నెల్లూరు నేతలపై నిఘా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటు పాలన పరమైన కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు పార్టీ పరిస్థితిని కూడా అంచనా వేస్తున్నారు. పార్టీ నేతల మధ్య [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటు పాలన పరమైన కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు పార్టీ పరిస్థితిని కూడా అంచనా వేస్తున్నారు. పార్టీ నేతల మధ్య [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటు పాలన పరమైన కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు పార్టీ పరిస్థితిని కూడా అంచనా వేస్తున్నారు. పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు, అందుకు దారి తీసిన పరిస్థితులు ఎప్పటికప్పడు నిఘా నివేదికలను తెప్పించుకుని జిల్లా ఇన్ ఛార్జి మంత్రులను అప్రమత్తం చేస్తున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటనతో జగన్ ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
రెండు గ్రూపులుగా…..
నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి ఒక గ్రూపుగా, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక గ్రూపుగా తయారయ్యారు. వీఆర్ కళాశాల వ్యవహారంలో అనిల్, కోటంరెడ్డి తలదూర్చారు. వీఆర్ కళాశాల తొలి నుంచి ఆనం కుటుంబం ఆధిపత్యం కిందే ఉండటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే బహిరంగంగా నెల్లూరులో మాఫియాలంటూ ఆనం వ్యాఖ్యానించారు. దీనిపై ఆనం కు జగన్ షోకాజ్ నోటీసు ఇవ్వాలని కూడా నిర్ణయించారు.
విభిన్న వాదనలతో….
అయితే ఆ తర్వాత ఆనం రామానారాయణరెడ్డి కలసి జిల్లాలో జరుగుతున్న పరిణామాలను గురించి జగన్ కు వివరించారు. దీంతో ఆనంపై జగన్ కు ఉన్న ఆగ్రహం చల్లారింది. అయితే మరో వర్గం వాదనను కూడా జగన్ తెలుసుకున్నట్లు సమాచారం. మంత్రి పదవి దక్కలేదన్న అక్కసుతోనే ఆనం అలా వ్యవహరిస్తున్నారని మంత్రి అనిల్ వర్గం వాదిస్తోంది. వీఆర్ కళాశాల యాజమాన్యం విషయంలో సంస్కరణలు తీసుకువస్తేనే ప్రజల్లో పార్టీకి మరింత గుర్తింపు లభిస్తుందని వీరు చెప్పినట్లు తెలిసింది.
నివేదికలను మంత్రులకు….
రెండు వర్గాల వాదనలు విన్న తర్వాత జగన్ తాను ప్రత్యేకంగా నెల్లూరు నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను, పార్టీలో తలెత్తిన విభేదాలపై ప్రత్యేకంగా నిఘాను జగన్ పెట్టినట్లు తెలిసింది. అంతా ముదిరిపోయాక ఏమీ చేయలేమని, ముందుగానే పంచాయతీని తేల్చాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన వద్దకు వచ్చిన నిఘా నివేదికలను ఇన్ ఛార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డికి పంపారు. ఇలా జగన్ నెల్లూరు తరహాలోనే ప్రత్యేకంగా పార్టీ పరిస్థితిపై నిఘా నివేదికలు తెప్పించుకుంటున్నారని, వాటిని సంబందిత ఇన్ ఛార్జి మంత్రులకు పంపుతుండటంతో వారు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారని చెబుతున్నారు.