ఇద్దరి టార్గెట్ అదేనా?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు భేటీకానున్నారు. ఈరోజు 12 గంటలకు ప్రగతి భవన్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఈ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు భేటీకానున్నారు. ఈరోజు 12 గంటలకు ప్రగతి భవన్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఈ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు భేటీకానున్నారు. ఈరోజు 12 గంటలకు ప్రగతి భవన్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రెండు తెలుగురాష్ట్రాల సమస్యలతో పాటు జాతీయ రాజకీయాలపై కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించనున్నట్లు తెలుస్తోంది. అందుకే మంత్రులు, అధికారులు ఎవరూ లేకుండానే కేవలం ఇద్దరు మాత్రమే సమావేశం కానున్నట్లు సమాచారం.
సహకారం లేక…..
ప్రధానంగా ఇటీవల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. కేంద్రం నుంచి నిధులు విడుదల కాకపోవడం, రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణని వ్యవహరించడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. కేంద్రం నుంచి విడుదల కావాల్సిన నిధులపై ఆయన ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖలు సయితం రాశారు. రాజకీయంగా కూడా తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతుండటంతో దానికి చెక్ పెట్టాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని…
మరోవైపు ఏపీ లోనూ బీజేపీ అలాగే వ్యవహరిస్తుంది. రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించడంలోనూ, నిధులు విడుదల చేయడంలోనూ ఆంధ్రప్రదేశ్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైఎస్ జగన్ భావిస్తున్నారు. తాను కేంద్రంతో సయోధ్యగా ఉండటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అటు నుంచి సహకారం అందడం లేదు. దీనికి తోడు ఇటీవల మూడు రాజధానుల ప్రతిపాదనపైన కూడా రాష్ట్ర బీజేపీ నేతలు వైసీపీ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు.
రాజకీయాలపైనే…
ఈ నేపథ్యంలో ఇరువురి ముఖ్యమంత్రుల మధ్య ప్రధానంగా రాజకీయ అంశాలపైనే చర్చ ఎక్కువగా జరిగే అవకాశముంది. దాదాపు నాలుగైదు గంటలు వీరి భేటీ జరగనున్నట్లు తెలిసింది. దీనికితోడు సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు వ్యవహారం కూడా చర్చకు రానుందని తెలుస్తోంది. మొత్తం మీద జగన్, కేసీఆర్ భేటీ ఆసక్తికరంగా మారింది. కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకునే వీరిరువురు ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది.