రచ్చ…రచ్చే.. రక్ష…రక్షే

అధికారంలోకి వచ్చిన నాటినుంచి జగన్ సర్కార్ వివాదాల సుడిగుండంలోనే కొట్టుకుంటుంది. చంద్రబాబు కోటరిగా వున్న వారినందరిని ఏరి వేయడం తన సర్కార్ కి అనుకూలంగా వుండే వారిని [more]

Update: 2020-02-02 06:30 GMT

అధికారంలోకి వచ్చిన నాటినుంచి జగన్ సర్కార్ వివాదాల సుడిగుండంలోనే కొట్టుకుంటుంది. చంద్రబాబు కోటరిగా వున్న వారినందరిని ఏరి వేయడం తన సర్కార్ కి అనుకూలంగా వుండే వారిని నియమించుకోవడం తొలి ఘట్టంలో పూర్తి చేశారు ముఖ్యమంత్రి జగన్. ఆ తరువాత తనను ప్రతిపక్షంలో ఉండగా చుక్కలు చూపించిన వారిని వెంటాడి మరీ తన మార్క్ శిక్షలను అమల్లో పెట్టడం లో బిజీ అయ్యారు. అలాగే నాటి అధికారపక్షంలో ముఖ్యమైన కోడెల శివప్రసాద్ వంటి వారిని టార్గెట్ చేస్తూ చర్యలు చేపట్టి టిడిపి శిబిరానికి చెమటలు పట్టించారు. ఆ తరువాత ప్రజావేదిక కూల్చివేత చంద్రబాబు ఇల్లు ఉంచుతారా? పీకేస్తారా? అన్న చర్చ ఏపీ లో ప్రధానంగా నడిచింది. ఆ తరువాత ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లిష్ మీడియం రచ్చ బాగా సాగింది. అవి కూడా పూర్తి అయ్యాక తేనే తుట్టెను కదిలించిన జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చి విపక్షానికి నేటికీ నిద్ర లేని రాత్రులే మిగిల్చింది.

ఇక ప్రజలపై ఫోకస్ …

రాజకీయంగా తమను తొక్కిన వారందరిని తాట తీసిన అనంతరం ఇప్పుడు ప్రజలపై గట్టి ఫోకస్ పెట్టారు జగన్. ముందుగా తాను నవరత్నాల పథకాలు నేరుగా ప్రజలకు చేరాలంటే లక్షలమంది టీం అవసరాన్ని గుర్తించి గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి సంచలనం సృష్ట్టించారు ముఖ్యమంత్రి. జనవరిలో అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఒకేసారి 15 వేలరూపాయల నగదు మహిళల ఖాతాల్లోకి వచ్చి పడేలా చేసి కొత్త చరిత్ర సృష్ట్టించించారు జగన్. దాంతో మొదలైన ఆయన సంక్షేమం ఇప్పుడు నేరుగా ఇంటికే ఫించన్ పంచిపెట్టే కార్యక్రమం వరకు వెళ్ళింది.

వారి కళ్ళల్లో ఆనందం…

రోజుల తరబడి క్యూలలో నిలిచి వృద్ధాప్య, వితంతు, దివ్యంగా పెన్షన్ లు తీసుకునే వారు ఇక ఇప్పుడు ఎక్కడికి తిరగవలిసిన అవసరం లేదు. నేరుగా గ్రామ వాలంటీర్ ద్వారా వారి పెన్షన్ ఒకటో తేదీనే వచ్చే ఏర్పాటు పై ప్రజల్లో హర్షాతీరేకాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ ఆలోచనలు ఇప్పుడు ఒక్కొటొక్కటిగా పేదవర్గాలు అర్ధం చేసుకుంటున్నాయి. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమం నేరుగా దళారీలు లేకుండా తమకే వచ్చి చేరే విధానం బావుందనే టాక్ తో ఇప్పుడు జగన్ పార్టీ శ్రేణుల్లో హుషారు పెరిగింది. దాంతో వారు మరింతగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జోష్ చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఒక పక్క విపక్షాలకు రాజకీయ రుచి చూపిస్తూ తనను నమ్మి ఓట్లేసిన వారిని నిరాశ పరచకుండా జగన్ ఈ దూకుడు మరింత పెంచుతారని ఫ్యాన్ పార్టీలో జోరు మొదలైంది.

Tags:    

Similar News