ఇక “మిడిల్ క్లాస్” జగన్ అట.. కాస్కోమంటున్న వైసీపీ

రాష్ట్రంలో వైసీపీ స‌ర్కారు పాల‌న‌లో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమ‌లు చేస్తున్నారు. గ‌త ప్రభుత్వాల‌కు భిన్నంగా జ‌గ‌న్ దూకుడుగా ఆయా కార్యక్రమాల‌ను ముందుకు తీసుకువెళ్తున్నారు. పింఛ‌న్ల పెంపు, [more]

Update: 2021-01-15 02:00 GMT

రాష్ట్రంలో వైసీపీ స‌ర్కారు పాల‌న‌లో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమ‌లు చేస్తున్నారు. గ‌త ప్రభుత్వాల‌కు భిన్నంగా జ‌గ‌న్ దూకుడుగా ఆయా కార్యక్రమాల‌ను ముందుకు తీసుకువెళ్తున్నారు. పింఛ‌న్ల పెంపు, పేద‌ల‌కు ఇళ్లు, వాహ‌న మిత్ర.. ఇత్యాది అనేక ప‌థ‌కాల‌తో జ‌గ‌న్ స‌ర్కారు దూసుకుపోతున్న మాట వాస్తవ‌మే. అయితే.. ఈ ప‌థ‌కాలను త‌ర‌చి చూస్తే.. ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకోకుండా ఏ ప్ర‌భుత్వం కూడా ఏదీ చేయ‌ద‌నే విష‌యం సుస్ప‌ష్టం. కానీ, ఇప్పటి వ‌ర‌కు జ‌గ‌న్ ప్రభుత్వం వేసిన అడుగులు పేద‌లు, కార్మికులు, రైతుల వైపే సాగుతున్నాయ‌న‌నే భావ‌న స‌ర్వత్రా వినిపిస్తోంది. మ‌రి రాష్ట్రంలో వీరి కోస‌మే ప్రభుత్వం ఏర్పడిందా ? అనేది ప్రశ్న.

మధ్యతరగతి ప్రజల కోసం…..

మ‌రీ ముఖ్యంగా మ‌ధ్య త‌ర‌గ‌తి ప్రజ‌ల స‌గ‌టు రేటు పెరుగుతోంది. ఈ క్రమంలో వారిని కూడా మ‌చ్చిక చేసుకోవ‌డం.. ప్రభుత్వాల విధి. ఓటు బ్యాంకు రాజ‌కీయాల్లో ఎప్పుడూ కీల‌కంగా ఉండేది వీరే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇప్పటి వ‌ర‌కు జ‌గ‌న్ వీరిని ఆక‌ట్టుకునేందుకు పెద్దగా ఎలాంటి ప్రయత్నం చేయ‌లేదు. పైగా పెట్రోలు ధ‌ర‌ల పెంపు, భూమి శిస్తుల పెంపు, నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల పెంపు వంటి వాటితో మ‌ధ్యత‌ర‌గ‌తి ప్రజ‌ల‌పై భారాలు మోపుతున్నార‌నే ప్రచారం ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఈ క్రమంలో వెంట‌నే మేల్కొన్న జ‌గ‌న్ స‌ర్కారు.. మ‌ధ్యత‌ర‌గ‌తి ప్రజ‌ల‌ను కూడా త‌న‌వైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయ‌డం ప్రారంభించింది.

క్లియర్ టైటిల్ తో….

ఈ క్రమంలో రాష్ట్రంలోని మధ్య తరగతి ప్రజలకు 'క్లియర్‌ టైటిల్'‌తో తక్కువ ధరకు ప్లాట్‌ ఇవ్వాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. పట్టణాలు, నగరాల్లోని మ‌ధ్యత‌ర‌గ‌తి ప్రజ‌ల‌ను వైసీపీ వైపు మ‌ళ్లించుకునేందుకు ఇంత‌కు మించిన మార్గం లేద‌నేది ప్రభుత్వ వ్యూహంగా క‌నిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో స‌గానికిపైగా మ‌ధ్యత‌ర‌గ‌తి ప్రజ‌ల‌కు సొంత ఇళ్లు లేవ‌నేది వాస్తవం. ఈ క్రమంలో వారికి క‌నుక సొంత ఇల్లు ఏర్పాటు చేస్తే.. ఇక‌, జ‌గ‌న్ స‌ర్కారుకు తిరుగు ఉండ‌ద‌నేది ప్రధాన భావ‌న‌.

లే అవుట్లను అభివృద్ధి చేసి….

ఈ క్రమంలో ప్రభుత్వమే లే అవుట్లను అభివృద్ధి చేసి ప్లాట్లను లబ్ధిదారులకు కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు ప్రభుత్వమే ఫ్లాట్ల‌ను ఇస్తే.. ఇది రాష్ట్రంలో రికార్డు కార్యక్రమ‌మే అవుతుంది. ఇప్పటి వ‌ర‌కు మ‌ధ్యత‌ర‌గ‌తి గురించి ఏ ప్రభుత్వమూ ప్లాన్ చేయ‌లేదు. ఈ క్రమంలో మధ్య తరగతి ప్రజల కోసం ఏదైనా చేయాలన్న భావ‌న‌లో జ‌గ‌న్ స‌ర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఇది క‌నుక స‌క్సెస్ అయితే.. రాష్ట్రంలో మ‌ధ్యత‌ర‌గ‌తి ఓటు బ్యాంకు ఖ‌చ్చితంగా వైసీపీ ప‌రం అవుతుంద‌నేది ఆ పార్టీ సీనియ‌ర్ల ఆలోచ‌న కూడా. మ‌రి జ‌గ‌న్ ఎలా ముందుకు సాగుతారో చూడాలి.

Tags:    

Similar News