జగనన్నా ఇది మీకు తెలుసా?

“బాబ్బాబు కాస్త జీతాలిప్పించి పుణ్యం కట్టుకోండి. రెండు నెలలుగా జీతాల్లేవు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు ఇన్నాళ్లూ ఆఫీసు ఊడ్చి, తుడిచి వచ్చినోళ‌్ళందరికి కాఫీలు, టీలు అందించి [more]

Update: 2019-09-24 13:09 GMT

“బాబ్బాబు కాస్త జీతాలిప్పించి పుణ్యం కట్టుకోండి. రెండు నెలలుగా జీతాల్లేవు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు ఇన్నాళ్లూ ఆఫీసు ఊడ్చి, తుడిచి వచ్చినోళ‌్ళందరికి కాఫీలు, టీలు అందించి సేవలు చేశాం. ఇప్పుడు ఎన్నికలవగానే మా బతుకులు రోడ్డున పడ్డాయి. ఉన్నఫళంగా జాబులు పోయాయి” అందరికి ఉద్యోగాలిస్తున్నారు. మమ్మల్ని మాత్రం చిన్న చూపు చూస్తున్నారు. ఎవరిని అడగాలో తెలీట్లేదని దిగులు పడుతున్న వారిని చూసి ఇన్నాళ్లు తమకు సేవ చేసిన వారి పరిస్థితి ఇలా అయ్యిందేమిటని అనుకోవడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి.

అధికారంలోకి వచ్చినా….

ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత అధికారంలోకి వచ్చామనే ఆనందానికి నెల కూడా పూర్తవకుండానే ఆ పార్టీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడ నుంచి తరలించడంతో విజయవాడలో పనిచేసిన మహిళల కుటుంబాలకు మళ్లీ ఉపాధి కరువైంది. ఇన్నాళ్లు వారందరికి జీత భత్యాలు చెల్లించిన పెద్ద తలకాయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన మీద పడితే ఎలా అని చేతులు దులుపుకోవడంతో ఆఫీస్ బాయ్‌లు., అటెండర్లు., కార్యాలయ మేనేజర్లుగా పనిచేసిన వాళ్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

తమకేం పని అంటూ…?

ఇంకాస్త పెద్ద పోస్టుల్లో పనిచేసిన వారికి కూడా జీతాలు నిలిచిపోయినా కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు. ప్రతి పక్షంలో ఉన్నపుడంటే పార్టీ నిర్వహణ బాధ్యతలు చూస్తాం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమ జేబులో నుంచి ఖర్చు పెట్టాలంటే ఎలా అని నేతలు ఎదురు ప్రశ్నిస్తుంటే జీతాలు, ఉద్యోగ భరోసా కోసం వెళ్లిన వారు బిక్కముఖం వేసుకుని చూడ్డం తప్ప ఏమి చేయలేని పరిస్థితి.

Tags:    

Similar News