నమ్మినబంటుకే ఛాన్స్ అట

రాజ‌కీయాల్లో న‌మ్మిన నాయ‌కుల‌కు పార్టీల అధినాయ‌కులు ఎప్పుడు ప్రత్యేకమైన స్థానాల‌నే క‌ల్పిస్తారు. ఇప్పుడు వైసీపీలోనూ ఇదే త‌ర‌హా న‌మ్మిన బంట్లుగా ఉన్న నాయ‌కుల‌కు సీఎం జ‌గ‌న్ మంచి [more]

Update: 2019-11-10 02:00 GMT

రాజ‌కీయాల్లో న‌మ్మిన నాయ‌కుల‌కు పార్టీల అధినాయ‌కులు ఎప్పుడు ప్రత్యేకమైన స్థానాల‌నే క‌ల్పిస్తారు. ఇప్పుడు వైసీపీలోనూ ఇదే త‌ర‌హా న‌మ్మిన బంట్లుగా ఉన్న నాయ‌కుల‌కు సీఎం జ‌గ‌న్ మంచి స్ధానాల‌నే క‌ల్పిస్తున్నారు. విష‌యంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు లేళ్ల అప్పిరెడ్డి. కాంగ్రెస్ హ‌యాంలోనే రాజ‌కీయాల్లో ఉన్న లేళ్ల అప్పిరెడ్డి వైఎస్‌కు అత్యంత ఆత్మీయుడిగా కొన‌సాగారు. ఈ క్రమంలోనే ఆయ‌న వైఎస్ కుటుంబానికి కూడా చేరువ‌య్యారు. ఇక‌, వైఎస్ చొర‌వ‌తో ఈయ‌న‌ను గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్‌గా కూడా నియ‌మించారు.

మంచి స్నేహితుడిగా….

ఆ త‌ర్వాత వైఎస్ మ‌ర‌ణం.. త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు లేళ్ల అప్పిరెడ్డి ద‌గ్గర‌య్యారు. కాంగ్రెస్‌ను వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ త‌ర్వాత పార్టీని బ‌లోపేతం చేసేందుకు జిల్లాలో కీల‌కంగా వ్యవ‌హరించా రు. జ‌గ‌న్ చేప‌ట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజ‌యవంతం చేసేందుకు లేళ్ల అప్పిరెడ్డి ఎంతో కృషి చేశారు. జ‌ల‌దీక్ష, విద్యాదీక్ష, రైతుదీక్ష స‌హా జ‌గ‌న్ చేప‌ట్టే ప్రతి కార్యక్రమం లోనూ కీల‌కంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే గుంటూరు న‌గ‌ర వైసీపీ అధ్యక్షుడుగా లేళ్ల అప్పిరెడ్డికి బాధ్యత‌లు అప్పగించారు జ‌గ‌న్‌. దీంతో ఈ ఇద్దరి మ‌ధ్య బంధం మ‌రింత పెరిగింద‌ని చెప్పడంలో సందేహం లేదు. గుంటూరుకు ఎప్పుడు వ‌చ్చినా.. జ‌గ‌న్‌ను ఎన్నోసార్లు త‌న కారులోనే తీసుకువెళ్లి.. హైద‌రాబాద్ లేదా క‌డ‌ప‌ల్లో లేళ్ల అప్పిరెడ్డి దింపి వ‌చ్చేవారు.

టిక్కెట్ ఇవ్వకున్నా…..

ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో అప్పటి వ‌ర‌కు గుంటూరు వెస్ట్ సీటు త‌న‌దేన‌ని భావించారు లేళ్ల అప్పిరెడ్డి. అప్పటి వ‌ర‌కు ఆయ‌నే ఈ సీటుకు ఇంచార్జ్‌గా ఉన్నారు. అయితే, 2014లో మాత్రం ఆయ‌న ఇక్క డ నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల రెడ్డిపై ఓట‌మి పోయారు. అయినా కూడా పార్టీని బ‌లోపేతం చేస్తూ.. అక్కడే ఉండిపోయారు. కానీ, ఎన్నిక‌ల‌కు ముందు మాజీ ఐజీ చంద్రగిరి ఏసు ర‌త్నంకు ఇక్కడ టికెట్ ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణయించుకున్నారు. బీసీ, ఆర్థిక‌కోణాల నేప‌థ్యంలోనే జ‌గ‌న్ ఇక్కడ సీటు మార్చాల‌ని డిసైడ్ అయ్యారు. దీంతో హ‌ఠాత్తుగా లేళ్ల అప్పిరెడ్డిని ఇక్క‌డ ప‌క్కన పెట్టారు. అయినా కూడా అధినేత మాట‌లే శిరోధార్యం అంటూ లేళ్ల అప్పిరెడ్డి ఎలాంటి హ‌డావుడి చేయ‌కుండా త‌ప్పుకొని ఏసుర‌త్నానికి స‌హ‌క‌రించారు.

పదవి ఖాయమంటూ….

ఇలా పార్టీ కోసం, జ‌గ‌న్ కోసం ఎంతో కృషి చేసిన లేళ్ల అప్పిరెడ్డికి జ‌గ‌న్ ద‌గ్గర మంచి ప్లేస్ ఉంది. లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మె ల్యే కాక‌పోయినా.. ఏ ప‌ద‌వులూ లేక పోయినా.. జ‌గ‌న్ ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఈక్ర‌మంలోనే లేళ్ల అప్పిరెడ్డికి ఏదైనా కీల‌క ప‌ద‌వి ఇవ్వాల‌ని జ‌గనే స్వయంగా భావిస్తున్నారు. వాస్తవానికి ఇప్పట్లో.. చాలా మందికి ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు. అయితే, రెడ్డి వ‌ర్గానికి ఇప్పటికే ఎక్కువ ప‌ద‌వులు ఉన్నాయి. అయిన‌ప్పటికీ.. లేళ్ల అప్పిరెడ్డికి ప‌ద‌వి ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే, ఎప్పుడిస్తారో అనేది స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ఇదిలావుంటే, ఇటీవ‌ల గుంటూరులో ప‌ర్యటించిన స‌మ‌యంలో జ‌గ‌న్ లేళ్ల అప్పిరెడ్డికి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఆయ‌న హ‌వా ఓ రేంజ్‌కు పెరిగిపోయింది. దీనిని గ‌మ‌నించిన జిల్లా ఎమ్మెల్యేలు, మిగిలిన నాయ‌కులు లేళ్ల అప్పిరెడ్డిని కాకాప‌డుతున్నారు. మరి లేళ్ల అప్పిరెడ్డికి పదవి దక్కుతుందా? లేదా? అన్నది త్వరలోనే తేలిపోనుంది.

Tags:    

Similar News