జగన్.. ఎందుకిలా..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తలపడ్డాయి. చంద్రబాబు, జగన్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. అయితే, ఎన్నికల తర్వాత మాత్రం [more]

Update: 2019-05-02 02:30 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తలపడ్డాయి. చంద్రబాబు, జగన్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. అయితే, ఎన్నికల తర్వాత మాత్రం చంద్రబాబు ఒక్కరే హడావుడి చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం సైలెంట్ అయ్యారు. ఎన్నికల రోజు సాయంత్రం చిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన తర్వాత గవర్నర్ ను కలిసిన సందర్భంగా మాత్రమే మీడియాతో మాట్లాడారు. తర్వాత ఆయన ఎక్కడా మీడియాతో మాట్లాడటం లేదు. కనీసం పార్టీ నేతలతోనూ ఆయన ఎన్నికలపై ఎటువంటి చర్చలు జరపడం లేదు. దీంతో తమ అధినేత సైలెంట్ గా ఎందుకుంటున్నారో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అంతుచిక్కడం లేదు.

చంద్రబాబు హడావుడి

ఎన్నికల రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావుడి చేస్తున్నారు. ఎన్నికల సంఘంపై చిన్న తరహా యుద్ధాన్ని ప్రకటించిన ఆయన ఢిల్లీ వెళ్లి ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పలు పార్టీల నేతలను కలిశారు. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలోనూ పలుమార్లు మీడియాతో మాట్లాడారు. తర్వాత ఆయన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వైఖరిపైనా నిరసన తెలుపుతూ మీడియా ముందుకు వచ్చారు. ఇలా ఎన్నికల రోజు నుంచి అనేకసార్లు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ హడావుడి చేశారు. పార్టీకి సంబంధించిన సమీక్షలు సైతం జరిపారు. ఏయే నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి ఎలా ఉంది, విజయావకాశాలు ఎలా ఉన్నాయనే అంశాలపై అభ్యర్థులు, సీనియర్ నేతలతో చర్చలు జరిపారు. తాము కచ్చితంగా మళ్లీ గెలుస్తామని ధీమాగా చెబుతున్నారు.

సైలెంట్ గా ఉంటున్న జగన్…

ఇదే సమయంలో జగన్ మాత్రం సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎన్నికల రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన తాము అధికారంలోకి వస్తున్నామని మాత్రం చెప్పారు. పార్టీ గెలుపోటములపై కూడా జగన్ పెద్దగా సమీక్షలు, చర్చలు జరపలేదు. కేవలం రెండుమూడు సార్లు హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న సీనియర్ నేతలను పిలిపించుకొని మాట్లాడారు. తర్వాత హాలీడే కోసం షిమ్లాకు వెళ్లి వచ్చిన ఆయన పెళ్లిలకు హాజరవుతున్నారు. అయితే, అసలు జగన్ సైలెన్స్ కు కారణమేంటనేది వైసీపీ శ్రేణులకు అంతుచిక్కడం లేదు. పోలింగ్ సరళి వైసీపీకి అనుకూలంగా ఉందనే అంచనాలు వస్తున్నా జగన్ మాత్రం తమకు ధీమా ఇచ్చేలా ఎందకు మాట్లాడటం లేదో వారికి అంతుచిక్కడం లేదు. అయితే, జగన్ గెలుపుపై పూర్తి ధీమాగా ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

Tags:    

Similar News