ఐటీ శాఖ రెడీ అట..వారి పని..?
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రావడంతోనే అమరావతి భూముల కొనుగోళ్ల బాగోతంపై గట్టి దృష్టి పెట్టింది. రాజధాని పేరుతో రియల్ వ్యాపారం కృష్ణా, గుంటూరు [more]
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రావడంతోనే అమరావతి భూముల కొనుగోళ్ల బాగోతంపై గట్టి దృష్టి పెట్టింది. రాజధాని పేరుతో రియల్ వ్యాపారం కృష్ణా, గుంటూరు [more]
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రావడంతోనే అమరావతి భూముల కొనుగోళ్ల బాగోతంపై గట్టి దృష్టి పెట్టింది. రాజధాని పేరుతో రియల్ వ్యాపారం కృష్ణా, గుంటూరు నడుమ నడిచింది అనేది అమరావతి ప్రకటన నుంచి నేటి వరకు అందరిలోనూ అనుమానాలే. ముఖ్యంగా వైసీపీ ఈ వ్యవహారంపై తాము అధికారంలోకి రాగానే దర్యాప్తు చేసి దోషుల సంగతి తెలుస్తామనే చెబుతూ వచ్చింది. అదే పని వచ్చిన వెంటనే ఒక మిషన్ గా చేపట్టింది కూడా.
ఫోకస్ దానిపైనే….
రాజధాని ప్రాంతం పై కూలంకషంగా అధ్యయనానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో బినామీలు చేసిన భూముల వివరాల సేకరణపైనే ప్రధానం గా ఫోకస్ పెట్టింది. అమరావతిలోని 33 వేలఎకరాల వివరాలు వడబోసి విడతీసేందుకు ఆరునెలలపైనే అధికారపార్టీకి పట్టింది. ఆ లెక్కలన్నీ వరుసగా బయటపెడుతూ వచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఇందులో ఎక్కువగా నేతల బినామి లే అధికంగా ఉన్నారని తేలిపోయింది.
ఐటి రంగంలోకి దిగుతుందా …?
అమరావతి లో ఆంధ్రప్రదేశ్ లో 800 ల మంది, 80 మంది తెలంగాణ కు చెందిన తెల్లరేషన్ కార్డు దారులు భూములు కొనుగోలు చేశారు. ఇప్పుడు వీరి పూర్తి వివరాలను సేకరించిన ప్రభుత్వం ఆదాయపు పన్ను శాఖకు వీటిని అందజేయనుంది అన్న సమాచారం బినామీలను రంగంలోకి దింపిన వారు బెంబేలెత్తుతున్నారు. తమ దగ్గర నమ్మకంగా డ్రైవర్లు, ఇంట్లో పనిచేసే వారు, పాలేర్లు గా ఉండేవారిని ఎంపిక చేసి వారిపేరిట కోట్ల రూపాయల విలువైన భూములు కొనుగోలు చేసేశారు.
ఆదాయపు పన్ను శాఖ….
దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవారు అన్నేసి కోట్లను ఎలా రాజధాని ప్రాంతంలో ఖర్చు చేయగలిగారు. వీరి వెనుక వున్న వారు ఎవరు అనేది తెలుసుకోవాలి అంటే ఐటి శాఖ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాలి. సర్కార్ ఇచ్చిన వివరాల అందుకున్న తరువాత అమరావతి లో ఉద్యమ వేడి చల్లారాక ఆదాయపు పన్ను శాఖ పనిలోకి దిగొచ్చని తెలుస్తుంది. అదే ఇప్పుడు బినామీ ల సృష్టికర్తలను కలవరపరుస్తోంది.