జగన్ కు బంధువులే భారమా..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు ఎన్నికల వేళ కొత్త తలనొప్పులు వస్తున్నాయి. బంధువులు కదా అని చూసీచూడనట్లు ఉంటే వారే ఆయనకు భారంగా మారుతున్నారు. [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు ఎన్నికల వేళ కొత్త తలనొప్పులు వస్తున్నాయి. బంధువులు కదా అని చూసీచూడనట్లు ఉంటే వారే ఆయనకు భారంగా మారుతున్నారు. [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు ఎన్నికల వేళ కొత్త తలనొప్పులు వస్తున్నాయి. బంధువులు కదా అని చూసీచూడనట్లు ఉంటే వారే ఆయనకు భారంగా మారుతున్నారు. ఒకరికొకరు గొడవలు పడుతూ రచ్చకెక్కుతున్నారు. ఎన్నికల ముందు పార్టీకి సమస్యలు తెస్తున్నారు. ప్రకాశం జిల్లాలో జగన్ కు బంధువులే సమస్యగా మారారు. ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి మధ్య వివాదం ఇప్పుడు రచ్చకెక్కింది. జగన్ లేని సమయంలో మీడియా ముందుకొచ్చి పార్టీకి ఇబ్బందికర పరిస్థులు తీసుకువస్తున్నారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తొడల్లుడు వైవీ సుబ్బారెడ్డి.. జగన్ పార్టీ స్థాపించిన నాటి నుంచీ ఆయనతోనే ఉంటున్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో కీలకంగా మారారు. గత ఎన్నికల్లో ఆయనకు ఒంగోలు పార్లమెంటు స్థానం కేటాయించగా 15 వేల ఓట్ల ఆధిక్యతతో టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై విజయం సాధించారు.
ఒంగోలు ఎంపీ సీటు కేంద్రంగా…
ఇక, వైవీ సుబ్బారెడ్డికి స్వయాన బావ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి. ఆయన కూడా వైఎస్ మరణం తర్వాత నుంచీ జగన్ తోనూ ఉంటున్నారు. జిల్లా పార్టీలో కీలక నేతగా ఉన్నారు. బావబావమరుదు శ్రీనివాసులు రెడ్డి, సుబ్బారెడ్డికి అస్సలు పొసగడం లేదు. జిల్లాలో ఇద్దరూ రెండు వర్గాలుగా ఉండటంతో పార్టీలో విభేదాలు తలెత్తుతున్నాయి. ఇంతకాలం అంతర్గతంగా ఉన్న ఈ విభేదాలు తాజాగా బయటపడ్డాయి. వైవీ సుబ్బారెడ్డి మీడియా ముందుకొచ్చి శ్రీనివాసులు రెడ్డిని ఉద్దేశించి సీరియస్ కామెంట్స్ చేశారు. టీడీపీలో అసంతృప్తితో ఉన్న పలువురు బలమైన నాయకులను టార్గెట్ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్.. టీడీపీ నేత, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ బాధ్యతలు తీసుకున్న విజయసాయిరెడ్డి సక్సెస్ అయ్యారని అంటున్నారు. త్వరలో మాగుంట వైసీపీలో చేరడం ఖాయమంటున్నారు. ఆయనను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇలా అయితే నష్టమే..!
ఇటీవల బాలినేని శ్రీనివాసులు రెడ్డి దర్శి నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ… ఒంగోలు ఎంపీగా కొత్త వారు నిలబడతారు అన్నట్లుగా సంకేతాలిచ్చారు. ఈ రెండు అంశాలను జీర్ణించుకోలేకపోయిన వైవీ మీడియా ముందే తన ఆగ్రహాన్ని వెల్లగక్కారు. పార్టీలో చేరుతారనుకుంటున్న మాగుంటను హేళన చేశారు. అదే సమయంలో బాలినేనిని సైతం ముందు ఆయన నియోజకవర్గంలో గెలవాలని వ్యాఖ్యానించారు. దీంతో జిల్లాలోనే కాకుండా, రాష్ట్ర పార్టీలోనూ ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. జగన్ కు దగ్గర బంధువులే ఇలా చేయడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేసే అవకాశం ఉంది. మరి, విదేశాల నుంచి వచ్చాక జగన్ వీటికి ఎలా చెక్ పడతారో చూడాలి.