నెల రోజుల్లోనే కడప స్టీల్ కథ కంచికి…?
ఏపీలో నెల రోజులుగా రెండు స్టీల్ ప్లాంట్ వార్తలు పతాక శీర్షికల్లో నిలిచాయి. ఆంధ్రులకు సెంటిమెంట్‌గా ఉంటూ వస్తోన్న విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరణ చేస్తున్నట్టు చెప్పినప్పటి [more]
ఏపీలో నెల రోజులుగా రెండు స్టీల్ ప్లాంట్ వార్తలు పతాక శీర్షికల్లో నిలిచాయి. ఆంధ్రులకు సెంటిమెంట్‌గా ఉంటూ వస్తోన్న విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరణ చేస్తున్నట్టు చెప్పినప్పటి [more]
ఏపీలో నెల రోజులుగా రెండు స్టీల్ ప్లాంట్ వార్తలు పతాక శీర్షికల్లో నిలిచాయి. ఆంధ్రులకు సెంటిమెంట్‌గా ఉంటూ వస్తోన్న విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరణ చేస్తున్నట్టు చెప్పినప్పటి నుంచి స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేయాలని స్థానికంగా నిరసన దీక్షలు కంటిన్యూ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజాగ్రహం వ్యక్తమైంది. ఈ స్టీల్ ప్లాంట్ కథ ఇలా ఉండగానే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో కడప స్లీట్ ప్లాంట్ తెరమీదకు వచ్చింది. ఈ స్టీల్ ప్లాంట్ కథ నెలరోజుల్లోనే కంచికి చేరిపోయింది. విచిత్రం ఏంటంటే ఫిబ్రవరి 22వ తేదీ వరకు ఎంతో సూపర్ డూపర్ అనుకున్న కంపెనీ కేవలం నెల రోజుల్లోనే ఎలా దివాళా తీసిందో కూడా ఎవ్వరికి అర్థం కావడం లేదు.
వైఎస్ నుంచి….
అసలు కథలోకి వెళితే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి తొలిసారి సీఎం అయినప్పుడే కడప స్టీల్ ప్లాంట్ తెరమీదకు వచ్చింది. అప్పుడే దీనిని పూర్తి చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత వైఎస్ మరణాంతరం ఈ ప్రాజెక్టు అటకెక్కేసింది. మధ్యలో టీడీపీ హయాంలోనూ మాటల వరకే తప్ప చేతలు జరగేదు. ఇక గత ఎన్నికల ప్రచారంలో.. అంతకు ముందే కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేసి జిల్లాలో వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తామని పదే పదే చెపుతూ వచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యి రెండేళ్లయ్యింది.
రెండేళ్లవుతున్నా…
ఇప్పటి వరకు ఈ స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకోలేదు. ఎప్పుడు అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరమీదకు వచ్చిందో వెంటనే కడప స్టీల్ ప్లాంట్ తెరమీదకు తెచ్చారు. వాస్తవానికి విభజన చట్టం ప్రకారం కడప స్లీట్ ప్లాంట్‌ను పూర్తిగా కేంద్రం నిధులతోనే నిర్మించాలి. కాని నాడు చంద్రబాబు.. ఇప్పుడు జగన్ ఇద్దరూ సైతం ఈ ప్రాజెక్టును తాము నిర్మించుకుంటామని గొప్పలు చెప్పుకున్నారే తప్పా పనులు పూర్తి చేయలేదు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 22నే ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో లిబర్టీ స్టీల్ ప్లాంట్ భాగస్వామ్యంతో దీనిని నిర్మించాలని ఓకే చేశారు.
వేలాది మందికి ఉపాధి….
ఇందుకోసం ఏకంగా రు. 10082 కోట్లు ఖర్చు చేస్తున్నామని… త్వరలోనే స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కట్ చేస్తే మార్చి 31కే సీన్ రివర్స్ అయ్యింది. కడప స్టీల్ ప్లాంట్ కథ కంచికి చేరిపోయింది. లిబర్టీ స్టీల్ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కంపెనీ స్టీల్ ప్లాంట్‌లో భాగస్వామ్యంగా ఉన్నా ఉపయోగం లేదని ఏపీ పరిశ్రమలు, ఐటి శాఖ ల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రకటించారు. ఈ కంపెనీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశాన్ని పక్కన పెట్టేశామని ఆయన చెప్పారు. దీంతో అందరూ అవాక్కైపోయారు.
ఇప్పట్లో స్టీల్ ప్లాంట్ ను….
నెల రోజుల క్రితం వరకు ప్రభుత్వం ఈ కంపెనీ గురించి ఎంతో గొప్పగా చెప్పి అప్పుడే ఎలా ? ప్లేటు ఫిరాయించిందా ? అని షాక్ అయ్యారు. ఇక ఈ స్టీల్ ప్లాంట్‌ను ఎల్ 2 కంపెనీతో కలిసి ముందుకు వెళ్లాలా ? లేదా ప్రభుత్వమే సొంతంగా నిర్మించాలా ? అని ఆలోచన చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. ఏదేమైనా కడప స్లీట్ ప్లాంట్ ఇప్పట్లో ముందుకు కదిలేలా లేదు