జ‌గ‌న్ చుట్టూ బెయిల్ రాజ‌కీయం.. ఢిల్లీ వ‌ర్గాల మాట ఇదే?

ఏపీ సీఎం జ‌గ‌న్ విష‌యం ఇప్పుడు ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో బ‌ల‌ప‌డాల‌ని నిర్ణయించుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ఏపీలో పావులు క‌దిపేందుకు రెడీ [more]

Update: 2021-04-09 14:30 GMT

ఏపీ సీఎం జ‌గ‌న్ విష‌యం ఇప్పుడు ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో బ‌ల‌ప‌డాల‌ని నిర్ణయించుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ఏపీలో పావులు క‌దిపేందుకు రెడీ అవుతున్నట్టు ఢిల్లీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే జ‌గ‌న్ విష‌యంలో త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను ప్రయోగించాల‌ని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే.. ఏపీలో ఒక‌ప్పుడు బ‌లంగా ఉన్న టీడీపీ ఇప్పుడు డ‌మ్మీ అయిపోయింది. ఇక‌, ఇప్పుడు బ‌లంగా ఉన్న జ‌గ‌న్‌ను దెబ్బతీయ‌డం ద్వారా తాము ఎద‌గాల‌ని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే జ‌న‌సేనను వినియోగించుకుని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు ఉన్న అన్ని మార్గాల‌ను వెతుకుతోంది. అయితే జ‌నసేన మాత్రం బీజేపీతో ఎప్పటి వ‌ర‌కు ఉంటుందో ? తెలియ‌దు ? అన్నది వేరే విష‌యం.

వ్యక్తి శక్తిగా మారడంతో…..

ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా.. వైసీపీ దూకుడు ఎక్కువ‌గా ఉంది. ఇప్పటి వ‌ర‌కు ఏ ఎన్నిక జ‌రిగినా.. జ‌గ‌న్ పార్టీదే అఖండ విజ‌యంగా ఉంది. ఇక‌, పార్టీ ప‌రంగా చూసుకుంటే.. నాయ‌కుల క‌న్నా కూడా పార్టీ అధినేత జ‌గ‌న్ కార‌ణంగానే పార్టీ నిల‌బ‌డింద‌నే భావన వ్యక్తమ‌వుతోంది. ఒక్క వ్యక్తి శ‌క్తిగా మారి.. రాష్ట్రంలో అధికారంలోకి రావ‌డం.. రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసించ‌డం.. వంటి విష‌యాల‌పై బీజేపీ పెద్దలు నిశితంగా దృష్టి పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఒక్క జ‌గ‌న్‌ను క‌నుక ప‌క్కకు త‌ప్పిస్తే.. వైసీపీ క‌కావిక‌లం కావ‌డం ఖాయ‌మ‌నే భావ‌న బీజేపీ జాతీయ‌ నేత‌ల్లో ఉంది.

ఎన్నికలకు ఏడాది ముందు…..

ఈ క్రమంలోనే ఎన్నిక‌ల‌కు ఏడాది ముందుగానే.. వ్యూహాత్మకంగా పావులు క‌దిపి.. పార్టీని బ‌లోపేతం చేసుకోవాల‌ని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ కేసుల్లో బెయిల్‌పై ఉన్న జ‌గ‌న్ ను ఈ కేసుల ఆధారంగానే ప‌క్కకు త‌ప్పించ‌డం ద్వారా త‌మ పనిని సులువు చేసుకునేందుకు క‌మల నాథులు స్కెచ్ వేస్తున్నారన్న ప్రచారం ఢిల్లీలో ఊపందుకుంది. జ‌గ‌న్‌ను క‌నుక ఎన్నిక‌ల‌కు ముందు ఏపీ నుంచి ప‌క్కకు త‌ప్పిస్తే.. పార్టీ త‌ర‌ఫున జెండా మోసే నాయ‌కులు కూడా బెదిరిపోవ‌డం ఖాయ‌మ‌ని.. అప్పుడు ఆ గ్యాప్‌ను తాము అందిపుచ్చుకోవ‌చ్చనేది క‌మ‌ల నాథుల ఆలోచ‌న‌గా ఉంది.

తమిళనాడు తరహాలో…..

త‌మిళ‌నాడులో జ‌య మ‌ర‌ణంతో క‌కావిక‌ల‌మైన అన్నాడీఎంకే రాజ‌కీయాల్లోకి దూరిన బీజేపీ అక్కడ ప‌న్నీర్ సెల్వం, ప‌ళ‌నిస్వామి మ‌ధ్య గ్యాప్‌ను క్యాష్ చేసుకుని వారిని బ‌ల‌వంతంగా పొత్తుకు ఒప్పించి మ‌రీ ఇప్పుడు అక్కడ అన్నాడీఎంకే ప్లేస్‌లోకి రావాల‌ని ప్రయ‌త్నాలు ప్రారంభించింది. ఇక ఇప్పుడు ఏపీలోనూ ఇదే స్ట్రాట‌జీతో ముందుకు వెళ్లాల‌న్నదే ఆ పార్టీ ప్లాన్‌. ఇప్పుడు ఇదే విష‌యం ఢిల్లీ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పాగా వేయాలంటే..త‌మ‌కు అనుకూలంగా ఉన్న పార్టీ లేదా త‌మ పార్టీనే అధికారంలోకి రావ‌డ‌మే బీజేపీ గేమ్ ప్లాన్‌. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. బీజేపీ చాలా ముందుచూపుతో అడుగులు వేస్తున్న ప‌రిస్థితి స్పష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News