జ‌గ‌న్ దృష్టి మారాల్సిందే…. వైసీపీలో టాక్

ఔను! ఇప్పుడు ఈ మాటే వైసీపీ నేత‌ల మ‌ధ్య భారీ ఎత్తున హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మంత్రులు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఒక‌రి ద్దరు త‌ప్ప. ఎవ‌రూ [more]

Update: 2021-05-18 05:00 GMT

ఔను! ఇప్పుడు ఈ మాటే వైసీపీ నేత‌ల మ‌ధ్య భారీ ఎత్తున హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మంత్రులు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఒక‌రి ద్దరు త‌ప్ప. ఎవ‌రూ కూడా యాక్టివ్‌గా లేరు. దీనికి ప్రధాన కార‌ణం.. ప్రస్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితులే అంటున్నారు. రాష్ట్రంలో క‌రోనా కేసులు తీవ్రంగా ఉన్నాయి. కానీ, ప్ర‌భుత్వం మాత్రం అంతా బాగానే ఉంది.. ఎక్క‌డా ఏమీ జ‌ర‌గ‌డం లేదు అని ప్రభుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనినే జ‌గ‌న్ కానీ, ప్రభుత్వంలోని కీల‌క అధికారులు కానీ.. న‌మ్ముతున్నారు. కానీ, వాస్తవానికి పొగ‌డ్తల‌కు, జ‌గ‌న్ ఎక్కడ ఆగ్రహిస్తాడో అనే బెరుకువ‌ల్ల కావొచ్చు.. ఎవ‌రూ క్షేత్రస్థాయిలో నిజాలు చెప్పడం లేదు.

సొంత మీడియాలో….

అదే స‌మ‌యంలో సొంత మీడియాలోనూ జ‌గ‌న్‌కు అనుకూలంగా.. ప్రభుత్వం భారీ ఎత్తున సౌక‌ర్యాలు.. క‌ల్పిస్తోంద‌ని.. పెద్ద ఎత్తున వార్తలు రాస్తోంది. ప్రచారం కూడా అలానే చేస్తోంది. అయితే.. దీనికి భిన్నంగా ఓ వ‌ర్గం మీడియా ప్రచారం చేస్తోంది. ఫొటోలు, వీడియోలు.. ఆధారంగానే క్షేత్రస్థాయిలో ప‌రిస్థితి బాగోలేద‌ని.. ప్రభుత్వం చెబుతున్న సూచ‌ల‌ను, నిబంధ‌న‌ల‌ను ఏ ఆసుప‌త్రి, వైద్యులు కూడా పాటించ‌డం లేద‌ని గ‌గ్గోలు పెడుతున్నాయి. కానీ, జ‌గ‌న్ మాత్రం.. ఇదంతా ప్రతిప‌క్షాల కుట్ర! అనే కోణంలోనే చూస్తున్నారు.

కక్ష అంటూ….

అంతేకాదు.. ప్రభుత్వంపై ఇంకా క‌క్ష సాధించే ఉద్దేశంతోనే.. ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాల‌నే దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నార‌ని భావిస్తున్నారు. ఫ‌లితంగా క్షేత్రస్థాయిలో ప్రజ‌ల్లో ప్రభుత్వంపై న‌మ్మకం స‌న్నగిల్లుతోంద‌న్నది వాస్తవం. ఇది జాతీయ మీడియా కూడా చెబుతున్న వాస్తవం. అయిన‌ప్పటికీ.. జ‌గ‌న్ తాడేప‌ల్లి ఇల్లు నుంచి గ‌డ‌ప దాటి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఆసుప‌త్రుల్లో, క్షేత్రస్థాయిలో ఏం జ‌రుగుతోందో చూడ‌డం లేదు. దీంతో ఇప్పుడు జ‌గ‌న్ ప్రభ స‌న్నగిల్లే ప్రమాదం ఉంద‌ని అంటున్నారు.

క్షేత్రస్థాయిలో….

మ‌రోవైపు మంత్రులు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌పై దృష్టి పెడుతున్నా.. ప్రభుత్వ లెక్కల‌కు క్షేత్రస్థాయిలో గ‌ణాంకాల‌కు పొంతన లేక‌పోవ‌డంతో వారు కూడా నిమిత్తమాత్రులుగా ఉండిపోతున్నారు. ఈ క్రమంలోనే జ‌గ‌న్.. అన్ని విష‌యాల‌ను ఒకే దృష్టితో కాకుండా.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో క్షేత్రస్థాయిలో అన్ని మీడియాలను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News