వీరితో నో యూజ్… నో బెనిఫిట్

అవును… ఇప్పుడు ఈ అంశంపైనే అటు రాజ‌కీయ వ‌ర్గాల్లోను, ఇటు ప్రజ‌ల్లోనూ కూడా తీవ్రమైన చ‌ర్చ జ‌రుగుతోంది. జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో అన్ని సామాజిక వ‌ర్గాలకు ప్రాధాన్యం [more]

Update: 2019-12-28 02:00 GMT

అవును… ఇప్పుడు ఈ అంశంపైనే అటు రాజ‌కీయ వ‌ర్గాల్లోను, ఇటు ప్రజ‌ల్లోనూ కూడా తీవ్రమైన చ‌ర్చ జ‌రుగుతోంది. జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో అన్ని సామాజిక వ‌ర్గాలకు ప్రాధాన్యం క‌ల్పించారు. ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు కీల‌క ప‌ద‌వులు అప్పగించారు. అదే స‌మ‌యంలో ఐదుగురు డిప్యూటీ సీఎంల‌ను నియ‌మించుకున్నారు. త‌ద్వారా స‌మాజానికి త‌న ప్రాధాన్యాల‌ను జ‌గ‌న్ చెప్పక‌నే చెప్పారు. ఈ క్రమంలోనే జ‌గ‌న్ సోష‌ల్ ఇంజ‌నీరింగ్ విష‌యంలో ఒక్కసారిగా దేశ‌వ్యాప్తంగా హైలెట్ అయ్యారు. అయితే, ఇప్పుడు ఇలా నియ‌మించు కున్న పాతిక మంది మంత్రుల్లో ఆరు మాసాలు గ‌డిచేస‌రికి ఎవ‌రు ప‌నిచేస్తున్నారు ? ఎవ‌రు ఖాళీగా ఉన్నారు ? ఎవ‌రు దూకుడుగా ఉన్నారు ? ఎవ‌రు సైలెంట్ అయిపోయారు ? అనే చ‌ర్చ సాగుతోంది.

కొందరు అలా….

కొంద‌రు మంత్రులు పూర్తి సైలెంట్‌గా ఉంటున్నారు. మ‌రికొంద‌రు త‌మ హ‌ద్దులు దాటి మ‌రీ వ్యవ‌హ‌రిస్తున్నార‌నే అభిప్రాయం వ్యక్త‌మ‌వుతోంది. సైలెంట్‌గా ఉన్నవారిలో తానేటి వ‌నిత‌, పినిపే విశ్వరూప్‌, పుష్ప శ్రీవాణి, శంక‌ర నారాయ‌ణ, ధ‌ర్మాన కృష్ణదాస్‌ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. అస‌లు వారు కేబినెట్ లో ఉన్నారా? అనే సందేహాలు కూడా వ‌స్తున్నాయి. క‌నీసం వారానికి ఒక్కసారి కూడా వారు త‌మకు కేటాయించిన శాఖ‌ల‌పై స‌మీక్షలు కూడా నిర్వహించ‌డం లేద‌నే బ్యాడ్ నేమ్ వ‌స్తోంది.

దూకుడుగా ఉండేవారు….

అదే స‌మ‌యంలో జ‌గ‌న్ విజ‌న్‌కు త‌గిన విధంగా నిర్ణయాలు కూడా తీసుకోలేక పోతున్నార‌ని అంటున్నవారు పెరుగుతున్నారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ కేబినెట్‌లోని మంత్రులు కొడాలి నాని, అవంతి శ్రీనివాస్‌, శ్రీరంగ‌నాథ‌రాజు, బొత్స స‌త్యనారాయ‌ణ, ఆదిమూల‌పు సురేష్‌ వంటివారు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. వీరు త‌మ‌కు సంబంధం లేని విష‌యాల్లోనూ వేలు పెడుతున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి త‌మ‌కు కేటాయించిన పోర్ట్ ఫోలియోల‌ను స‌మ‌ర్ధంగా నిర్వహించ‌డం కంటే కూడా అన‌వ‌స‌ర విష‌యాల‌ను రాజ‌కీయం చేయ‌డం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయ‌డం ప‌రిపాటిగా మారింద‌ని వీరిపై ప్రత్యేకంగా చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఎందుకు ఇలా….

ఇక దూకుడుగా ఉన్న ఇద్దరు మంత్రులు ఆయా జిల్లాల్లో ఉన్న స్థానిక కార‌ణాల వ‌ల్ల సైలెంట్ అయిపోయార‌ని కూడా టాక్‌..? మొత్తంగా చూస్తే.. ఈ ఆరు మాసాల్లోనూ జ‌గ‌న్ కేబినెట్ లోని చాలా వ‌ర‌కు మంత్రులు సైలెంట్‌గా ఉండ‌డంపై అటు పార్టీ వ‌ర్గాల్లోనూ, ఇటు ప్రజ‌ల్లోనూ చ‌ర్చ న‌డుస్తోంది.

Tags:    

Similar News