వారిని వీరిని…వీరిని.. వారిని.. జగన్ కొత్త ఎత్తుగడ

వచ్చే ఎన్నికల్లో జగన్ యువనేతలకే ఎక్కువ అవకాశాలు కల్పించనున్నారు. తిరిగి అధికారంలోకి వస్తే తాను ఏం చేయాలన్న దానిపై కూడా జగన్ స్పష్టమైన కార్యాచరణను సిద్దం చేసుకుంటున్నట్లు [more]

Update: 2021-08-28 06:30 GMT

వచ్చే ఎన్నికల్లో జగన్ యువనేతలకే ఎక్కువ అవకాశాలు కల్పించనున్నారు. తిరిగి అధికారంలోకి వస్తే తాను ఏం చేయాలన్న దానిపై కూడా జగన్ స్పష్టమైన కార్యాచరణను సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈసారి అభ్యర్థుల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం సహకారం అవసరమని కూడా జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

యువ టీంతోనే…?

జగన్ వచ్చే ఎన్నికలకు యువ టీంతో నే వెళ్లాలన్న యోచనలో ఉన్నారు. వారసులు కాని, కొత్తవారు కాని వయసు పైబడిన వారికి రాజ్యసభ వంటి పదవులు ఇచ్చి యువతకే ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారికి పెద్దల సభకు అవకాశం కల్పించి, మిధున్ రెడ్డిని అసెంబ్లీకి తీసుకువస్తే మంచిదన్న భావనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. సీనియర్ నేతలతో జగన్ మెలగడం కూడా కష్టంగానే ఉంది.

అనేక మంది ఎంపీలకు….

కేవలం మిధున్ రెడ్డి మాత్రమే కాదు యువ ఎంపీలైన లావు శ్రీకృష్ణ దేవరాయలు, మార్గాని భరత్, నందిగం సురేష్, గోరంట్ల మాధవ్, కొత్తగా తిరుపతి ఎంపీగా ఎన్నికైన గురుమూర్తి వంటి వారిని అసెంబ్లీకి తీసుకురావాలన్న యోచనలో ఉన్నారు. పార్లమెంటుకు మాత్రం సీనియర్ నేతలను పంపాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమచారాన్ని బట్టి తెలుస్తోంది.

ఇప్పటికే సంకేతాలు….

వీరికి నియోజకవర్గాలను కూడా ఎంపిక చేశారని పార్టీలో టాక్ విన్పిస్తుంది. తాడేపల్లికి నందిగం సురేష్, రాజమండ్రి టౌన్ మార్గాని భరత్, హిందూపురానికి గోరంట్ల మాధవ్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరికి ఇప్పటికే జగన్ నుంచి సంకేతాలు వెళ్లినట్లు చెబుతున్నారు. ఆ నియోజకవర్గాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జగన్ సూచించడంతో ఈ ఎంపీలు ఇప్పటికే ఈ నియోజకవర్గాలపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మొత్తం మీద వచ్చే ఎన్నికలకు జగన్ టీం సిద్ధమవుతున్నట్లే కన్పిస్తుంది.

Tags:    

Similar News