మున్సిపోల్స్ దెబ్బ… ఆ ఇద్దరు మంత్రులు డేంజర్ జోన్ లోనే ?
ఏపీలో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఇద్దరు మంత్రులపై పడింది. . అనంతపురం జిల్లా తాడిపత్రి, కడప జిల్లా మైదుకూరు మినహా సిక్కోలు టు చిత్తూరు, [more]
ఏపీలో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఇద్దరు మంత్రులపై పడింది. . అనంతపురం జిల్లా తాడిపత్రి, కడప జిల్లా మైదుకూరు మినహా సిక్కోలు టు చిత్తూరు, [more]
ఏపీలో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఇద్దరు మంత్రులపై పడింది. . అనంతపురం జిల్లా తాడిపత్రి, కడప జిల్లా మైదుకూరు మినహా సిక్కోలు టు చిత్తూరు, కడప, అనంతపురం అన్ని చోట్లా కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు తేడా లేకుండా వైసీపీ వన్‌సైడ్ విజయం సాధించేసింది. జగన్ ముందుగానే ఆయా జిల్లాల మంత్రులతో పాటు తమ నియోజకవర్గాల్లో ఎన్నికలు ఎదుర్కొంటోన్న వారికి కూడా వార్నింగ్‌లు ఇచ్చేశారు. ఎవరు అయితే స్థానిక ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించరో వారిని పక్కన పెట్టేస్తానని కూడా నేరుగానే వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రి మున్సిపాల్టీ పోయినా అక్కడ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి జరిగే నష్టం ఉండదు.. ఆయన ఎమ్మెల్యే పదవికి ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం లేదు. ఆయన ఎలాగూ మంత్రి పదవి రేసులో లేరు.
కొన్ని చోట్ల ఊహించని స్థాయిలో….
అయితే కొన్ని చోట్ల జగన్ ఊహించని స్థాయిలో అయితే ఫలితాలు రాలేదు. ఉదాహరణకు వైజాగ్ విజయాన్ని జగన్ మెచ్చలేదని.. ఫలితాల తర్వాత ఫోన్ చేసి అక్కడ మంత్రి అవంతితో పాటు స్థానిక ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చేశారట. వైజాగ్‌లో టీడీపీ ఏకంగా 30 కార్పొరేటర్ స్థానాలు గెలుచుకోవడం జగన్‌కు ఏ మాత్రం రుచించలేదట. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే పార్టీ మారిన సౌత్ నియోజకవర్గంలో ఆయన వర్గీయులు కేవలం ఇద్దరు మాత్రమే గెలిచారు. గాజువాక, పెందుర్తిలోనూ పార్టీ నేతలు ఎక్కువుగా ఓడారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మంత్రి అవంతి ప్రాతినిధ్యం వహిస్తోన్న భీమిలిలో 8 డివిజన్లకు ఆయన కుమార్తె మాత్రమే చెమటోచ్చి నెగ్గారు. ఇక్కడ పరాజయం తర్వాత అసలే అంతంత మాత్రంగా ఉన్న అవంతి గ్రాఫ్ మరింత పడిపోయింది.
అవంతి పనితీరు పట్ల…
జగన్ సైతం అవంతి పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని పార్టీ వర్గాలే చర్చించు కుంటున్నాయి. ఇప్పటికే అవంతి మంత్రి పదవి రెండున్నరేళ్లు అన్న ప్రచారం ఉండగా.. ఇప్పుడు ఆయన్ను ఎవ్వరూ కాపాడలేని పరిస్థితి. ఇక మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో మరో మంత్రి పినిపే విశ్వరూప్ కూడా దెబ్బతిన్నారు. ఆయన పనితీరు పట్ల కూడా జగన్ ఏ మాత్రం సంతృప్తిగా లేరన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
మరో మంత్రి కూడా….
అమలాపురంలో పార్టీ గెలిచినా అక్కడ అనుకున్న స్థాయి విజయం లేదు. జిల్లాలోనే పెద్ద మున్సిపాల్టీ… పైగా కోనసీమ కేంద్రం, లోక్‌సభ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న అక్కడ జనసేన ఎక్కువ ప్రభావం చూపింది. అమలాపురంలో ఎంపీ, మంత్రి గ్రూపు తగాదాలు కూడా పార్టీకి దెబ్బేశాయన్న నివేదికలతో పాటు మంత్రి ఓ సామాజిక వర్గానికి ప్రయార్టీ ఇవ్వకపోవడం కూడా అక్కడ ఫలితాలు అనుకున్న స్థాయిలో రాలేదన్నది కూడా జగన్ దగ్గరకు వెళ్లింది. ఇక మంత్రిగాను ఆయన పెర్పామెన్స్ పట్ల జగన్ పెదవి విరుపుతో ఉన్నారట. ఆయన కూడా ఈ ఫలితాల తర్వాత డేంజర్ జోన్లోకే వెళ్లిపోయారని పార్టీ వర్గాల్లోనే నడుస్తోన్న చర్చలు.