పోతిరెడ్డిపాడు.. టీక‌ప్పులో తుఫానేనా… వ్యూహాత్మకంగానేనా?

శ్రీశైలం వ‌ర‌ద జ‌లాల‌ను ఎత్తిపోత‌ల ద్వారా సీమ ప్రాంత జిల్లాల‌కు త‌ర‌లించేందుకు వీలుగా ఇప్పటికే ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేట‌ర్ ఎత్తు పెంచాల‌న్న ఏపీ సీఎం జ‌గ‌న్ ప్రతిపాద‌న [more]

Update: 2020-05-22 08:00 GMT

శ్రీశైలం వ‌ర‌ద జ‌లాల‌ను ఎత్తిపోత‌ల ద్వారా సీమ ప్రాంత జిల్లాల‌కు త‌ర‌లించేందుకు వీలుగా ఇప్పటికే ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేట‌ర్ ఎత్తు పెంచాల‌న్న ఏపీ సీఎం జ‌గ‌న్ ప్రతిపాద‌న రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మంట‌లు రేపుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ ఒక్క కార‌ణంగా గ‌డిచిన కొన్నేళ్లుగా ఉన్న రెండు రాష్ట్రాల సీఎంల మ‌ధ్య స్నేహం చెడిపోతుందా ? నువ్వెంత అంటే.. నువ్వెంత అనే రేంజ్ లో ఇద్దరూ రోడ్డెక్కుతారా ? ఇక‌పై మ‌రింత‌గా ఇరు రాష్ట్రాల మ‌ధ్య సెగ‌లు, ప‌గ‌లు పెరుగుతాయా ? గ‌త చంద్రబాబు పాల‌న‌లో మాదిరిగా కేసీఆర్ ఏపీపై వ్యూహాత్మకంగా ఆధిప‌త్యం చ‌లాయించేందుకు ప్రయ‌త్నిస్తారా ? లేక‌, జ‌గ‌నే వ్యూహాత్మకంగా పైచేయి సాధిస్తారా? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే ఇరు రాష్ట్రాల మేధావుల‌ను తొలిచేస్తున్నాయి.

జగన్ తో విభేదించకుండా….

అయితే, దీనిపై రెండు ర‌కాలుగా చ‌ర్చలు న‌డుస్తున్నాయి. వీటిలో ఒక‌టి.. జ‌గ‌న్‌తో విభేదించాల‌నే అభిప్రాయం కేసీఆర్‌కు ఎట్టి ప‌రిస్థితిలోనూ లేద‌ని అంటున్నారు. దీనికి ప్రధాన కార‌ణం.. గోదావ‌రి నీటిని ఒడిసి ప‌ట్టి.. ఇరు రాష్ట్రాల మ‌ధ్య తెలంగాణ భూభాగంలో భారీ ప్రాజెక్టుకు రూప‌క‌ల్పన చేయాల‌నేది కేసీఆర్ వ్యూహం. దీనికి ఇప్పటికే ప్రాథ‌మిక ఒప్పందాలు కూడా ఇరు రాష్ట్రాల మ‌ధ్య జ‌రిగిపోయాయి. ఈ ప్రాజెక్టు క‌నుక నిర్మాణం పూర్తయితే.. ఇక‌, కేసీఆర్‌కు తెలంగాణ‌లో తిరుగులేద‌నే అభిప్రాయం రాజ‌కీయంగా వ్యక్తమ‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్‌.. ఎట్టిప‌రిస్థితిలోనూ జ‌గ‌న్‌తో విభేదించే అవ‌కాశం లేద‌ని అంటున్నారు.

జగన్ కూడా సేమ్ ఒపీనియన్….

ఇక‌, జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే..రాజ‌కీయంగా ఆయ‌న‌కు సీమకు నీటిని అందించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇప్పటి వ‌ర‌కు సీమ నుంచి రాష్ట్రాన్ని పాలించిన సీఎంలు ఎవ్వరూ ఇక్కడి నీటి స‌మ‌స్యను పెద్దగా ప‌ట్టించుకోలేదు. ఈ అప‌ప్రధను తుడిచి పెట్టడంతోపాటు.. త‌న హ‌వాను పూర్తిస్థాయిలో నిల‌బెట్టుకునేందుకు జ‌గ‌న్‌కు పోతిరెడ్డిపాడు త‌ప్ప మ‌రో మార్గం లేదు. అయితే, అలాగ‌ని కేసీఆర్‌తో విభేదించాల‌నే అభిప్రాయం కూడా జ‌గ‌న్‌కు లేద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో సానుకూల ధోర‌ణిలోనే వ్యవ‌హ‌రించాల‌ని ఇప్పటికే నిర్ణయించుకున్నారు.

వ్యూహాత్మకంగానే….

ఈ క్రమంలోనే కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు ఏపీకి కేటాయించిన కేటాయింపుల‌ను ఆయ‌న తెర‌మీదికి తెచ్చారు. ఇది నిజానికి చాలా వ్యూహాత్మకం. దీనిని చూపించ‌డం ద్వారా ఏపీ ప్రయోజ‌నాల‌ను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక‌, తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. బోర్డు కేటాయింపులు ఎలాగూ ఉంటాయి కాబ‌ట్టి.. కేసీఆర్ కూడా దీని నుంచి బ‌య‌ట‌ప‌డే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని అంటున్నారు. మొత్తంగా ఈ వ్యూహంలో కేసీఆర్ కానీ, జ‌గ‌న్ కానీ, త‌మ త‌మ ప్రయోజ‌నాలు కాపాడుకుంటూనే..మిత్రత్వాన్ని కొన‌సాగించాల‌ని భావిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News