జగన్ ను నమ్మారు… గెలిచారు..!
ఒక నాయకుడిని నమ్మకొని ఉంటే.. కష్టాలెదురైనా పార్టీని నమ్ముకొని ఉంటే భవిష్యత్ బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపితమైంది. జగన్ నమ్ముకొని ఉన్న నేతలు ఇవాళ రాజకీయంగా [more]
ఒక నాయకుడిని నమ్మకొని ఉంటే.. కష్టాలెదురైనా పార్టీని నమ్ముకొని ఉంటే భవిష్యత్ బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపితమైంది. జగన్ నమ్ముకొని ఉన్న నేతలు ఇవాళ రాజకీయంగా [more]
ఒక నాయకుడిని నమ్మకొని ఉంటే.. కష్టాలెదురైనా పార్టీని నమ్ముకొని ఉంటే భవిష్యత్ బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపితమైంది. జగన్ నమ్ముకొని ఉన్న నేతలు ఇవాళ రాజకీయంగా తమ భవిష్యత్ ను మెరుగుపరుచుకున్నారు. జగన్ జెండాతో గెలిచి తాత్కాలిక అధికారం కోసం టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల రాజకీయ జీవితం ఓటమితో ఆగమ్యగోచరంగా మారగా.. జగన్ నమ్ముకొని పార్టీలోనే కొనసాగిన ఎమ్మెల్యేలంతా ఘన విజయం సాధించారు. ఇప్పుడు పార్టీ సైతం అధికారంలోకి రావడంతో వారు రాజకీయంగా మంచి స్థానంలో ఉండే అవకాశం ఉంది.
నమ్ముకున్న వారికి ఘన విజయం
వైఎస్సార్ మరణం తర్వాత జగన్ ను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేయాలని వంద మందికి పైగా ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలోకి వచ్చే వరకు జగన్ తో సుమారు 35 మంది ఉండేవారు. కిరణ్ అధికారంలోకి వచ్చి కొంత బలమైన నేతగా ఉన్నప్పుడు జగన్ వద్ద ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 18 మందికి పడిపోయింది. వీరంతా జగన్ తో ఉన్నందుకు అప్పుడు ఉప ఎన్నికలను సైతం ఎదుర్కుని 16 మంది గెలిచి ఇద్దరు ఓడిపోయారు. ఈ 16 మందిలో 2014 ఎన్నికల్లో కేవలం నలుగురు మాత్రమే గెలిచి 12 మంది ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన వారు సైతం వైసీపీలోనే కొనసాగుతు వస్తున్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలుగా జగన్ నాయకత్వాన్ని నమ్మి పనిచేసుకున్నారు. ఇలా పార్టీలోనే కొనసాగిన వారంతా ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. జగన్ తో 2012 నుంచీ ఉన్న వారు గత ఎన్నికల్లో గెలిచిన వారూ, ఓడిన వారూ ఈసారి ఒకరిద్దరు మినహా అంతా విజయం సాధించారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఓటమి
ఇక, గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 67 మంది విజయం సాధించారు. వీరిలో కొన్ని రోజులకే 23 మంది ఆపరేషన్ ఆకర్ష్ కు ఆకర్షితులై అధికార పార్టీలోకి ఫిరాయించారు. ఇలా వెళ్లిన 23 మందిలో ఇద్దరు మరణించగా మిగతా 21 మందిలో 15 మందికి మాత్రమే టిక్కెట్లు దక్కాయి. టిక్కెట్లు దక్కని వారిలో కొందరు పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు న్యాయం చేస్తారనే నమ్మకంతో టీడీపీలోనే ఉన్నారు. వీరికి అటు టిక్కెట్ దక్కక, పార్టీ అధికారంలోకి రాక వారి రాజకీయ జీవితం ప్రశ్నార్థకం అయ్యింది. ఇక టిక్కెట్లు దక్కించుకున్న వారిలో ఒక్క గొట్టిపాటి రవి మినహా మిగతా వారంతా ఓడిపోయారు. ఇదే సమయంలో ప్రలోభాలకు లొంగకుండా వైసీపీలోనే జగన్ నాయకత్వంపై నమ్మకంతో ఉన్న వారంతా భారీ మెజారిటీలతో తిరిగి విజయం సాధించారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి సైతం రావడంతో వారి భవిష్యత్ బాగుండే అవకాశం ఉంది. మంత్రి పదవులతో పాటు ఇతర అవకాశాలు పొందవచ్చు. మొత్తంగా తాత్కాలిక ప్రలోభాలకు లొంగిన రాజకీయ నేతలకు ఈసారి ప్రజలు బాగానే బుద్ది చెప్పినట్లు స్పష్టమవుతోంది.