అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్న మంత్రులెవ‌రు… జ‌గ‌న్ చేతిలో చిట్టా ?

సీఎం జ‌గ‌న్ మంత్రుల‌పై నిఘా పెట్టారా ? ఎవ‌రినీ ఆయ‌న విశ్వసించ‌డం లేదా ? ముఖ్యంగా పంచాయ‌తీ ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఏ మంత్రి ఎలా ప‌నిచేస్తున్నారు ? [more]

Update: 2021-04-08 02:00 GMT

సీఎం జ‌గ‌న్ మంత్రుల‌పై నిఘా పెట్టారా ? ఎవ‌రినీ ఆయ‌న విశ్వసించ‌డం లేదా ? ముఖ్యంగా పంచాయ‌తీ ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఏ మంత్రి ఎలా ప‌నిచేస్తున్నారు ? అస‌లు ఎన్నిక‌ల్లో అనుకున్న టార్గెట్ ఎందుకు సాధించ‌లేక పోయారు..? కొంద‌రు మాత్రమే ప‌ని చేస్తున్నారా? అనే అంశాల‌ను ఆయ‌న లోతుగా ప‌రిశీలిస్తున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు వైసీపీ కీల‌క నాయ‌కులు. ప్రస్తుతం ఈ విష‌యం అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య చాలా హాటి టాపిక్‌ అయింది. చిత్తూరు జిల్లాను తీసుకుంటే.. ఇద్దరు మంత్రులు జిల్లాను పంచుకున్నారు. కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని ప‌రుగులు పెట్టిస్తామ‌ని ప్రక‌టించారు.

జనసేన పుంజుకున్న చోట….

అయితే.. ఒక్క మంత్రి మాత్రమే అనుకున్న విధంగా పార్టీని పుంజుకునేలా చేశారు. మ‌రో మంత్రి చ‌తికిల ప‌డ్డారు., క‌డ‌ప‌లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి ఏర్పడింది. ఇక్క‌డ పార్టీకి కీల‌కంగా ఉన్న నాయ‌కుడు బాధ్యత‌లు తీసుకున్నారు. అయితే.. అనూహ్యంగా కొన్ని చోట్ల టీడీపీ అంచ‌నాల‌కు మించి పుంజుకుంది. ఇక‌, అనంత‌పురంలో మంత్రులు కూడా బాధ్యత‌లు తీసుకున్నా.. అనుకున్న విధంగా ప‌నిచేయ ‌లేదు. ఇక‌, తూర్పుగోదావ‌రిలో ఓ మంత్రి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన పుంజుకుంది. ఆయా విష‌యాల‌న‌ను జ‌గ‌న్ సీరియ‌స్‌గా భావిస్తున్నారు.

పనితీరుపై పరిశీలన….

కొంద‌రు మంత్రులు మాత్రమే ప‌నిచేస్తే.. మ‌రికొంద‌రు త‌మ ప‌ద‌వుల‌ను అడ్వాంటేజ్‌గా తీసుకున్నార‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రెవ‌రు క‌ష్టప‌డుతున్నారు. ఇంకెందకు ఈ ప‌ద‌వుల‌ను అడ్డు పెట్టుకుని పెత్తనం చేస్తున్నార‌నే విష‌యాల‌పై జగన్ నిఘా వ‌ర్గాల‌తోపాటు.. సొంత‌గా ఇద్దరు కీల‌క రెడ్డి సామాజిక వ‌ర్గం స‌ల‌హాదారుల‌తో నివేదిక‌లు తెప్పించుకున్నార‌ని తెలుస్తోంది. దీనిపై అధ్యయ‌నం చేస్తున్నార‌ని.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మంత్రి వ‌ర్గం ప్రక్షాళ‌న‌లో వారికి ఉద్వాస‌న ప‌ల‌క‌నున్నార‌ని అంటున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లోనైనా….?

ప్రస్తుతం ఈ విష‌యం పార్టీ వ‌ర్గాల‌కు పొక్కడంతో మంత్రులు అలెర్టయ్యారు. ఈ విష‌యం తెలిసిన కొంద‌రు మంత్రులు ప్రస్తుతం జ‌రుగుతున్న మునిసిపాలిటీ ఎన్నిక‌ల్లో పార్టీని విజ‌యం దిశ‌గా న‌డిపించేందుకు చెమ‌టోడుస్తున్నారు. జ‌గ‌న్ తేడా వస్తే ఎవ్వరిని ఉపేక్షించ‌ర‌న్న విష‌యం మంత్రుల‌కు తెలుసు.. అందుకే ప‌ద‌వులు కాపాడుకునేందుకు ఈ ఐదారు నెల‌లు మంత్రులు ఒళ్లు ద‌గ్గర పెట్టుకుని ఉండ‌క త‌ప్పని ప‌రిస్థితి.

Tags:    

Similar News