బావురుమంటున్న ఆ వర్గం.. జగన్ పై గుస్సా.. ఫోర్ రీజన్స్
వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై సొంత సామాజిక వర్గం రెడ్లు గుస్సాగా ఉన్నారా ? ఖచ్చితంగా రెండేళ్ల కిందట.. మనోడు (జగన్) అధికారంలోకి రావాలని.. కోరుకున్న నోళ్లే [more]
వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై సొంత సామాజిక వర్గం రెడ్లు గుస్సాగా ఉన్నారా ? ఖచ్చితంగా రెండేళ్ల కిందట.. మనోడు (జగన్) అధికారంలోకి రావాలని.. కోరుకున్న నోళ్లే [more]
వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై సొంత సామాజిక వర్గం రెడ్లు గుస్సాగా ఉన్నారా ? ఖచ్చితంగా రెండేళ్ల కిందట.. మనోడు (జగన్) అధికారంలోకి రావాలని.. కోరుకున్న నోళ్లే ఇప్పుడు తెరచాటుగా తిట్టిపోస్తున్నాయా ? మనోడు అధికారంలోకి వచ్చినా.. మనకు ఒరిగిందేంటి? అని రెడ్డి సామాజిక వర్గమే.. బావురుమంటోందా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ముఖ్యంగా దివంగత వైఎస్ కార్డును పట్టుకుని అధికారంలోకి వచ్చిన జగన్‌ను రెడ్డి సామాజిక వర్గం.. వైఎస్‌ను ఆయనలో చూసుకుంది. తమ వాడు అధికారంలోకి వచ్చేస్తే.. తమకు ఖచ్చితంగా మేళ్లు జరుగుతాయని కూడా అనుకున్నారు.
కానీ, ఇప్పుడు అదే రెడ్డి సామాజిక వర్గం లబోదిబో మంటోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయని.. అంటున్నారు పరిశీలకులు. ఈ నాలుగు కారణాలతో రెడ్డి సామాజిక వర్గం జగన్‌కు దూరమవుతోందని చెబుతున్నారు.
1) సామాజిక గుర్తింపు లేదు: గతంలో చంద్రబాబు హయాంలో కమ్మ సామాజిక వర్గాన్ని అన్ని విధాలా ప్రాధాన్యం ఉండేది. పదవులు, కాంట్రాక్టులు, పనులు, ఇతరత్రా విషయాల్లో కమ్మలకు చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ, జగన్ వీరిని దాదాపు పక్కన పెట్టేస్తున్నారనే వాదన రెడ్డి వర్గంలో ఉంది. ఏ విషయంలోనూ వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అలాగని పైకి ఎవరినీ దూషించడం లేదు. కానీ, రెడ్డి వర్గం చేసిన ఒక్క సూచనను కూడా ఆయన పట్టించుకోవడం లేదు.
2) ఆర్థిక ఇబ్బందులు: జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు అయినా.. రెడ్డి సామాజిక వర్గం ఆర్థికంగా పుంజుకున్న పరిస్థితి కనిపించడం లేదు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చే ఏ పనులైనా.. వేరే వేరే సామాజిక వర్గాలకు లేదా.. బడా కాంట్రాక్టులకు, లేదా.. గతంలో టీడీపీలో ఉన్నవారికి ఇప్పుడు జగన్ కేటాయిస్తున్నారు. దీంతో వైసీపీకి చెందిన రెడ్డి సామాజిక వర్గం అల్లాడిపోతోంది.
3) పదవులు: పదవుల విషయంలో జగన్ తమకు అన్యాయం చేస్తున్నారని రెడ్డి వర్గం భావిస్తోంది. ఇటీవలజరిగిన స్థానిక ఎన్నికల్లోనూ.. కార్పొరేషన్ ఎన్నికల్లో ఆర్థికంగా పార్టీని బలోపేతం చేసి.. గెలిపించేందుకు ప్రయత్నించారు. అయితే.. జనరల్ కేటగిరిలో ఉన్న స్థానాల్లోనూ బీసీ వర్గాలకు చైర్మన్ కార్పొరేషన్ మేయర్ పీఠాలను అప్పగించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలో చాలా జనరల్ సీట్లను కూడా ఇతరులకు కట్టబెడుతున్నారు.
4) వైఎస్ సాటి కాదా ?: వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మెజారిటీ ప్రాధాన్యం రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. పదవులు కాంట్రాక్టులతోపాటు.. జిల్లాల వారీగా కూడా సొంత సామాజిక వర్గం బలోపేతం అయ్యేందుకు వివిధ ప్రాజెక్టులు తీసుకురావడం.. ఆర్థికంగా వారు పుంజుకునేలా చేయడం వంటివి చేశారు.కానీ, ఇప్పుడు జగన్.. ఆ తరహా వ్యూహం ఎక్కడా చూపించకపోవడంతో రెడ్డి సామాజిక వర్గంలో ఆగ్రహం కట్టలు తెగుతోందని.. అంటున్నారు పరిశీలకులు. ఎంత ప్రజాదరణ ఉందని, ఉంటుందని అనుకున్నా.. ఎన్నికల సమయంలో సామాజిక వర్గ సమీకరణలు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తాయని చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.