వైఎస్ జగన్ కి జై కొడుతున్న కామ్రేడ్ లు
ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి జై కొట్టేస్తున్నారు కామ్రేడ్ లు. పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు వ్యతిరేకంగా తాజాగా నిరసన కార్యక్రమం తీసుకున్నారు కమ్యూనిస్ట్ [more]
ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి జై కొట్టేస్తున్నారు కామ్రేడ్ లు. పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు వ్యతిరేకంగా తాజాగా నిరసన కార్యక్రమం తీసుకున్నారు కమ్యూనిస్ట్ [more]
ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి జై కొట్టేస్తున్నారు కామ్రేడ్ లు. పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు వ్యతిరేకంగా తాజాగా నిరసన కార్యక్రమం తీసుకున్నారు కమ్యూనిస్ట్ లు. ఈ సందర్భంగా వారు మోడీ కెసిఆర్ లపై నిప్పులు చెరుగుతూ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తున్నారని సీరియస్ అయ్యారు. ఇలాంటి పనులు చేసే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు మూలన కూర్చున్నారని గుర్తు చేశారు. వయసులో చిన్నవాడైనా వైఎస్ జగన్ కాలి గోటికి బిజెపి, టీఆరెస్, టిడిపి లు పనిచేయవంటూ సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలే చేయడం గమనార్హం.
ఫిరాయింపులపై పెద్ద చర్చే నడిచేలా వుంది …
మరోవైపు ఎపి అసెంబ్లీ ప్రారంభం నుంచి వైసిపి ప్రతిపక్ష టిడిపికి ఇస్తున్న ప్రధాన అటాక్ ఫిరాయింపుల సంగతి గుర్తు చేస్తూ ఘోర ఓటమి బాధలో ఉన్నవారిపై పుండుమీద కారం చల్లేస్తుంది. స్వయంగా సిఎం జగన్ విపక్ష నేత చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ నేనే కనుక గేట్లు ఎత్తేస్తే విపక్షం ఉండదని సంతోషించండి అంటూ సెటైర్లు విసురుతున్నారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు తో చర్చకు సై అంటున్నారు. టిడిపి దీనిపై చర్చకు వస్తే మొత్తం భాగోతం జనం ముందు పెట్టాలని వైసిపి యోచన చేస్తుంది. ఇలా రెండు పార్టీలు సాగిస్తున్న మాటల యుద్ధాన్ని గమనించి ఫిరాయింపులపై ప్రత్యేక చర్చ చేపట్టేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం రెడీ అయ్యారు. త్వరలో ఫిరాయింపులపై జగన్ సర్కార్ చేపట్టబోయే చర్చపై తెలుగు రాష్ట్రాలే కాదు దేశం మొత్తం చూసే ఛాన్స్ వుంది.