రెక్కలను కట్ చేసిన జగన్
దేశంలో ఒకటే టాపిక్. అది అందనంత ఎత్తుకు దూసుకుపోతున్న ఉల్లిపాయల ధరలు. వీటిని అదుపులో పెట్టడానికి కేంద్రం సహా వివిధ రాష్ట్రాలు కిందా మీదా పడుతున్నాయి. అయినా [more]
దేశంలో ఒకటే టాపిక్. అది అందనంత ఎత్తుకు దూసుకుపోతున్న ఉల్లిపాయల ధరలు. వీటిని అదుపులో పెట్టడానికి కేంద్రం సహా వివిధ రాష్ట్రాలు కిందా మీదా పడుతున్నాయి. అయినా [more]
దేశంలో ఒకటే టాపిక్. అది అందనంత ఎత్తుకు దూసుకుపోతున్న ఉల్లిపాయల ధరలు. వీటిని అదుపులో పెట్టడానికి కేంద్రం సహా వివిధ రాష్ట్రాలు కిందా మీదా పడుతున్నాయి. అయినా అదుపు చేయలేని పరిస్థితికి నిత్యావసరమైన ఉల్లిపాయల రేట్లు పెరుగుతూ పోయాయి. కొన్ని రాష్ట్రాల్లో కేజీ వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు దాటిపోయాయి. కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధరలు చుక్కలు నంటడం వెనుక గత భారీ వర్షాలే కారణం అన్నది అందరికి తెలిసిందే. మహారాష్ట్ర, కర్ణాటక ల నుంచి ఉత్పత్తి అయ్యే పంటకు వరద దెబ్బ కొట్టింది. దాంతో పంట దిగుబడి భారీగా పడిపోయి ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి.
దేశంలోనే ఏపీ ఆదర్శం …
ఉల్లి ధరలను కంట్రోల్ చేయడంలో కానీ పేద, మధ్యతరగతి వర్గాలకు ఇబ్బందులు లేకుండా ఎపి లోని వైఎస్ జగన్ సర్కార్ గట్టి చర్యలే చేపట్టి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. రైతు బజార్లలో కేజీ 25 రూపాయలకే ఉల్లి ని రేషన్ కార్డులపై అందించి తక్షణ ఉపశమన కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన తీసుకుంది. ఈ చర్యలు బ్లాక్ మార్కెట్ ద్వారా ఉల్లిని అందనంత ఎత్తుకు తీసుకువెళ్లాలనుకున్న వారికి చెక్ పెట్టారు వైఎస్ జగన్. అంతే కాదు ఎపి లో కర్నూలు జిల్లాలో భారీగా ఉల్లి ఉత్పత్తి అవుతుంది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు కాకుండా రాష్ట్ర అవసరాల తరువాతే అవి బయటకు వెళ్లేలా సర్కార్ చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయం సత్ఫలితాలు ఇచ్చింది.
ఎగుమతుల నిషేధం …
క్వింటాల్ కి 14 వేల ధర పలికిన ఉల్లి ఎగుమతుల పై వున్న ఆంక్షల నేపథ్యంలో 8 వేల రూపాయాల ధరకు దిగి రాక తప్పలేదు. దాంతో ఇప్పుడు దేశంలో 180 రూపాయల ధర పలుకుతున్న ఉల్లి ఎపి లో మాత్రం కేజీ 45 రూపాయల నుంచి వందరూపాయల లోపే బహిరంగ మార్కెట్ లో లభ్యం అవుతున్నాయి. మరో పక్క రైతు బజార్ లో కిలో ఉల్లి 25 రూపాయలకు సరఫరా కావడంతో అక్రమార్కులకు జగన్ ఛాన్స్ లేకుండా చేయడం పట్ల అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఎపి లో ఉల్లి సాధారణ స్థాయి కి త్వరలోనే చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఉల్లి ధరలకు రెక్కలను జగన్ కత్తిరించిన తీరు ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను ఇతర రాష్ట్రాలు పాటించేందుకు పరిశీలిస్తుండటం విశేషం. దేశంలో ఉల్లి ఎగుమతులపై కేంద్రం సైతం నిషేధం విధించినా ధరలు మాత్రం ఇంకా అదుపులోకి రాకపోవడం సామాన్యుల్లో ఆందోళన పెంచుతుంది.