ్దాన భంగం చేశారు. ఇప్పుడు జగన్ సర్కార్ కి 50 శాతం మించితే రిజర్వేషన్లు కోర్టు ఆమోదించదని తెలిసినా స్థానిక ఎన్నికలలో 59 శాతానికి పైబడి రిజర్వేషన్లు ఇచ్చేసింది ప్రభుత్వం. కోర్ట్ ఆ జీవోను కొట్టివేయడంతో తమ వైఫల్యాన్ని విపక్షం వైపు మళ్ళించింది అధికారపార్టీ. ఇలా అటు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎలాంటి అడుగులు వేసి భంగ పడ్డారో ఇప్పుడు జగన్ సైతం అదే ఫార్ములా అనుసరించి బిసి రిజర్వేషన్ల అంశంలో విమర్శలు ఎదుర్కొంటున్నారని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.